ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
 
==సత్యాగ్రహం==
గాంధీమహాత్ముడు సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించినపుడు ఖాసా సుబ్బారావు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. [[1930]]లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నాడు. ఉప్పుసత్యాగ్రహపు లక్ష్యాలను ప్రజలకు వివరించడానికి అనేక చోట్ల పర్యటించాడు. ఇతనితో పాటు ఇతని తల్లి కూడా గ్రామగ్రామలలో పర్యటించి ఖాసా సుబ్బారావుకు సహకరించింది. కొడుకు ఆశయాలకు వత్తాసు పలికి తల్లి అతనితో పాటు గ్రామగ్రామంలో తిరిగి అతని బాగోగులను చూసుకోవడం చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఇతడు 6 నెలల కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. [[1931]]లో [[మద్రాసు]]లోని చైనాబజారులో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అప్పుడు ఇతడికి పోలీసు లాఠీ దెబ్బలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగి మూర్ఛ పోయాడు. ఈ సంఘటన బ్రిటీష్ పార్లమెంటులో ప్రకంపనలను సృష్టించింది. ఈ సంఘటనపై విచారణ జరిపిన ఏక సభ్య కమీషన్ లార్డ్ లూథియన్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖాసా సుబ్బారావును పరామర్శించి ఈ చర్యను ఖండించింది. కానీ తర్వాత ఇతడికి 6 నెలల కఠినశిక్ష విధించి వెల్లూరు జైలులో నిర్బంధించారు. 1942-44ల మధ్య ఇతడు [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొని సుమారు 20 నెలల కారాగార వాసం అనుభవించాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు