తూమాటి దోణప్ప: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
తూమాటి దోణప్ప విద్యార్థిదశలో నాటకాలలో నటించి రాణించాడు. చింతామణి నాటకంలో 'చిత్ర'పాత్రధారిగా, 'సుభద్రా పరిణయం'లో సుభద్ర పాత్రను, 'మోహినీరుక్మాంగద'లో రుక్మాంగద పాత్రను ధరించి అనేక పతకాలను పొందాడు. [[పుట్టపర్తి]] [[సత్యసాయిబాబా]] పూర్వాశ్రమంలో రత్నాకరం సత్యనారాయణరాజు స్త్రీ పాత్రలు ధరించగా అతనితో కలిసి ఇతడు భర్తగా, మామగా అనేక నాటకాలలో పాత్రధారణ చేశాడు. సాయిలీల అనే నాటకంలో దోణప్ప ఒకసారి సాయిబాబాగా, ఒకసారి శిష్యుడిగా, మరోసారి మహావిష్ణువుగా నటించాడు.
==రచనలు==
ఇతని సాహిత్య రచనా వ్యాసంగం హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో చదివేరోజుల్లోనే ఆరంభమయింది. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు [[చిత్రగుప్త]]లో ఇతని ''చంద్రుడు-కలువ'' అనే మొట్టమొదటి కథ అచ్చయింది. హైస్కూలులో చదివే సమయంలోనే ఇతడు [[వినోదిని]], [[రూపవాణి]], [[ఆనందవాణి]], [[ఢంకా]], [[సూర్యప్రభ]], [[ప్రజాబంధు]] మొదలైన పత్రికలలో పద్యాలు, గేయాలు, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా ప్రకటించాడు. దత్తమండల కళాశాలలో చదివేరోజులలో ఇతడు పద్యరచనలో, వ్యాసరచనలో ఎన్నో ప్రథమబహుమానాలు పొందాడు. "బైబిలు-కొరాను-భగవద్గీత" అనే అంశంపై వ్యాసరచనచేసి మీనాక్షీసుందరాంబా స్మారక బహుమానాన్ని పొందాడు. 1949 మే,జూన్ మాసాల్లో [[ఆంధ్రప్రభ]] దినపత్రికలో మాండలిక పదవ్యాసాలను ప్రకటించాడు.[[వాల్తేరు]]లో చదివేరోజుల్లో గేయ పద్య ఏకాంకికా రచనలు ఎన్నో చేశాడు. ఏకాంకికరచనల పోటీలో ఇతని 'ఆదర్శశిఖరాలు' మొదటి బహుమతి పొందింది. ఈ ఏకాంకిక [[జయశ్రీ]] పత్రికలో అచ్చయింది. శ్రీశ్రీ దేశచరిత్రలకు పేరడీగా హాస్టలుచరిత్ర వ్రాస్తే దానిని ఆనాటి విశ్వవిద్యాలయ కులపతి అనేక సార్లు చదివించుకుని ఆనందించాడు.
 
ఇతడు ప్రకటించిన గ్రంథాలు ఈ విధంగా ఉన్నాయి.
పంక్తి 61:
# బాలల శబ్ద రత్నాకరం
# తెలుగు మాండలిక శబ్దకోశం
 
==పురస్కారాలు==
* 1965,1966లో వరుసగా [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]] నుండి [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]] స్వర్ణపతకాలు.
"https://te.wikipedia.org/wiki/తూమాటి_దోణప్ప" నుండి వెలికితీశారు