జామ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
About 100, see text
}}
[[జామ]] లేదా [[జామి]] ([[ఆంగ్లం]] ''Guava'') [[మిర్టేసి]] కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామిజామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి.
జామి పండు, Gauva
 
జామ మొక్కలు మిర్టిల్‌ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో,మధ్య మరియు దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి. జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు ఉండి చూడడానికి ఏపిల్‌ పండులాగాని, బేరి పండులాగ గాని ఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీవర్ణం కలిగి తియ్యగా ఉండి కమ్మని వాసనతో ధృడమైన పచ్చని పై తొడుగు కలిగి ఉంటుంది. స్ట్రా బెర్రీ జామ (పి. కాటిల్‌ యానమ్‌) బ్రెజిల్‌ దేశంలో పుట్టి, ఎర్రని పళ్లు కలిగి ఉంటుంది. ఈ పళ్లు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగ ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన సువాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగి ఉంటుంది. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉండి, పండుకూ పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది. [[జామతోటల్లో ఈగ పురుగు నిర్మూలన]]
 
పెక్టిన్‌ నిల్వలు పైన తొడుగులో ఎక్కువగా ఉండటం చేత ఉడికించిన జామను కాండీలు (అమెరికాలోని స్వీట్స్‌) జాములు, నారింజతో చేసే జాములు, రసాల తయా రీలో ఉపయోగిస్తారు. టొమాటోలకు బదులు గా, ఎర్రజామ ఉప్పుతో చేసే ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. జామ పళ్ల నుంచి, ఆకులనుంచి 'టీ' కూడా తయారు చేస్తారు. పోషకవిలువలు జామపళ్లను 'మేలైన ఫలాలుగా' పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్‌ 'ఏ' మరియు విటమిన్‌ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్‌ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. వీటిలో మిన రల్స్‌, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి సాధారణంగా అవసర మైన పోషకాలు తక్కువ కేలరీలలో ఉంటాయి. జామపళ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పొలీఫెనాల్స్‌- ఇవి ఆక్షీకరణం కాని సహజరంగు కలిగించే గుణాలు ఈ పళ్లకి ఎక్కువ ఏంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలుగజేస్తాయి. ఔషధపరమైన ఉపయోగాలు నాటు వైద్యంలో 1950 సంవత్సరం నుంచి జామ ఆకులు వాటిలోని విభాగాలు, ఔషధ లక్షణాలు పరిశోధ నలలో అంశంగా ఉన్నాయి. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో జామ పండు పై తొక్క తొలగించి పంచదార పాకం పట్టి ఎరుపు రంగు కలిపి రెడ్ గోవా అనే పేరుతో విక్రయిస్తారు.
 
==ఆహార విలువ--జామ తినే భాగం 100 గ్రా.లలో==
"https://te.wikipedia.org/wiki/జామ" నుండి వెలికితీశారు