ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==తొలి విద్యార్థిని==
1920 ప్రాంతాలలో ఆడపిల్లలు కాలేజీ చదువు చదవడం చాలా అరుదైన విషయం. అనంతపురం మునిసిపల్ హైస్కూలులో టీచర్‌గా పనిచేసే కాశినేని నాగలింగప్ప మూడవ కుమార్తె '''నారాయణమ్మ''' ఐదవ తరగతి చదివాక ఆమె చదువు మాన్పించాలనుకొన్నారు. అయితే ఆమె పట్టుదలతో హైస్కూలుకు వెళ్లి ఎస్.ఎస్.ఎల్.సి పాసయింది. తరువాత కాలేజీలో చదువుకొనాలని ఆమె ఆకాంక్ష. తల్లి దండ్రులను, అన్నలను ఒప్పించి అప్పటి ప్రిన్సిపాల్ ఆర్.కృష్ణమ్మ (పురుషుడు) ప్రోత్సాహంతో దత్తమండల కళాశాలలో చేరింది. ఆమె ఆ కళాశాల మొట్టమొదటి మహిళావిద్యార్థి<ref>{{cite journal|last1=జి.|first1=రామకృష్ణ|title=ప్రప్రథమ విద్యార్థిని నారాయణమ్మ|journal=అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం)|date=1999|page=134}}</ref>. పాతూరు నుండి కొత్తూరులో ఉన్న కళాశాలకు ఒకతే నడుచుకుంటూ వచ్చి కాలేజీకి వచ్చేది. ఎలాగో కష్టపడి చదివి ఎఫ్.ఎ., బి.ఏ. పరీక్షలు పాసయింది. బి.ఎ. పాసయిన తర్వాత ఆమెను బళ్లారిలోని ఒక వృద్ధుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ వివాహబంధం ఎక్కువరోజులు నిలువలేదు. తరువాత పుట్టిల్లు చేరింది. ఆ తరువాత మద్రాసులోని టీచర్ ట్రైనింగ్ కళాశాలలో ఎల్.టి.ట్రైనింగ్ పూర్తి చేసి టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆమె ఉద్యోగాన్ని సమర్థతతో నిర్వర్తించి పదోన్నతి పొంది విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ అయ్యింది. 20 సంవత్సరాలు రాయలసీమలో 10 సంవత్సరాలు సర్కారు జిల్లాలలో పనిచేసి రిటైర్ అయింది. 1998లో ఆమెను కళాశాల యాజమాన్యం సన్మానించింది.
 
==పూర్వ అధ్యాపకులు==