"శ్రీకృష్ణ పాండవీయం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: రధం → రథం using AWB
చి (Wikipedia python library)
చి (clean up, replaced: రధం → రథం using AWB)
|story = [[నందమూరి తారక రామారావు]]
|screenplay = [[నందమూరి తారక రామారావు]]
|director = [[ నందమూరి తారక రామారావు ]]|
|dialogues = [[సముద్రాల రాఘవాచార్య]] |
|lyrics = [[సముద్రాల రాఘవాచార్య]], [[సి.నారాయణరెడ్డి]], [[కొసరాజు]] |
దాయ ద్వేషంతో దుర్యోధనుడు, పాండవులను రండా పుత్రలుగా కించబరుస్తూ సంబోదిస్తాడు. బదులుగా భీముడు కౌరవులను ముండా పుత్రుడిగా సంభోదిస్తాడు. ఖిన్నుడైన దుర్యోధనుడు తల్లి గాంధారి దగ్గరకు వెళ్లి నిజం చెప్పమని నిలదీస్తాడు. గాంధారికి వైధవ్య యోగం ఉందని జోస్యుల ద్వారా తెలుసుకున్న గాంధారరాజు ఒక గొఱ్ఱెతో ఆమెకు వివాహం జరిపించి దాన్ని చంపించి వేస్తాడు. పిమ్మట గాంధారి వివాహం దృతరాష్ట్రుడితో జరుగుతుంది. ఇది విని అభిమాన ధనుడైన దుర్యోధనుడు గాంధార రాజును, అతని నూర్గురి కుమారులను పాతాళ గృహంలో బంధించి రోజుకు ఒకొక్కరికి ఒక్కొక మెతుకు, ఒక్క చుక్క నీటిని అందించే ఏర్పాటు చేస్తాడు. ఈ ఆహారం ఎవ్వరికీ సరిపోనిది, ఆహార లోపం తో అందరిని మృత్యువాత పడవేసేది అని ఆలోచించి, కనిష్టుడైన శకుని అందరిలో పట్టుదల ఉన్న వాడు, కుటిలుడు కాబట్టి అతనికి అందరి వంతు ఆహారం, నీరు ఇచ్చి అతనిని బ్రతికించు కొని నిరాహారంగా అందరూ మరణించడానికి సిధ్దపడతారు. ఆ విధంగా క్రమక్రమంగా అందరూ మరణిస్తారు. చివరిగా మిగిలిన గాంధారరాజు మరణిస్తూ తన వెన్నెముకతో పాచికలు తయారు చేయమని, అవి శకుని కోరినట్లు పందెం పడుతుందని, వాటి ఆధారంతో కురువంశాన్ని నాశనం చేయమని ఉద్బోదిస్తాడు. మిగిలిన ఒక్కని మీద సానుభూతి కలిగి, పైగా అతడు తమనేమి చేయలేడని తలచి దుర్యోధనుడు శకునిని విడుదల చేస్తాడు. శకుని దుర్యోధనునికి ఆప్తుడిగా ఉంటూ దుర్బోధలతో అతని వినాశనానికి ఎత్తులు వేస్తూ ఉంటాడు. పాండవులను కుంతీ సమేతంగా వారణావ్రతంలో లాక్షా గృహానికి తరలించి, దానిని దహించి పాండవులను మట్టుపెట్టమని దుర్యోధనునికి దుర్బోధ చేస్తాడు శకుని. దీనిని ఆచరణలో పెడతాడు దర్యోధనుడు. ముంచుకు వచ్చే ప్రమాదాన్ని గ్రహించిన శ్రీ కృష్ణుడు, వారణావ్రతం చేరిన పాండవులకు వచ్చి భీమునితో సొరంగ మార్గం త్రవ్వమని ఉద్భోదించడమే కాక, నిద్రమత్తులో ఆదమరచి ఉన్న భీముని ఉత్తేజ పరుస్తాడు. గృహ దహనమయ్యే సమయానికి సోదరులను, తల్లిని సురక్షితం గా కాపాడి అడవికి చేరుస్తాడు. ఆ ప్రాంతంలో నివసించే హిడింబాసారుడు నర సంచారాన్ని కనిపెట్టి, అతని సోదరి హిడింబిను నరుల ఆచూకి తెలుసుకొని రమ్మని పంపిస్తాడు. హిడింబి భీముని వరిస్తుంది. ఎంతకూ హిడింబి తిరిగి రాకపోవడంతో అక్కడకు చేరుకున్న హిడింబాసురుని భీముడు వధిస్తాడు. తల్లి, అన్న గారి అంగీకారంతో హిడింబిని చేపడతాడు భీముడు. అక్కడ నుండి పాండవులు, కుంతి ఏకచక్రపురానికి చేరుకుంటారు. అక్కడ పురజనులను పీడిస్తున బకాసురుని భీముడు వధిస్తాడు.<br />
పాంచాలరాజు ద్రుపదుడు , అర్జునుడిని వివాహమాడు కుమార్తె, ద్రోణుని చంపు కుమారుని కోసం యజ్ఞం చేసి ద్రౌపదిని, దృష్టద్యముని సంతానంగా పొందుతాడు. లాక్ష్యగృహంలో పాండవులు దగ్ధమైనారని తెలిసి హతాశుడవుతాడు. విజ్ఞుల సలహాపై ద్రౌపది స్వయం వరం ప్రకటిస్తాడు. స్వయంవరానికి పాండువులు చేరుకొని అర్జునుడు మత్స్యయంత్రాన్ని చేధిస్తాడు. కుంతి మాట మీద, శ్రీకృష్ణుని ఉద్బోధ ననుసరించి పాండవులైదుగురూ ద్రౌపదిని వివాహమాడతారు.<br />
కుండినను పాలిస్తున్న భీష్మక మహారాజు కుమార్తె రుక్మిణి శ్రీ కృష్ణుని కథలు విని అతనిని వరిస్తుంది. ఆమె అన్న రుక్మి శ్రీకృష్ణుని పై అకారణ ద్వేషం పెంచుకుంటాడు. శ్రీకృష్ణునికి జన్మతాః విరోధి యైన జరాసంధుని ప్రాపకం లో ఉన్న శిశుపాలునితో రుక్మణి వివాహం చేద్దామనుకుంటాడు రుక్మి. అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణునికి రాయబారం పంపుతుంది రుక్మిణి. వివాహం ముందు దేవీ దర్శనానికి వెళ్లిన రుక్ముణిని తన రధంరథం పై ఎక్కించుకొని తీసుకొని పోతాడు శ్రీ కృష్ణుడు. జరాసంధుని, శిశుపాలుని ఓడించి రుక్మికి సగం మీసం, సగం గుండు గొరికి శృంగ భంగం చేస్తాడు శ్రీ కృష్ణుడు.<br />
పాండవులు జీవించి ఉన్నారని తెలుసుకున్న దృతరాష్ట్రుడు వారిని పిలిచి సగ రాజ్యభాగం ఇస్తాడు. ఇంద్రప్రస్ధ నగరాన్ని రాజధాని గా చేసుకొని ధర్మరాజు రాజ్యపాలన మొదలు పెడతాడు. ధర్మరాజు చేత రాజసూయం చేయించ సంకల్పిస్తాడు. శ్రీకృష్ణుడు మగధ రాజైన జరాసంధుని, భీమునిచేత చంపించి రాజసూయానికి మార్గం సుగమం చేస్తాడు. దేవశిల్పి మయుడు ధర్మరాజుకు సభా మండపాన్ని నిర్మించి ఇస్తాడు. రాజసూయానికి విచ్చేసిన దుర్యోధనునికి మయసభ విడిది. పాండవుల వైభవానికి అసూయ పడతాడు దుర్యోధనుడు. మయసభను వీక్షిస్తున్న దుర్యోధనుడు భంగపడతాడు. రాజసూయ సభలో అగ్రతాంబూలానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు ధర్మరాజుకు ఉద్బోదిస్తాడు. దానిని తప్పుపట్టి శిశుపాలుడు శ్రీకృష్ణుని అనేక విధాలుగా నిందిస్తాడు. నూరు తప్పులు పూర్తి కాగానే శిశుపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు చక్రాయుధం తో ఖండిస్తాడు. శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శనతో చిత్రం ముగుస్తుంది.
 
| [[రుక్మిణి]] || [[కె.ఆర్. విజయ]]
|-
| [[ధర్మరాజు ]]|| [[ఎం. బాలయ్య]]
|-
|భీష్మకుడు || [[చిత్తూరు నాగయ్య]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1412105" నుండి వెలికితీశారు