ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
}}
==చరిత్ర==
దత్తమండలాలను ఉద్దరించి చైతన్యవంతం చేయాలనే తలంపుతో అలనాటి డి.పి.ఐ. జె.హెచ్.స్టోన్ దొరగారి ప్రమేయంతో [[అనంతపురం]] మునిసిపల్ హైస్కూలులో కాలేజి ఏర్పడింది. [[1916]] [[జులై 8]]వ తేదీనాడు ద్వితీయశ్రేణి కళాశాలగా ఆవిర్భవించిన ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ ఎస్.ఇ.రంగనాథన్. 41 విద్యార్థులతో, హిస్ట్రరీ, తెలుగు, కన్నడ, సంస్కృత, తత్త్వశాస్త్ర బోధనాంశాలతో ప్రారంభమైన ఈ కళాశాల ఆర్థికంగాను, అధ్యాపకుల కొరతతోను మొదట్లో కొంత ఇబ్బంది పడింది. ప్రొఫెసర్ మార్క్ హంటర్ నేతృత్వంలోని విశ్వవిద్యాలయ కమీషన్ అనంతపురానిక్ వచ్చి ఈ కళాశాలను పరిశీలింగి చేసిన సిఫారసు మేరకు ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధం అయింది. రెండేండ్లు అనుబంధంగా ఉండి [[1918]] [[జూన్ 6]]లో ప్రథమశ్రేణి కళాశాలగా ఎదిగింది. ఈ ఎదుగుదలకు ప్రిన్సిపాల్ రంగనాథన్, డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]], లార్డ్ పెంట్‌లెండ్ కృషిచేశారు. మొదటి ఏడేండ్లలో కళాశాల కొత్త గదుల నిర్మాణంతో ఉత్సాహంగా ముందుకు సాగింది. [[1920]] అక్టోబరు 23 న కేశవ పిళ్లై అధ్యక్షతలో తొలి వార్షికోత్సవం జరిగింది.