"బాల సరస్వతి (నృత్యకారిణి)" కూర్పుల మధ్య తేడాలు

బాలసరస్వతి తన తొలినాట్య ప్రదర్శన కాంచీపురంలో ఇచ్చినా, తర్వాత మద్రాసులో ఆనాటి అతిరధ, మహారధుల సమక్షంలో ప్రదర్శించిన నాట్యమే తన అరంగేట్రం. ‘వీణధనమ్మాళ్ మనుమరాలు ప్రదర్శనను జనం విరగబడి చూశారని, బాలసరస్వతి అభినయించిన హావభావాలు ఆమె ఈడుకు మించినవని అంటూ, ఇది బాలమేధావులకే సాధ్యం’ అని ప్రస్తుతించారు.
ఎన్నొవడిదుడుకులున్నా, సంప్రదాయం పాటిస్తూ ఆమె నాట్యకళకు అంకితమయింది. ఒక దేవదాసి కేవలం నాట్యకళకు పరిమితమవ్వడం ఒక వర్గం వారికి మింగుడుపడలేదు. అరయక్కుడి రామానుజ అయ్యర్, డా.వి. రాఘవన్ ఇచ్చిన ప్రోత్సాహంతో నాట్యకళలో తాను ఎప్పుడూ విద్యార్ధినేనని నమ్మి ముందుకు పోగలిగారు. చివరలో వేదాంతం లక్ష్మీ నరసింహాశాస్త్రి వద్ద కూచిపూడి అభినయం దీక్షతో నేర్చుకున్నారు.
 
ఆకాశవాణి డైరెక్డర్ జనరల్, కేంద్ర సాహిత్య అకాడమి ఛైర్మన్ నారాయణమీనన్ వివరణ ప్రకారం బాలసరస్వతి చేయగల నాట్య అంశాలు అపూర్వం.
*[[అలరిప్పు]]– 5.
*[[జాతిస్వరం]]– 9.
*[[శబ్దం]]- 8.
*[[వర్ణాలు]]– 15(అందులో 12 తెలుగు).
*[[పదం]]- 97( 67తెలుగు).
*[[జావళీలు]]– 51(అన్నితెలుగే).
*[[తిల్లానాలు]]- 8. ఇవికాక భామాకలాపం, కురవంజి, శ్లోకాలు, పద్యాలు, విరుత్తం మొ।। మరికొన్నివందల సంఖ్యలో అద్భుతంగా నాట్యం చేసేవారు.
 
==విశిష్టపురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1402734" నుండి వెలికితీశారు