అన్నమయ్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
==అథిధులు==
[[పొత్తూరి వెంకటేశ్వరరావు]]
:ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ద్వారా భావితరాలకు పనికివచ్చే కార్యక్రమాలకు రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచిన మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు 2015 జనవరి 29 న అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించారు. వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, రాష్ట్రప్రభుత్వ ఉత్తమ జర్నలిష్టు అవార్డు వంటి పలు సత్కారాలు అందుకున్నారు. వీరు ప్రముఖ పాత్రికేయులు. 4 దశాబ్దాల పాటు వివిధ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.
:వీరు గ్రంథాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించి ఈ సేకరణ అరుదైనదని ప్రశంసించారు. వీరు ప్రెస్ అకాడమి అధ్యక్షులుగా ఉన్నపుడు పాతపత్రికలను 10 లక్షల పుటలను డిజిటల్ రూపంలో భద్రపరచారు. ప్రస్తుతం అన్నమయ్య గ్రంథాలయంలో జరుగుతున్న గ్రంథ పట్టిక డిజిటలైజేషను గురించి వివరాలు తెలుసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో అవసరమైన మెళకువలను సూచించారు. ప్రముఖుల పరిచయాలను అదే రంగంలో అనుభవం గల వారిచే ఇంటర్వూ చేయించి పదిలపరచటం అవసరం అన్నారు.
 
==సమర్పకులు==
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_గ్రంథాలయం" నుండి వెలికితీశారు