ఉప్పలపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==అవార్డులు==
1986లో ప్రారంబించిన యలవర్తి నాయుడమ్మ అవార్డును అందుకుని తొలి శాస్త్రవేత్త ఈయనే. రఘుపతి వెంకటరత్నం అవార్డు గ్రహీత శాస్త్రవేత్తగానే గాక సామాజిక వేత్తగా సహృదయమూర్తిగా అందరి మన్ననలను అందుకున్నారు. తమ స్వగ్రామంలో సాంకేతిక శిక్షణ సంస్థను గ్రామస్తుల సహకారంతో మరో సాంకేతిక విద్యా బోధనా సంస్థను (1997) నెలకొల్పారు. గ్రామీణ విద్యార్థుల అభ్యున్నతికి ఈ సంస్థ ఐ.ఐ.టి , జూనియర్ కాలేజీ విభాగాలతో కృషి చేస్తుంది. ఉపాధి కల్పనా అవకాశాలను కూడా అందిస్తున్నది. పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్సు సంస్థ కార్యాకలాపాలను సమున్నతపరిచారు. విజయవాడ శివారు గ్రామం నిడమానూరులో ఇన్ క్యాంప్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పి చైర్మన్ గా వ్యవహరించారు. హైదరాబాదులోనే స్థిర నివాసం యేర్పరచుకున్నారు. కాప్రా మ్యునిసిపాలిటీలోని అనుపురం కాలనీ (ఎ ఎస్ రావు నగర్) శేష జీవితం గడుపుతూ 2004 అక్టోబరు 2 తేదీన 77 వ యేట మృతి చెందారు. మన దేశం ఎలక్త్రానిక్స్ అభివృద్ధికి విస్తరణకు దిశా నిర్దేశం చేసిన సాంకేతిక శాస్త్రవేత్తగా ఎలక్ట్రానిక్స్ అణుశక్తి పరిశోధన రంగాలను విశేష కృషి చేసిన జన సామాన్యం శాస్త్ర కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన ఉప్పలపాటి వెంకటేశ్వర్లు యు.వి.వర్లు గా అంతర్జాతీయ రంగాలను సుప్రసిద్దులయ్యారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}