ఉప్పలపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==సేవలు==
తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో చేరి, వివిధ అణుశక్తి పరిశోధనలలో పాలుపంచుకున్నారు. విశిష్ట శిక్షణ నిమిత్తం జపాన్, అమెరికా, బ్రిటన్ దేశాలలో పర్యటించారు. భారత దేశపు మొట్టమొదటి అణురియాక్టరు 'అప్సర" రూపకల్పన, అభివృద్ధి దశలు, ప్రయోగాలు నిమిత్తం నియమితులైన ముగ్గురు సాంకేతిక శాస్త్రవేత్తలలో ఈయన ఒకరుగా కృషి చేశాఅరు. అమెరికా, ఇంగ్లండ్ లలో అణుశక్తి మీద గాడాధ్యయనం చేసిన (1957-58) ఫలితాలు అణుశక్తి మీద ఉన్నత విద్య నేర్పిన అంశాలతో అణు రియాక్టర్ రూపకల్పనకు బాగా ఉపయోగపడ్డాయి. మూడవ రియాక్టరు "జర్లీనా" కు రూపకల్పన చేసి, ప్రయోగించే శాస్త్రవేత్తల బృందానికి సారధ్యం వహించారు. తారాపూర్ అణువిద్యుత్ కేంద్రంలో దాదాపు పుష్కరకాలం పాటు పనిచేశారు. ఈ వ్యవధిలోనే రెండు విభాగాలను కొత్తగా (1963) నెలకొల్పడానికి దోహదపడ్డారు. 1965 తదుపరి కాలంలో ఈయన ఆలోచనలు,ల్ ఊహలు అన్నీ ఉత్పత్తి రంగం మీదకు మళ్ళినాయి. కార్బన్ ఫిల్మ్‌లురెసిస్టర్లు మొదలైన వాటిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారచేసే ప్రాధమిక స్థాయి ప్రాజెక్టును రూపొందించారు.
 
1967 లో ఈయన స్వరాష్ట్రానికి వచ్చేశారు. ఈ సమయంలోనే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ను నెలకొల్పడాంతో ఆ సంస్థలో నియమితులయ్యారు. ఇ.సి.ఐ.ఎల్ తొలుత బొంబాయిలో ఉండేది. హైదరాబాదుకు తరలించడాంలో ఈయన కూడా కృషి జరిపారు. తొలుత రెసిస్టర్స్, కెపాసిటర్స్, విభాగాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో అవిశ్రాంత పరిశోధనా కృషి చేశారు.
 
అందుకు అనూశక్తి రంగంలో ఆర్జించిన విశేష అనుభవం బాగా ఉపయోగపడింది. ఈ సంస్థలో పనిచేసిన ఏడేళ్లలో నాలుగు ప్రత్యేక విభాగాలను నెలకొల్పి, వాటికి అధ్పతిగా ఉన్నారు. అప్పట్లోప్రఖ్యాత శాస్త్రవేత్త ఎ.ఎస్.రావు చైర్మన్ గా ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో ఈయన ఎలక్ట్రానిక్స్ సాంకేతిక రంగంలో అవిరామ పరిశోధనలు చేశారు. ఇ.సి.టి.వి. బ్లాం అండ్ వైట్ కు రూపకల్పన చేసి మహోన్నత విజయాన్ని సాధించారు.
 
==మూలాలు==