ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రాథమికాంశాలు: ఫిలిం యొక్క చరిత్ర
→‎ఫిలిం యొక్క చరిత్ర: చరిత్ర పరిపూర్ణం
పంక్తి 14:
 
==ఫిలిం యొక్క చరిత్ర==
పూర్వం ఛాయాచిత్రాలకి [[డాగ్యురోటైప్]] లని వాడేవారు. ఈ ప్రక్రియలో అసలు ఫిలిం అనేదే ఉండేది కాదు. కాంతికి బహిర్గతమవ్వగానే రసాయనిక చర్యలకి లోనయ్యే సిల్వర్ పూత పూయబడిన రాగి పళ్ళెమును ఉపయోగించేవారు. ప్రత్యమ్నాయ పద్ధతి అయిన [[క్యాలోటైప్]] కాగితాన్నే నెగటివ్ గా మార్చివేసేది. 1850 నుండి ఛాయాచిత్రపుఛాయాచిత్ర రసాయనాల సమ్మేళనం (Photographic Emulsion) పూయబడిన దళసరి గాజు పళ్ళెముల ఉపయోగం ప్రారంభమైనది. పెళుసుగా, భారీగా ఉన్ననూ గాజు పళ్ళేలు చవకగా లభ్యమవటం, మునుపు వాడే ప్లాస్టికి పళ్ళేలతో పోలిస్తే నాణ్యత ఎక్కువగా ఉండటం మూలాన ఇది ప్రామాణిక మాధ్యమం గా మారినది. ఫిలిం వాడుక మొదలయ్యే వరకు, గాజు పళ్ళేలు వాడుకలో ఉండేవి. ఇప్పటికీ గాజు పళ్ళేలు శాస్త్రీయ అవసరాలకు వినియోగించబడుతున్నాయి.
 
ఫోటోగ్రఫిక్ మిశ్రమముల యొక్క కాంతిని గుర్తించే తత్త్వము పై 1876 లో హర్టర్ మరియు డ్రిఫ్ఫీల్డ్ అనే శాస్త్రవేత్తలు మొట్ట మొదట పరిశోధనలు మొదలు పెట్టారు. [[ఫిలిం వేగం|ఫిలిం వేగాన్ని]] పరిమాణాత్మకంగా కొలవటానికి శ్రీకారం చుట్టారు.
 
1885 లో మొట్ట మొదటి ఫిలిం చుట్టని [[జార్జి ఈస్ట్మన్]] చే రూపొందించబడినది. వాస్తవానికి ఇది ఫోటోగ్రఫిక్ మిశ్రమము యొక్క పూత పూయబడిన ఒక కాగితం. సంవర్థన ప్రక్రియలో ఫోటోగ్రఫిక్ మిశ్రమముని కాగితం నుండి వేరు చేసి, గట్టిగా ఉండే జెలటిన్ ఉపరితలం పైకి మార్చుకొనేవారు. 1889 లో మొట్టమొదటి పారదర్శక నైట్రో సెల్యులోజ్ తో తయారు చేసి ఫిలిం చుట్ట రూపొందించబడినది. దీని రసాయనిక తత్త్వము వల ఇది అంటుకుపోయే ప్రమాదం ఉండేది.
 
1908 లో ఈ ప్రమాదకర ఫిలింకి ప్రత్యామ్నాయంగా సెల్యులోజ్ అసిటేట్ తో చేయబడే ఫిలిం చుట్ట కొడాక్ చే నిర్మించబడినది. ఇది పటిష్టంగా, మరింత పారదర్శకంగా మరియు చవకగా లభ్యమయ్యేది. 1933 లో ఎక్స్-రే ఫిలిం కనుగొనబడినది. 8mm ఫిలిం, 16mm ఫిలిం లు ఇంట్లోనే చలనచిత్రాలని తీయటానికి ఉపయోగం లో ఉండగా, 35mm చలనచిత్రాలని చిత్రీకరించటానికి మాత్రం 1951 వరకూ ఉపయోగించారు.
 
==ప్రాథమికాంశాలు==
ఫిలింలలో ఈ క్రింది రకాలు కలవు.
"https://te.wikipedia.org/wiki/ఫిల్మ్" నుండి వెలికితీశారు