"ప్రాణాయామం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ప్రాణాయామం ముఖ్యంగా ఎనిమిది రకాలు. ఇవి [[అష్టకుంభకాలు]].
 
=== *[[1. సూర్య భేదసము:]] ===
 
సూర్య భేదనం అనగా సూర్య నాడిని ఉద్ద్దీపన చేయుట
 
==[[చేయువిధానము==]]
 
మెత్తని ప్రక్కపై, వజ్రాసనము లేక పద్మాసనముపై కూర్చొని కుడి ముక్కుతో (సూర్యనాడితో) వాయువును బాగుగా శక్తికొలది (అనగ పీల్చిన గాలి చర్మమునకు -రోమకూపముల ఉపరితలము వేడెక్కేలా) పీల్చి త్రివిధబంధములతో బంధించి- ఎడమ ముక్కుతో (చంద్రనాడితో) రేచించుట సూర్యభేదనమనిరి.
 
==[[ఫలితములు==]]
 
కపాలమును శోధించును. ఉదరగతమైన వాత; క్రిమిదోషములు హరించును. శ్వేద, స్నేహ, గ్రంధులను ఉజ్జీవింపజేయును. ప్రాణ శక్తిని పెంచును. ఫలితమెక్కువగా ఉన్న ఈ సుర్య భేదన ప్రాణాయామమును తరుచు చేయుట మచిది.
 
=== [[2.ఉజ్జాయి]] ===
*2. ఉజ్జాయి:
 
ఉజ్జాయి అనగ ఛిన్నపిల్లల గురక ద్వణి లాగ గాలిని ముక్కుద్వారా తీసుకొనువలెను.ఆసమయములొ గొంతుక వద్ద ద్వని నెమ్మదిగ చేయవలెను.
 
==[[చేయువిధానము==]]
 
సుఖమైన ఏదో ఓక ఆసనముపై కుర్చొని, నోరు ముసుకొని కంఠమును కుంచించి, రెండు ముక్కులతో గాలిని నెమ్మదిగా, ఊపిరితిత్తులు; కంఠము; సప్తపదవరకు నిండులాగున బాగుగా పీల్చి కుంభించి సుఖముగ ఆపగలిగినంతసేపు ఆపి నెమ్మదిగ చంద్రనాడితో రేచించుట ఉజాయినీ అంటారు.
 
==[[ఫలితములు==]]
 
ఇది ముఖ్యముగ శ్లేష్మ రోగులకు మంచిది. ఉబ్బసముచే బాధపడువారు తరచు ఉజ్జాయినీ చేయుట చాలా మంచిది. ఇది ఆయాసపడేవారు నిలబడి గూడా చేయవచ్చును. వెన్నుపామును, మెడను వంగకుండ నిగిడ్చి ఉంచుట మంచిది. శ్లేష్మ ప్రకోపముతో వచ్చు జలదోషములు, వ్యాధులు-జలోధరం, కాళ్ళకు నీరువాపులు గలవారుకూడ చేయుట మంచిది.
 
 
*===[[3. సీత్కారి:]]===
 
==[[చేయువిధానము==]]
 
సుఖమైన ఏదో ఓక ఆసనముపై కుర్చొని నాలుక కొనను రెండు పెదవుల మధ్యను, ముని పళ్ళకు చేర్చి ఈలవేసినట్లు నాలుకను కుంచించి వంచి నాలుకద్వారా శీత్కార శబ్దముతో గాలిని లోనికి బాగుగ పీల్చి కుంభించి, బంధించి ఎడమ ముక్కుతో నెమ్మదిగా రేచించుట నది స్స్త్కారి అందురు.
 
==[[ఫలితములు==]]
 
ఇది ముఖ్యముగ అలసత్వము (Dullness) తగ్గును. బలము ముఖ వర్చస్సు పెరుగును. దేహమునందు దుష్టవేడి తగ్గును.
 
=== *[[4. శీతలి:]] ===
శీతలి అనగా చల్లదనము.
 
==[[చేయువిధానము==]]
 
సుఖమైన ఏదో ఓక ఆసనముపై కుర్చొని నాలుకను రెండు పెదవుల మధ్యగ బైటకు చాచి పై పెదవితో నాలుకను గొట్టము వలె మడిచి పట్టుకొని గాలిని ఆనాలుక గొట్టము ద్వారా నెమ్మదిగా పీల్చుట వలన చల్లని గాలి బాగుగా లోనికి ప్రవేశించిన మీదట కుంభించి కుడిముక్కుతోను , ఎడమముక్కుతోను రేచించునది శీతలి అందురు.
 
==[[ఫలితములు==]]
 
ఇది ముఖ్యముగ అతివేడిని, పిత్తవికారములను తగ్గించును. విదాహమును, విషములను అరికట్టును, గాయములను మానుపును. చేయుట సులభము. ఫలితము ఎక్కువ. పాము-తేలు కాట్లకు, దెబ్బలు, గాయాలకు మేలు చేయును. అంతేగాక ఎక్కిళ్ళను అబద్భుతముగ అరికట్టును.
 
=== *[[5. భస్త్రిక:]] ===
 
భస్త్రిక అనగ తొలుతిత్తి.
 
==[[చేయువిధానము==]]
 
సుఖమైన ఏదో ఓక ఆసనముపై కుర్చొని కుడిముక్కును పూర్తిగా బంధించి, ఎడమముక్కుతో గాలిని కపాలమునకు అంటులాగున ఒత్తిడిగా శబ్దముతో లాగి తిరిగి వెంటనే దానితోనే రేచించుచు, 30-40 సార్లు చేసిన తరువాత చివరిగా గట్టిగా ఊపిరితిత్తులనిండా గాలిని పీల్చి త్రిబంధాలు చేసి కుంభించి తిరిగి నెమ్మదిగా కుడిముక్కుతో రేచించవలెను. అట్లే తరువాత ఎడమముక్కును బంధించి కుడిముక్కుతో చెసినమాదిరగానే ఎడమముక్కుతో దీర్ఘశ్వాసలు 30-40 సార్లు చేసి చివరికి, కుంభించి, నెమ్మదిగా ఎడమముక్కుతో రేచించవలెను.
 
==[[ఫలితములు==]]
 
త్రిదోషములను సమరస పరచును. కఫాలము - సప్తపదలయందుగల దోషములను- కఫములను వెలువరించును. హరించును. కుంభకవ్యవధిని పెంచును. శ్లేష్మ గతములైన ముక్కు దిబ్బడ, జలుబు, తుమ్ములు, ఎలర్జీ, సైనోసెటీస్ లాంటి వ్యాధులను నివారించును. సుషుమ్నా నాడిని శుద్ధిచేసి కుండలినీ శక్తిని మేలుకొల్పును.
 
=== *[[6. భ్రామరి:]] ===
 
భ్రామరి అనగా తుమ్మెద.
 
==[[చేయువిధానము==]]
 
భ్రమరము అంటే తుమ్మెద. కుడిముక్కును బంధించి ఎడమముక్కుతొ గాలిని పీల్చు ముక్కు పుటము పైనున్న వ్రేలుతో అవరోధము కల్పిస్తూ తుమ్మెదల ఝుంకార శబ్దము వచ్చులాగున పూరించి ఎడమముక్కును బంధించి, తిరిగి కుడిముక్కుతో అదేశబ్దము తుమ్మెద ఝుంకారము వచ్చులాగున అవరోధముతో గాలిని రేచించుచు చేయునది భ్రమరిక ప్రాణాయామము అందురు. ఈవిధముగ మార్చి మార్చి 20 to 30 సార్లు చేయవలెను.
 
==[[ఫలితములు==]]
 
సుశబ్దముచే చిత్తము రంజిల్లును. శరీరము వేడెక్కుచు చల్లబడుట వలన సుఖముగా నుండును.
 
 
=== *[[7. మూర్ఛ:]] ===
 
మూర్ఛ అనగా మతిభ్రమించుట. గ
 
==[[చేయువిధానము==]]
 
రెండు ముక్కులతో గాలిని బాగుగా ఊపిరితిత్తులలోనికి నిండుగ పీల్చుకొని, త్రివిధబంధములతో వాయువును బంధించుట వలన శరీరము వేడెక్కును. అట్లు చేయుటవలన క్రమముగ డస్సి మూర్చస్థితికి చేరేసరికి, రోమకూపములు వికసించి, స్తంభించిన వాయువులను చర్మరంధ్రముల ద్వారా వెలువరించుటను మూర్చ అందురు. ఇది కష్ట సాధ్యము. అందువల్ల దీనిని అభ్యసించువారు చాలా అరుదు.
 
==[[ఫలితములు==]]
 
చర్మదోషములుతొలగి, శరీరము కాంతివంతమగును. ప్రాణశక్తి పెరుగును.
 
 
=== *[[8. ప్లావని:]] ===
 
ప్లావని అనగా తేలుట .
 
==[[చేయువిధానము==]]
 
నోటితో గాలిని కొంచెం, కొంచెంగా పీల్చుకొంటూ కడుపులోనికి మింగుచుండవలెను. బాగుగా పొట్టనిండా గాలి చేరి, పొట్ట వుబ్బిన తరువాత ( ఈ స్థితిలో పొట్టపైన కొడితే ఢమరుకమువలె మోగును) కుంభించి తిరిగి నెమ్మదిగ, నెమ్మదిగ - నోటితోగాని - ముక్కులతోగాని గాలిని వెలువరించవలెను. ఇది చాలా శ్రమతో గూడిన విధానము కనుక గురు ముఖతా అభ్యసించుట మంచిది.
 
==[[ఫలితములు==]]
 
ఇది బాగుగా అభ్యాసమైన వారికి శరీరమును నీటిపై తెప్పవలె తేల్చుటకు ఎంతగానో ఉపకరించును. నీటిపై వెల్లకిల పరుండి పద్మాసనము వేసి గాలిని కడుపునిండా కుంభించుటవలన్ శరీరము నీటిపై తేలిపోవును. ప్రవాహము గల కాలువలో వేస్తే శవము వలే తేలి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళవచ్చునని పెద్దలు చెప్పుదురు.
692

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1399886" నుండి వెలికితీశారు