నాదీ ఆడజన్మే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
ఈ చిత్రానికి మూలం '''నానుమ్ ఒరుపెణ్''' అనే విజయవంతమైన తమిళ చిత్రం. శ్రీశైలేష్ డే రచించిన బెంగాలీ కథను ఆధారంగా చేసుకుని ఈ తమిళ చిత్రం నిర్మితం అయి మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో ఏవియం బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించిన [[మెయ్యప్పన్ చెట్టియార్|మెయ్యప్పన్ చెట్టియార్‌ను]] ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయమని విజయా పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధినేత పూర్ణచంద్రరావు వంటి వారు కోరినా ఆయన అంగీకరించలేదు. తమిళ మాతృకలో జమీందారు పాత్రను ధరించి ప్రశంసలు పొందిన [[ఎస్.వి.రంగారావు]] తెలుగులో కూడా ఈ చిత్రం నిర్మితం కావాలని, తాను తెలుగులో అదే పాత్ర ధరించాలని కోరిక వుండి తనకు చెట్టియార్‌తో ఉన్న చనువును పురస్కరించుకుని రీమేక్ హక్కుల్ని తనకివ్వమని కోరారు. చెట్టియార్ రంగారావును ఆశ్చర్యపరుస్తూ ''హక్కులు ఇవ్వడం ఎందుకు? ఇద్దరం భాగస్వాములుగా నిర్మిద్దామని'' ప్రతిపాదించారు. అంతటి నిర్మాత తనవంటి కొత్తగా నిర్మాత అయినవాడితో సినిమా తీద్దామనే సరికి ఆశ్చర్యానందాలతో అంగీకరించారు. అలా సినిమా తెలుగులో రీమేక్ చేయడం ప్రారంభమైంది.<ref name="ఆదివారం ఆంధ్రజ్యోతి">{{cite journal|last1=రవిచంద్రన్|first1=కంపల్లె|title=నాదీ ఆడజన్మే-నలుపును నిలదీసిన చిత్రం|journal=ఆదివారం ఆంధ్రజ్యోతి|date=11 january 2015}}</ref>
== కథాంశం ==
చిల్లరకొట్టు వ్యాపారి సింహాద్రి అప్పన్నకు ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు కళ్యాణి, చిన్న చెల్లెలు మాలతి. ఇద్దరూ సుగుణవతులే అయినా కళ్యాణి చదువుకోలేదు, నల్లగా వుంటుంది. ఆ గ్రామ జమీందారు విజయ రాజేంద్రప్రసాద్ డబ్బున్నవాడైనా ఒంటరితనంతో నిత్యం మరణించిన భార్య జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ జీవిస్తూంటాడు. ఆయన పెద్దకుమారుడు భాస్కర్, చిన్నకుమారుడు చంద్రం. సింహాద్రి అప్పన్న విద్యావంతురాలు కాని నల్లనిదైన పెద్ద చెల్లెలు పెళ్ళి చేసేందుకు, జమీందారు బావమరిది దశరథరామయ్యతో కుట్ర చేసి పెళ్ళిచూపుల్లో భాస్కర్‌కి మాలతిని చూపించి అనుకోని స్థితిగతుల్లో కళ్యాణికి తాళికట్టాల్సివచ్చేట్టు చేస్తారు. కళ్యాణి నల్లనిదని కొన్నిరోజులు గిజాటులాడినా ఆమె మంచితనం, సుగుణాలను చూసి జమీందారు చల్లపడతాడు. కానీ వారందరూ సంతోషంగా గడపడం నచ్చని దశరథరామయ్య కుట్రజేసి కళ్యాణికి, ఆమె మరిది చంద్రానికి అక్రమసంబంధాన్ని అంటగట్టి, నిష్కల్మషమైన ఆమెపై చెడ్డ ఆరోపణలు చేసి జమీందారు మనసును విషతుల్యం చేసి ఇంటినుంచి కళ్యాణిని గెంటిస్తారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/నాదీ_ఆడజన్మే" నుండి వెలికితీశారు