భారతి (మాస పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
భారతి పత్రికకు [[గన్నవరపు సుబ్బరామయ్య]] సంపాదకులుగా ఉన్నారు. నాగేశ్వరరావు అనంతరం అతని అల్లుడు [[శివలెంక శంభుప్రసాద్]], ఆ తరువాత అతని కుమారుడు [[శివలెంక రాధాకృష్ణ]] భారతిని నిర్వహించారు. భారతిలో పనిచేసిన వారిలో [[తిరుమల రామచంద్ర]], [[విద్వాన్ విశ్వం]] మొదలైన వారు ఉన్నారు. ఈ పత్రికలో మరొక ఆకర్షణ [[తలిశెట్టి రామారావు]] కార్టూనులు.
== విశిష్టత, ప్రాచుర్యం ==
భారతిలో ఎన్నెన్నో గొప్ప రచనలు ప్రచురితమయ్యాయి. భారతి తొలి సంచికలో [[మంగిపూడి వేంకటశర్మ]] రచించిన [[గాంధీ శతకము]] ప్రచురణ ప్రారంభించారు. ఆధునిక వాజ్మయ ధోరణులను ఈ పత్రిక నిస్సంకోచంగా సమర్థించింది. మార్పును ఆహ్వానించింది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో. భారతిలో కథ పడటమే తమ సాహిత్య ప్రక్రియకు గీటురాయి అని అప్పట్లో రచయితలు అనుకునేవారట. తెలుగుసాహిత్య రంగంలో ఉన్న ఉద్దండులందరి కథలూ భారతిలో ప్రరుఛిరించబడ్డాయిప్రచురించబడ్డాయి. అందరికంటే ఎక్కువ కథలు భారతిలో ప్రచురించబడిన రచయిత చిదంబరం. ఆయన గురించిన వివరాలు అందుబాటులో లేవు. భారతి పత్రిక 1949లో [[రజతోత్సవం]] మరియు 1984లో [[వజ్రోత్సవం]] జరుపున్నది. వ్యాపార పక్షంగా లాభదాయకంగా లేక పోయినా సాహితీ ప్రియులకి ఇది ఒక అభిమాన పత్రిక.
 
==కొందరు రచయితలు==
ఈ పత్రికలో రచనలు చేసిన కొందరు ప్రసిద్ధ రచయితలు:
[[చెఱుకుపల్లి జమదగ్నిశర్మ]], [[వడలి మందేశ్వరరావు]], [[బొడ్డు బాపిరాజు]], [[పురిపండా అప్పలస్వామి]], [[కొడాలి ఆంజనేయులు]], [[పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి]], [[కాంచనపల్లి కనకమ్మ]], [[కావ్యకంఠ గణపతిశాస్త్రి]], [[బెజవాడ గోపాలరెడ్డి]], [[గుర్రం జాషువా]], [[బండారు తమ్మయ్య]], [[దుర్గాబాయి దేశముఖ్| గుమ్మడిదల దుర్గాబాయి]], [[తాపీ ధర్మారావు]], [[వేటూరి ప్రభాకరశాస్త్రి]], [[ముద్దుకృష్ణ]], [[కోరాడ రామకృష్ణయ్య]], [[దువ్వూరి రామిరెడ్డి]], [[సెట్టి లక్ష్మీనరసింహము]], [[కనుపర్తి వరలక్ష్మమ్మ]], [[నేలటూరి వేంకటరమణయ్య]], [[వేంకటపార్వతీశ్వర కవులు]], [[వేదము వేంకటరాయశాస్త్రి]], [[కవికొండల వెంకటరావు]], [[ఆండ్ర శేషగిరిరావు]], [[శ్రీరంగం శ్రీనివాసరావు]], [[పూతలపట్టు శ్రీరాములు]], [[విశ్వనాథ సత్యనారాయణ]], [[వడ్డాది సుబ్బారాయుడు]], [[తుమ్మల సీతారామమూర్తిచౌదరి]], [[మల్లంపల్లి సోమశేఖరశర్మ]] మొదలైనవారు.
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/భారతి_(మాస_పత్రిక)" నుండి వెలికితీశారు