నాదీ ఆడజన్మే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
ఈ చిత్రానికి మూలం '''నానుమ్ ఒరుపెణ్''' అనే విజయవంతమైన తమిళ చిత్రం. శ్రీశైలేష్ డే రచించిన బెంగాలీ కథను ఆధారంగా చేసుకుని ఈ తమిళ చిత్రం నిర్మితం అయి మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో ఏవియం బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించిన [[మెయ్యప్పన్ చెట్టియార్|మెయ్యప్పన్ చెట్టియార్‌ను]] ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయమని విజయా పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధినేత పూర్ణచంద్రరావు వంటి వారు కోరినా ఆయన అంగీకరించలేదు. తమిళ మాతృకలో జమీందారు పాత్రను ధరించి ప్రశంసలు పొందిన [[ఎస్.వి.రంగారావు]] తెలుగులో కూడా ఈ చిత్రం నిర్మితం కావాలని, తాను తెలుగులో అదే పాత్ర ధరించాలని కోరిక వుండి తనకు చెట్టియార్‌తో ఉన్న చనువును పురస్కరించుకుని రీమేక్ హక్కుల్ని తనకివ్వమని కోరారు. చెట్టియార్ రంగారావును ఆశ్చర్యపరుస్తూ ''హక్కులు ఇవ్వడం ఎందుకు? ఇద్దరం భాగస్వాములుగా నిర్మిద్దామని'' ప్రతిపాదించారు. అంతటి నిర్మాత తనవంటి కొత్తగా నిర్మాత అయినవాడితో సినిమా తీద్దామనే సరికి ఆశ్చర్యానందాలతో అంగీకరించారు. అలా సినిమా తెలుగులో రీమేక్ చేయడం ప్రారంభమైంది.<ref name="ఆదివారం ఆంధ్రజ్యోతి">{{cite journal|last1=రవిచంద్రన్|first1=కంపల్లె|title=నాదీ ఆడజన్మే-నలుపును నిలదీసిన చిత్రం|journal=ఆదివారం ఆంధ్రజ్యోతి|date=11 january 2015}}</ref>
== కథాంశం ==
చిల్లరకొట్టు వ్యాపారి సింహాద్రి అప్పన్నకు ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు కళ్యాణి, చిన్న చెల్లెలు మాలతి. ఇద్దరూ సుగుణవతులే అయినా కళ్యాణి చదువుకోలేదు, నల్లగా వుంటుంది. ఆ గ్రామ జమీందారు విజయ రాజేంద్రప్రసాద్ డబ్బున్నవాడైనా ఒంటరితనంతో నిత్యం మరణించిన భార్య జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ జీవిస్తూంటాడు. ఆయన పెద్దకుమారుడు భాస్కర్, చిన్నకుమారుడు చంద్రం.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/నాదీ_ఆడజన్మే" నుండి వెలికితీశారు