అశ్వినీ దేవతలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: రధం → రథం (4) using AWB
పంక్తి 1:
* '''అశ్వినీ దేవతలు''' పురాణ పురుషులు మరియు [[కవల]]లు. వీరు [[సూర్యుడు|సూర్యుని]]కి, [[ఛాయాదేవి]]కి అశ్వ రూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు.
 
* [[మహాభారతం]]లో పాండురాజు పత్ని [[మాద్రి]]కి మంత్ర ప్రభావము వలన [[నకులుడు]] మరియు [[సహదేవుడు]] జన్మించారు.
 
* వీరు [[ఆయుర్వేదము|ఆయుర్వేదాన్ని]] దక్ష ప్రజాపతి నుండి నేర్చుకొని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు.
== పురాణ కథనం ==
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు వీరు కవలలు. వీరిసోదరి [[ఉష]]. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట. ఆ తరువాత వారు రధాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. వీరు ప్రయాణించే రధంరథం పేరు [[హిరణ్యవర్తం]]. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రధంరథం చాలా బృహత్తరమైనది. అది [[హిరణ్యం]]తో నిర్మించబడింది. ఆ రధానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతోత్యంత ఉత్సాహంతో ఉంటాయి. చిత్రమైన ఈ రధానికి చక్రాలూ మూడే. సారధి కూర్చోవడానికి త్రిఫలకాలు మరియు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి. ఆరధంలోఆరథంలో ఓకవైపు [[ధన రాశులు|ధనం]] మరొకవైపు [[తేనె]], [[సోమరసం]] మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రధంరథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం మరియు మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు. వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు మరియు సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా [[ఔషధాలు]] ఉంటాయి. వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంధం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.
 
== హవిర్భాగం పొందుట ==
పంక్తి 15:
 
== ఇవి కూడా చూడండి ==
 
 
== సూచనలు ==
* [[Dictionary of Hindu Lore and Legend]] (ISBN 0-500-51088-1) by Anna L. Dallapiccola
 
 
{{ఋగ్వేదం}}
"https://te.wikipedia.org/wiki/అశ్వినీ_దేవతలు" నుండి వెలికితీశారు