దగ్గుబాటి రామానాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
 
'''డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు''' ([[6 జూన్]] [[1936]] - [[18 ఫిబ్రవరి]] [[2015]]) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. ఇతను [[1936]]వ సంవత్సరం [[జూన్ 6]]వ తేదీన [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]] లో జన్మించాడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో [[బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం|బాపట్ల]] నియోజకవర్గం]] నుండి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్ధిగా [[లోక్‌సభ]]కు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.సెప్టెంబర్ 9, 2010న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు<ref name= "Rama Naidu dies of cancer" />.
==వ్యక్తిగత జీవితం==
దగ్గుబాటి రామానాయుడు, [[1936]]వ సంవత్సరం [[జూన్ 6]]వ తేదీన [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]] లో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క మరియు చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విద్యాబ్యాసం చేశాడు. సూర్యనారాయణ ను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు. విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సాయం చేసారు. ఎప్పుడూ కాలేజిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు కబడ్డీ మైదానంలోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరిక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి. రెండో సంవత్సరం పరిక్షలు కూడా తప్పాడు. రామానాయుడు కు మామ కూతురు రాజేశ్వరితో పెళ్లి జరిగింది. పెళ్ళయిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగాడు కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు.వీరికి [[సురేష్]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద [[సురేష్ ప్రొడక్షన్స్]] స్థాపించారు.