బ్రహ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
తొల్లి కల్పావసానమున సమస్తము జలార్ణవము అయి అంతట అంధకారబంధురముగ ఉండువేళ ఆజలమధ్యమున శ్రీమన్నారాయణమూర్తి వటపత్రశాయియై యోగనిద్రను తేలుచు ఉండి వరాహరూపమును ఒంది తన దంష్ట్రాగ్రమున భూమిని జలమునందుండి పైకి ఎత్తి నిలుపఁగా ఇతఁడు ఆపంకజోదరుఁడు అగు నారాయణుని గర్భమున ప్రవేశించి అందు ఉండు బ్రహ్మాండముల తత్వమును ఎఱిఁగి ఆదేవుని నాభికమలమునందుండి వెడలివచ్చి జగత్సృష్టి ఒనర్ప ఆరంభించెను. కనుక ఇతనికి పంకజభవుఁడు అను నామము కలిగెను.
 
ఇతఁడు [[చతుర్ముఖుఁడుచతుర్ముఖుడు]]. తొలుత ఇతనికి అయిదు ముఖములు ఉండెను. ఒక కాలమునందు [[త్రిమూర్తులు]] కొలువుతీరి ఉండఁగా అచ్చటికి పార్వతీదేవి వచ్చి పంచముఖులు అగు శివబ్రహ్మలు ఇరువురిని చూచి ఇతఁడు శివుఁడు ఇతఁడు బ్రహ్మ అని తెలిసికోలేక పిమ్మట శివుని కనుసైఁగచేత ఎఱిఁగి చేరఁబోయెను. అప్పుడు [[శివుఁడుశివుడు]] తన భార్యకు ఇంత భ్రమపుట్టుటకు కారణము బ్రహ్మకును అయిదు తలలు ఉండుటయె కదా అని అతనితలలో ఒకటిని శివుఁడు తీసివేసెను. అంత బ్రహ్మ అలిగి శివుఁడు కాపాలికత్వమును చెంది భిక్షాటనము చేయునట్లు శపించెను. ఆబ్రహ్మహత్యాపాపము పోవుటకై విష్ణువుయొక్క ఉపదేశమున శివుఁడు తీర్థయాత్ర చేసెను. అటుల యాత్రచేయుచు [[కాశిక్షేత్రము]]నకు రాఁగా అచట ఆపాపమువలన విముక్తుఁడు అయ్యెను.
 
ఇతని వ్యాపారము సృష్టిచేయుట. తొలుత ఇతనికి అనేకులు మానసపుత్రులు కలిగిరి. వారిలో తొమ్మండ్రు ప్రజాసృష్టికి కారణభూతులు అయి నవబ్రహ్మలు లేక నవ ప్రజాపతులు అనఁబడిరి. వారు మరీచి, అత్రి, అంగిరసుఁడు, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, భృగువు, వసిష్ఠుఁడు, దక్షుఁడు అనువారు. తక్కిన మానసపుత్రులలో సనకుఁడు, సనందనుఁడు, సనత్సుజాతుఁడు, సనత్కుమారుఁడు, [[బుభుఁడుబుభుడు]], [[నారదుఁడునారదుడు]], [[హంసుఁడుహంసుడు]], [[అరుణి]], [[యతి]] మొదలు అగువారు ముఖ్యులు. వీరు అందఱును ఊర్ధ్వరేతస్కులు అయి సృష్టియందు ఇచ్ఛలేక జన్మము మొదలు జ్ఞానులై తిరుగుచు ఉందురు.
 
బ్రహ్మయొక్క ఛాయవలన [[కర్దముఁడుకర్దముడు]] పుట్టెను. భ్రూమధ్యమువలన అర్ధనారీశ్వరుఁడు అగు రుద్రుఁడు పుట్టెను.
 
ఈ ప్రజాపతుల యొక్కయు, మహర్షుల యొక్కయు ఉత్పత్తి పలువిధములుగ చెప్పుదురు. శ్రీమద్భాగవతమున ఉన్నరీతిని బ్రహ్మయొక్క అంగుష్ఠమున దక్షుఁడును, నాభిని పులహుఁడునుపులహుడును, కర్ణముల పులస్త్యుఁడును, త్వక్కున భృగువును, హస్తమున క్రతువును, ఆస్యమున [[అంగిరసుఁడుఅంగిరసుడు]]ను, ప్రాణమున వసిష్ఠుఁడును, మనమున మరీచియు, కన్నులయందు అత్రియు పుట్టిరి. మఱియు నారదుఁడు ఊరువులను, దక్షిణస్తనమువలన ధర్మమును, వెన్నువలన అధర్మ మృత్యువులును, ఆత్మను కాముఁడును, భ్రూయుగళమున క్రోధుఁడునుక్రోధుడును పుట్టినట్లు చెప్పి ఉన్నది. ఇదిగాక బ్రహ్మ తన దేహమునుండి [[సరస్వతి]] జనింపఁగాజనింపగా ఆమెను కని విభ్రాంతిని పొంది కామాతురుఁడుకామాతురుడు అయి భార్యగా చేసికొనెను.
 
== బ్రహ్మ మానస పుత్రులు ==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ" నుండి వెలికితీశారు