నేదునూరి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
సంగీత లోకంలో ప్రముఖ స్థానం సంపాయించుకున్నారు.సంగీత అకాడమీలో యాబై యేళ్ళకు పైగా పాడారు. తన సుదీర్ఘ సంగీత యాత్రలో అనేక సంగీత కోవిదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ద్వారం వెంకట స్వామి నాయుడు దగ్గరనుంచి, డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి, లాల్గుడి జయరామన్‌, ఎం ఎస్‌ సుబ్బులక్ష్మి, పేరి శ్రీరామమూర్తి (వయొలిన్‌), వెంకటరమణ (మృదంగం), నేమాని సోమయాజులు (ఘటం) ఇత్యాదులు నేదునూరి ప్రతిభను కొనియాడేవారు. నేదునూరి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందారు.
 
==విభిన్న పదవులు==
నేదునూరి విజయవాడ జీ వీ ఆర్‌ ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల, ప్రధాన అధ్యాపకుడిగా, సికింద్రాబాద్‌, విజయనగరం, తిరుపతి సంగీత కళాశాలలో పనిచేసారు. వేంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో ఆర్ట్‌‌స విభాగం డీన్‌ , బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా, ఆల్‌ ఇండియా రేడియో, సంగీత విభాగ ఆడిషన్‌ (ఆడిషన్‌) బోర్డ్‌ సభ్యుడిగా పనిచేసారు. 1985లో ప్రభుత్వ కొలువు నుంచి రిటైర్‌ అయ్యి ఉపకార వేతనం తీసుకుంటున్నారు. కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ అచార్యుడిగా ఉన్నారు.