"2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం" కూర్పుల మధ్య తేడాలు

==సంఘటన==
[[File:Delhi protests-students, Raisina Hill.jpg|thumb|రైసినా హిల్, రాజ్‌పథ్, న్యూ ఢిల్లీ వద్ద నిరసనలు]]
23 ఏళ్ళ వైద్య విద్యార్దిని మరియు ఆమె స్నేహితుడు కలిసి ఆ రోజు సాయంత్రం ఢిల్లీ లోని సాకేత్ దగ్గర సినిమా చూసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 9:30కు ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. అందులో ఐదుగురు ప్రయాణీకులతోపాటు ఒక డ్రైవర్ ఉన్నారు. వారంతా తాగిఉన్నారని మరియు వారంతా ఒకటే గుంపునకు చెందినవారని వారికి తెలీదు. వారంతా నగరంలోని మురికివాడ చెందిన వారు. కొంతసేపటికి డ్రైవరు దారిమళ్ళించాడు. అలాగే బస్సు తలుపుకు కూడా గడియపెట్టారు. దీనితో అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు బస్సు సిబ్బందిని అడిగాడు. అందుకు వారు రాత్రి పూట మీకేంపని ఒంటరిగా ఎంచేస్తున్నారని అడగటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన తన స్నేహితుడను తలపైన ఇనుప రాడ్ తో కొట్టి అపస్మారక స్థితికి తీసుకెళ్ళారు. ఆపై ఒంటరిగా ఆమెను బస్సు చివరకు ఈడ్చుకెళ్ళి అత్యాచారానికి ఒడికట్టారు. ఆమె అరచి, వారితో పెనుగులాడి నోటితో కొరికి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించింది. అందుకు వారు ఆమెను పలుమార్లు బలంగా ఇనుప రోడ్ తో కొట్టి ఆపై యోని లోకి ఇనుపరాడ్ ను పలుమార్లుచొచ్చి ఒక్కొక్కరు అత్యాచారం చేశారు. ఈ ఉదంతమంతా బస్సు కడులుతున్డగానే జరిగింది. ఆమె గర్భసంచిలో ఆ ఇనుపరాడ్ ను పలుమార్లు చొచ్చి పైశాచిక ఆనందాన్ని పొందారు. బస్సును ఒకరితరువాత ఒకరు నడుపుతూనే తల నుంచి, ఉదరం నుంచి నెత్తురోడుతున్న ఆమెను అత్యాచారం చేశారు. సుమారు గంటకు పైగా హింసించిన వారిని వివస్త్రంగానే రోడ్డు పైకి విసిరివేశారు.
 
వైద్య పరీక్షలలో డాక్టర్లు ఆమెకు ఇనుప రాడ్ చొచ్చటం మూలంగా ఉదరంలో, పేగులలో, మర్మాంగాలలొ తీవ్రంగా దెబ్బలు తగిలాయని తెలిపారు. ఆ తరువాతి రోజు పోలీసు పరిశోధనలో ఆ ఇనుపరాడ్ తుప్పుపట్టి L ఆకారంలో ఉన్నదిగా తెలిపారు. ఉన్మాదులు వారిని రోడ్ పైకి విసిరివేశాక ఒకరు బస్సును కడిగారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1405490" నుండి వెలికితీశారు