ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==స్వరాజ్య==
ఉపాధ్యాయ వృత్తి తర్వాత 1921లో ఖాసా సుబ్బారావు [[మద్రాసు]]కు వచ్చి '''స్వరాజ్య''' ఆంగ్ల దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరాడు. [[టంగుటూరి ప్రకాశం]] ఈ పత్రికను స్థాపించాడు. మద్రాసు ప్రెసిడెన్సీలో నివసించే ఆంధ్రులు వివక్షకు గురయ్యేవారని [[టంగుటూరి ప్రకాశం]] భావించాడు. మద్రాసాంధ్రులకు బాసటగా స్వరాజ్యను ప్రారంభించాడు. ఈ పత్రికకు ప్రకాశం పంతులు మేనేజింగ్ డైరెక్టర్‌గా, సంపాదకుడిగా వ్యవహరించాడు. కె.ఎం.ఫణిక్కర్ ఇన్‌ఛార్జ్ ఎడిటర్‌గా వ్యవహరించేవాడు. ఖాసా సుబ్బారావుతో పాటు ఎస్.ఎన్.వరదాచారి, [[కోలవెన్ను రామకోటేశ్వరరావు]], [[మానికొండ చలపతిరావు|ఎం.చలపతిరావు]] మొదలైన వారు ఈ పత్రిక ఉపసంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రిక 1921లో ప్రారంభమై 1935 వరకు వెలువడింది. జర్నలిస్టుగా ఖాసా సుబ్బారావు రాణించడానికి ఈ పత్రిక ఎంతగానో తోడ్పడింది. ఈ పత్రిక ఉత్థాన పతనాలను ఇతడు తన Men in the Lime light గ్రంథంలో ఎంతో హృద్యంగా వర్ణించాడు. ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పత్రిక మూతబడింది. [[టంగుటూరి ప్రకాశం]] ఈ పత్రికలో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించలేక పోతే ఇతడు కార్మికుల పక్షాన నిలిచాడు. కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రకాశంకు ఘాటైన లేఖలు వ్రాసేవాడు.
 
==స్వతంత్ర==
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు