ఉప్పలపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
మన రాష్ట్రంలో తొలిశ్రేణి బ్లాక్ అండ్ వైట్ టీవీలను రూపొందించిన ఘనత ఈయనకు దక్కింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో అద్భుతలను ఆవిష్కరించి, తొలి ఏడాదిలోనే భారీ స్థాయి లాభాలను సమకూర్చారు. తర్వాత కాలంలో ఉత్తరప్రదేశ్ లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు మెనేజింగ్ డాఇరక్టరుగా నియమితులయ్యారు. ఈ సంస్థలో కూడా పరిశోధనా కృషి కొనసాహించారు. తత్ఫలితంగా ఈ సంస్థ సౌరశక్తి రంగంలో అగ్రగామిగా భాసిల్లి ఈ రోజున సోలార్ సెల్స్ ఉత్పత్తిలో ప్రపంచం లోని మొదటి ఆరు అగ్రగామి దేశాలలో ఒకటిగా మన దేశాన్ని నిలబెట్టింది.
==విదేశాలలో ఖ్యాతి==
నూక్లియర్ ఇంజనీరింగులో సమున్నత శిక్షణ (బ్రిటన్ లో 1957, అమెరికాలో 1958) పొందిన ఈయన 1963 లో "బేర్" సంస్థ తరపున ఇటలీ లో భారీ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ ప్రదర్శనను నిర్వహించి మనదేశ ఖ్యాతిని ఇనుమడింపచేశారు. అధ్యయనం, శిక్షణల నిమిత్తం పలుమార్లు వివిధ దేశాలను (1967లోజపాన్, 1972లో తూర్పు యూరప్ దేశాలు, 1974లో ఎలక్ట్రానిక్స్ కమీసహన్ చైర్మన్ ఓ కలసి బల్గేరియా, పలు సందర్భాలలో అమెరికా , బ్రిటన్ దేశాలు) పర్యటించి విశేషానుభవాన్ని గడించారు. మన కేంద్ర ప్రభుత్వం తరపున పలు విదేశాలతో వివిధ ఒప్పందాలను కుదుర్చుకోవడాంలో, నూతన వ్యవస్థల రూపకల్పన చేయడంలో అమోఘమైన కర్తవ్య నిర్వహణ చేశారు.
 
==మూలాలు==