ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: రధం → రథం using AWB
పంక్తి 1:
 
అందరికీ బాగా తెలుసున్న [[రామాయణం|రామాయణ గాధ]] రాముడి జననం , సీతాకళ్యాణం తో మొదలై రాముడి అరణ్యవాసం , సీతాప హరణం, రావణ సమ్హారానంతరం శ్రీ రామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఆ తరువాత కథ చాలా మందికి తెలిసేంతలా ప్రాచుర్యం కాలేదు. దానికి కారణం రామాయణం విషాదాంతం కావడమేమోనని పండితులు అంటుంటారు. రామాయణం రెండు భాగాలుగా ఉంది. శ్రీరామ జననం నుంచి పట్టాభిషేకం వరకు మొదటి భాగం. శ్రీ రామ పట్టాభిషేకం నుంచి నుంచి శ్రీ రామ నిర్యాణం వరకు రెండవ భాగం. ఈ రెండవ భాగాన్నే '''ఉత్తర రామాయణం''' అంటారు. ఈ ఉత్తర రామాయణాన్ని [[భవభూతి]] [[సంస్కృతం]]లో రాసాడు. ఆయన ఒక చోట కరుణ రసం ఒక్కటే రసం అని చెప్పాడు.
Line 9 ⟶ 8:
</poem>
 
కరుణకు భావస్థాయి శ్లోకం. ఎందుకంటే [[వాల్మీకి]] మొదటి శ్లోకం (" మాన్నిషాద" ) కరుణ నుంచే ఉద్భవించింది. దాశరధీ కరుణా పయోనిధీ అని జనులు రాముడ్ని ప్రార్ధించడం అందుకే. ఈ ఉత్తర రామాయణంలో సీతా రాముల వియోగం, నిర్యాణం కారణంగా కరుణ రసం పతాక స్థాయిలో ఉంది. [[తిక్కన సోమయాజి]] [[నిర్వచనోత్తమ రామాయణం]] ( వచనం లేని , కేవలం పద్యకావ్యం) రచించాడు. తరువాత [[కంకంటి పాపరాజు]] ఉత్తర రామాయణాన్ని [[చంపూ కావ్యం]]గా రాసాడు. " జానకీఈ జాని కథల్ రచింపక యసత్కథలెన్ని రచించెనేనియున్ ... వాని కవిత్వ మహత్త్వమేటికిన్?" అన్నాడు పాపరాజు. నిజంగానే [[కవి]] అనేవాడు రాముడి మాట తలవకుండా ఉండలేడు. అంత శక్తి ఆకర్షణా ఉన్నవాడు [[రాముడు]].
 
 
==ఉత్తర రామాయణం కథ==
Line 22 ⟶ 20:
===అడవుల పాలైన సీత===
[[దస్త్రం:Sīta addressed by the sage Vasishtha before departing with Lakṣmaṇa..jpg|thumb|left|300px||లక్ష్మణునితో అడవికి బయలుదేరకముందు వశిష్టుని కలవడానిజి వచ్చిన సీత]]
లక్ష్మణుడు మారుమాటాడక ఉదయాన్నే రధంరథం సిద్ధం చేయమని మంత్రి సుమంతుడుకి చెప్పి సీత వద్దకు వెళ్ళి" తల్లీ. ఆశ్రమంలొ గడపాలన్న నీకోరిక మేరకు నేడు నిన్ను మున్యాశ్రమాలకు గంగా నదివద్దకు తీసుకువెళ్లమని అన్న ఆనతిచ్చారు" అనగానే సీత సంతోషంగా అతనితో గంగానదికి ప్రయాణమవుతుంది. గంగానదిని దాటిన పిదప మున్యాశ్రమతీరంవద్ద " తల్లీ! నా పాపాన్ని క్షమించు. నిన్ను నేను ఇక్కడకు తీసుకువచ్చినది ఈ తీరంలో వదిలి వెళ్లడానికే గాని తిరిగి అయోధ్యాపురికి తీసుకు వెళ్ళడానికి కాదు" అని అసలు సంగతి చెప్పగా ఆమె మూర్చపోయి తేరుకొని "నాయనా సౌమిత్రీ! నేను కష్టాలు అనుభవించడానికే పుట్టాను అని అనిపిస్తున్నది. పూర్వజన్మ పాపం పట్టి పీడించక తప్పదుమరి. అప్పుడు అరణ్యాలలో భర్త తోడుతో గడిపాను. ఇప్పుడు ఒంటరిగా ఉండగలనా? నీభర్త నిన్నెందుకు విడిచిపెట్టాడని అడిగే ముని పత్నులకు ఏమి జవాబు చెప్పేది? సరే. విధిరాత అనుభవింపకతప్పదు. ఆయన మాటను గౌరవిస్తానని చెప్పు. నా నమస్కారాలు తెలియచెయ్యి. " అంటుంది. [[లక్ష్మణుడు]] ఆమె పాదాలకు మొక్కి ప్రదక్షిణం చేసి వెళ్ళలేక వెళ్లలేక గంగా తీరం దాటి వెడతాడు.
 
===ముని ఆశ్రమం, కుశలవులు===
Line 30 ⟶ 28:
===రాజసూయం===
[[దస్త్రం:The boys capture Rama's strayed horse (bazaar art, mid-1900's).jpg|thumb|left|300px|యాగాశ్వాన్ని బధించిన లవ కుశులు]]
ఇదిలా ఉండగా ఒక రోజు రాముడు తమ్ములను పిలిచి తనకు రాజసూయ యాగం చేయాలనున్నది అని చెపుతూ వారి సలహా అడుగుతాడు. భరతుడు అన్నకు అంజలి ఘటించి" ప్రభూ! నీ పాలనలో ధర్మదేవత చక్కగా నడుస్తోంది. కీర్తి చంద్రుడ్ని ఆశ్రియించిన వెన్నెలలా నిన్ను అంటిపెట్టుకొనే ఉన్నది. పాప కర్ములు అయిన రాజులు లేరు. ఈ భూమ్మీద ఉన్న సకల ప్రాణులకు ఏలికవు గతివి నువ్వే అని మరిచావా? రాజసూయం వల్ల అనేక రాజవంశాలు నేలమట్టం అవుతాయి. అందువల్ల రాజసూయం అనవసరమని నా అభిప్రాయం " అనగానే లక్ష్మణుడు అందుకొని" అన్నా! [[భరతుడు]] చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం, ధర్మయుక్తం. నీకు యాగం చేయాలని కోరిక ఉంది గనుక అశ్వమేధం చేయి. ఇది నిర్వహించి పూర్వం [[ఇంద్రుడు]] వౄతాసురవధ వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకం వదిలించుకొన్నాడు. " అంటాడు. శ్రీ రాముడికి వారి మాటలు బాగా నచ్చాయి. " సోదరులారా. మీరు చెప్పినమాటలు నాకు సమ్మతంగానే ఉన్నాయి. ఈ యాగం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయండి. " అని అనుమతిస్తాడు.
 
 
[[సుగ్రీవుడు]], [[విభీషణుడు]] మొదలైన దేశాధిపతులు, మునులు, నటులు, గాయకులు రాగా నైమిశారణ్యంలో గోమతీ నదీ తీరాన యజ్ఞవాటికను సమస్త వైభవోపేతంగా నిర్మించి అది చూడ్డానికి వచ్చేవారికై సకల సౌకర్యాలు సమకూరుస్తారు. మంచి లక్షణాలు కలిగిన గుర్రాన్ని రాముడు అర్చించి వదిలిపెట్టాడు. రక్షకుడిగా లక్ష్మణుడు ఋత్విజులతో సహా బయలుదేరాడు. తరువాత రాముడు యజ్ఙవాటికలోకి ప్రవేశించాడు. అప్పుడు భూమండలంపై ఉన్న రాజులు అందరూ రాముడిని అభినందించి కానుకలు సమర్పించుకోసాగారు. ఇలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏడాది పాటు అశ్వమేధ యాగం కొనసాగింది. దీన్ని మెచ్చుకోని వారు లేరు. అప్పుడు వాల్మీకి మహర్షి శిష్యసమేతంగా విచ్చేసాడు. భరత శత్రుఘ్నులు ఆయన కోసం సౌకర్యవంతమైన పర్ణశాలను ప్రత్యేకించి నిర్మించి విడిది ఏర్పాటు చేసారు. విడిదిలో కి చేరిన తరువాత వాల్మీకి లవకుశలను కూర్చోపెట్టుకొని" చిరంజీవులారా! మీకు నేర్పిన రామాయణాన్ని రాజమార్గాల్లోనూ, మును వాసాల్లోనూ, యజ్ఞవాటిక దగ్గర రాముని మందరం దగ్గర శ్రావ్యంగా, శ్రుతి బద్ధంగా మధురంగా ఆలపించండి. రోజుకు ఇరవై సర్గలు పాడండి. ఫలాలు దుంపలే ఆరగించండి. ఎవరైనా ధనం ఇస్తే స్వీకరించకండి. మీరు ఎవరు అని ప్రశ్నిస్తే " వాల్మీకి శిష్యులం అని మాత్రమే చెప్పాలి. ప్రభువయిన శ్రీరాముడ్నిమాత్రం చులకనగా చూడకండి. అని బోధిస్తాడు.
Line 41 ⟶ 38:
===జానకీదేవి కళంక రహిత===
[[File:The reunited family, in a formal portrait (bazaar art, c.1910's).jpg|thumb|left|మళ్ళీ కలసిన సీతా రాములు]]
రాముడు సరే అని అంగీకరిస్తాడు. ఆయన కోరికమేరకు వారు ప్రతిరోజూ రామాయణాన్ని గానం చేసారు. అది విని రాముడు వీరు సీతాపుత్రులే అని గ్రహించాడు. దూతలను వెంటనే పిలిచి "మీరు వాల్మీకి మహాముని వద్దకు వెళ్ళి. నామాటలుగా ఇలా చెప్పండి. మహర్షీ రాముడు నమస్కరించి మీకు విన్నవిస్తున్నదేమంటే మీ కావ్యం విన్నాను. అతి రమ్యంగా ఉన్నది. మీరు నిజంగా జానకీ దేవి కళంక రహిత అనిభావిస్తే ఆమెను సభాముఖానికి తీసుకొనివచ్చి ఆవిషయం ఆమెను నిరూపించుకోవాలి అని చెప్పగా వారు వాల్మీకిని కలసి తిరిగి వచ్చి" రేపు సీత తన నిర్దోషిత్వావ్వి ప్రకటిస్తుంది. కాబట్టి ఆమెపై అభాండాలు వేసిన వారుకూడా సభకు రావచ్చునని వాల్మీకి సెలవిచ్చారని చెప్తారు. రాముడు సభనుద్దేశించి "రేపు సీత తన నిర్దోషిత్వాన్ని ప్రకటిస్తుంది. మీరు తప్పక రావాలి" అని చెబుతాడు. ఆయన ప్రకటన విన్న వాళ్ళందరూ "ఇటువంటి ధర్మ పాలన నీకే చెల్లుతుంది" అని మెచ్చుకొంటారు. సభలోకి రాగానే శ్రీరాముడి తో పాటు సభాసదులందరూ వినయంగ లేచి నిలబడి మునీశ్వరుల అనుమతితో తిరిగి ఆసీనులయ్యారు. ముగ్ద సౌందర్యమూర్తి అయిన జానకీ దేవిని చాలా కాలం తరువాత చూసిన జనులు కన్నుల నీరుడుకున్నారు. అప్పుడు హృదయభారభరితమైన మౌనాన్ని చేదిస్తూ మేఘ గంభీర స్వరంతో వాల్మీకి ఇలా అన్నారు" సభికులారా! ఈమె పరమసాధ్వి జానకీ దేవి. దశరధుని కోడలు. శ్రీరామచంద్రుని ఇల్లాలు. ఈమెను శ్రీరామ చంద్రుడు లోక నిందకు భయపడి పరిత్యజించినాడు. నేను చెప్పునది సత్యము. ఇందులో ఏమైన అనృతమున్నట్టయితే ఇన్ని వేల సంవత్సరాల నా [[తపస్సు]] నిర్వీర్యమై పోగలదు"
 
 
సభికులు మహా ముని పలుకులు విని చేష్టలు దక్కినవారయ్యారు. శ్రీ రాముడు చిరునవ్వుతో లేచి మునిని శాంతి పరుస్తూ "మునీంద్రా! దివ్యజ్ఞాన సంపన్నులైన తమ వాక్యములు సత్యభూషణములు. నా దేవేరి శీలమును గురించి నాకు ఏమాత్రమూ సందేహము లేదు. ఆమె మహా సాధ్వి అని నాకు తెలియును. మరి లోకులకు కూడా తెలియవడం అవసరమని నే నట్లు నడుచుకోవలసి వచ్చింది. ఆ తరువాత ఈ కుర్రవాళ్ళను చూస్తే నా కుమారులే అని నా అంతరాత్మ తెలుపుతూంది. లోకం కోసమే సీత తన సాధుశీలాన్ని చాటుకోవాలి" అన్నాడు. ఆ మాటలకు అంతా సీత వైపు చూసారు.
Line 56 ⟶ 52:
===లక్ష్మణుడి యోగ సమాధి===
[[File:Lava and Kusa, the sons of Rāma..jpg|thumb|300px|రాముని కుమారులైన లవ కుశులు]]
రాముడు యముని వడి వడిగా పంపి దుర్వాసునికి ఎదురేగి స్వాగతించాడు. దుర్వాసుడు తనకు ఆకలిగా ఉన్నదని మృష్టాన్నం కావాలనీ కోరాడు. ఆయనను కోరిక మేరకు తృప్తి పరచి తాను యముడికి ఇచ్చిన మాటను గుర్తుతెచ్చుకొని విచారించసాగాడు. లక్ష్మణుడు వచ్చి" అన్నా! నీవు మాట తప్పవద్దు. ఏ సంకోచమూ లేకుండా శిక్ష విధించి ధర్మాన్ని నిర్వర్తించు" అని ధైర్య చెప్పాడు. రాముడు నిలువెల్లా కుంగిపోతూ వశిష్ట, భరత , [[శతృఘ్నుడు|శతృఘ్నులను]] సమావేశ పరచి విషయం విని విచారించాడు. [[వశిష్ఠుడు]] " రాజా! ఆడి తప్ప రాదు. నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించు." అన్నాడు. " సాధు పరిత్యాగం మరణసమానమవుతుంది కనుక నిన్ను బహిష్కరిస్తున్నాను." అన్నాడు. వెంటనే సౌమిత్రి తన ఇంటి వైపు కూడా చూడక సరాసరి సరయూ నది ఒడ్డువద్దకు చేరి యోగసమాధి అయ్యాడు. ఇంద్రుడు తన విమానంలో అతన్ని [[అమరావతి]]కి తీసుకుకుపోయాడు. విష్ణు అంశలో నాల్గవభాగం తమ దగ్గరకు వచ్చినందుకు దేవతలు సంతోషించారు.
 
 
లక్ష్మణుడికి దేశ బహిష్కారం చేసాక భరతుని రాజుగా చేసి తాను కూడా వెళ్ళి పోతానని ప్రకటించాడు శ్రీ రాముడు. ఈ మాట విని యావత్తు రాజ్యం దుఃఖించింది. భరతుడయితే మూర్చపోయాడు. కొంతసేపటికి తేరుకొని భరతుడు" అన్నా! నువ్వులేని రాజ్యం నాకెందుకు? నిన్నువదిలి నేనుండలేను. కోసల రాజ్యం రెండుభాగాలు చేసి దక్షిణం [[కుశుడు|కుశుడికి]] ఉత్తరం [[లవుడు|లవుడుకి]] ఇచ్చేద్దాం. ఇదే ధర్మబద్ధం . వెంటనే శతృఘ్నునికి కబురుపెడదాం. " అన్నాడు. వరసగా జరుగుతున్న ఘటనలు ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించాయి. వశిష్ఠుడు " రామా! ప్రజల అభీష్టాన్ని కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి"" అన్నాడు. రాజు ప్రజలతో సభ జరిపి "నా నిర్ణయం రాజ్యాన్ని త్యజించి పోవడం. మీ నిర్ణయం ఏమిటి?" అని అడిగాడు. "ప్రభూ మీ నిర్ణయమే మాకు శిరో ధార్యం. తమతో పాటు అనుసరించాలని మాలో చాలా మందికి ఉన్నది. అందుకు అనుమతించండి. అదే మాకోరిక" అన్నారు. రాముడు సరేనన్నాడు.
Line 67 ⟶ 62:
===రామావతార పరిసమాప్తి===
[[దస్త్రం:Rama departs to enter Heaven.jpg|thumb|స్వర్గమునకు వెళ్ళడానికి బయలుదేరిన రాముడు]]
మరునాడు తెల్లవారింది. బ్రాహ్మణులు అగ్ని హోత్రాలు, వాజపేయచ్చత్రాన్ని పట్టుకొని ముందుకు నడుస్తుండగా రాముడు సన్నని వస్త్రాలు ధరించి, చేతి వేళ్ళ మధ్య ధర్భలు పట్టుకొని, మంత్రోచ్చారణ చేస్తూ వెడుతునాడు. ఆయనకు రెండు పక్కలా శ్రీ దేవి, హ్రీదేవి, ముందు భూదేవి ఉన్నారు. ధనుర్భాణాలు పురుష రూపంతో ఆయన్ని అనుగమించినాయి. వేదాలు, గాయత్రి , ఓంకారవషట్కారాలు ఆ పురాణ పురుషుణ్ణి అనుసరించాయి. బ్రహ్మర్షులు, విప్రులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, జనగణం, రాక్షసులు ఆమర్యాద పురుషోత్తముని వెంట నడిచారు. అయోధ్యలో ఉన్న పశు పక్ష్యాదులు కూడా రాముని వెంట పోగా అయోధ్య అంతా పాడుపడినట్టు ఖాళీ అయిపోయింది. శ్రీ రాముడు అర్ధ యోజన దూరం నడచి, పడమట దిక్కుగా ప్రవహిస్తున్న [[సరయూ నది]] చేరుకొన్నాడు. అప్పటెకే దేవతలతో ముని బృందాలతో బ్రహ్మదేవుడు అక్కడ వేంచేసి ఎదురుచూస్తున్నాడు. ఆకాశం దివ్య విమానాలతో నిండిపోయింది. అర్చకుల మంత్రోచ్చారణలు జరుపుతునారు. దేవతలు దుందుభులు మోగించారు. పరిమళాలతో గాలి చల్లగా వీస్తోంది. పూలవాన కురవడం మొదలయింది. అప్పుడు సరయూ నదిలోకి పాదాన్ని పెట్టాడు రాముడు. బ్రహ్మ అప్పుడు రామునితో ఇలా అన్నాడు" మహావిష్ణూ ! నీకు శుభమగుగాక! నీ తమ్ముళ్ళతో కూడా స్థూల శరీరాలు విడిచి దివ్యశరీరాన్ని ధరించు. నీకు కావలసిన రూపం అందుకో తండ్రీ!సకల భువనాలకూ నువ్వే ఆధారం."
 
 
పితామహుడి మాటలు విని రాముడు వైష్ణవ రూపం స్వీకరించాడు. సోదరులుకూడా అలాగే చేసారు. కిన్నెరులు కింపురుషులు, యక్షులు, దేవతలు ఇలా సకల లోకాలకు చెందినవారంతా జయజయ ధ్వానాలు చేసి [[విష్ణువు]]కు భక్తిగా మొక్కారు. అప్పుడు బ్రహ్మతో విష్ణువు "నావెంట వచ్చిన వారంతా నా భక్తులు. సర్వం త్యజించి నన్ను అనుసరించినవారు. వారికి పుణ్యలోకాలు ప్రసాదించు" అని అజ్ఞాపించాడు. బ్రహ్మ రెండుచేతులా విష్ణువుకు మొక్కి"దేవా! నిన్ను నమ్మిన వారు ఆశ్రయించినవారు పశువులైన పక్షైనా సంతానకమనే దివ్యలోకం చేరతారు. ఇప్పుడు వీరినందరినీ ఆ లోకానికే చేరుస్తాను. వానరాదులు ఏ దేవతాంశం నుంచి జన్మించారో ఆ దేవతాంశం పొందుతారు. సుగ్రీవుడు సూర్యునిలో లేనమై పోతాడు" అన్నాడు. రాముడ్ని అనుసరించిన వారు " గో ప్రతారం " అనే తీర్ధంలో మునిగారు. వాళ్ళకి పూర్వ శరీరాలు పోయి దివ్యశరీరాలు వచ్చాయి.అప్పుడు వారు తమకు కేటాయించిన విమానాల్లో పుణ్యలోకాలు వెళ్ళిపోయారు.
 
==ఆధ్యాత్మ విశేషాలు==
 
 
==కథా భేదాలు==
 
 
==ఇవి కూడా చూడండి==
 
 
==మూలాలు==
Line 85 ⟶ 76:
 
==బయటి లింకులు==
 
 
 
{{రామాయణం}}
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు