సేలం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: రధం → రథం using AWB
పంక్తి 48:
 
== ప్రారంభ చరిత్ర ==
కొండల చుట్టూ ఉండే ప్రదేశాన్ని శాసనాల్లో సూచించే ''హాయ్'' లేదా ''శల్య'' లేదా ''సయిలం'' అనే పదాలనుండి ''సేలం'' అనే పేరు ఉత్పన్నమైనట్లు భావించబడుతున్నది. సేలం మరియు పరిసర ప్రాంతాలలో ఉండే కొండలు ప్రాచీన కాలంలో [[చేర]] మరియు [[కొంగు]] రాజ్యాలలో భాగంగా ఉండేవి. ప్రాచీన తమిళనాడు కు చెందిన '''కురునిల మన్నర్గళ్''' అయిన కొంగు రాజులు ఈ ప్రాంతాలని పరిపాలించేవారు. స్థానిక జానపదకథల ప్రకారం [[తమిళ]] కవయిత్రి [[అవ్వయ్యార్]] సేలం లోనే జన్మించింది. [[గంగా వంశానికి]] చెందిన శాసనాలు ఈ జిల్లా లోని ప్రదేశాలలో దొరికాయి. ఈ నగరము [[కొంగు నాడు]] మధ్యలో ఉన్నది.
 
తరువాత సేలం [[పశ్చిమ గంగా రాజవంశం]]లో భాగమయి, చాలా కాలం గంగాకులం పాలకులు చేత పరిపాలించబడింది. [[విజయనగర సామ్రాజ్యము]], దక్షిణ దండయాత్రలో భాగంగా తమిళనాడుని ఆక్రమించినప్పుడు, సేలం మధురై నాయకుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత, సేలంకు చెందిన '''గట్టి ముదలిలు''' [[పోలిగర్]] లు పరిపాలించి, కొన్ని ప్రసిద్ధ ఆలయాలు మరియు కోటలను నగరం లోపలా బయటా నిర్మించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో, [[మైసూర్]]-[[మధురై]] యుద్ధం అని పిలవబడే దీర్ఘకాల వైరం తరువాత సేలం [[హైదర్ అలీ]] అధీనంలోకి వచ్చింది. తరువాత 1768 ప్రారంభంలో సేలంని హైదర్ అలీ నుండి కర్నల్ వుడ్ తీసుకున్నారు. 1772 సంవత్సరము చివరిలో హైదర్ అలీ సేలంని మళ్ళీ కైవసం చేసుకున్నారు. 1799లో [[లార్డ్ క్లైవ్]] అధ్వర్యంలో సేలం మల్లి సంకరిదుర్గ్ లో ఉన్న సైన్య దళానికి చెందిన ఒక విభాగం చేత ఆక్రమణక గురయి, 1861 వరకు, సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించేవరకు, ఒక సైన్య స్థావరం లాగ ఉండేది. మాగ్నం చౌల్ట్రి (ప్రస్తుతం మగుడన్ చావడి అని పేరు మార్చబడింది) వంటి స్థలాలు ఇక్కడ చూడవచ్చు. దీరన్ చిన్నమలై కాలములో సేలం, సంకగిరి వంటి ప్రాంతాలలో [[కొంగు]] సైన్యం మరియు బ్రిటిష్ అలైడ్ సైన్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రఖ్యాతి పొందిన [[కొంగు]] నాయకుడు '''తీరన్ చిన్నమలై''' [[సంకగిరి]] కోటలో ''ఆడి పెరుక్కు రోజు'' న ఘోరంగా ఉరి తీయబడ్డాడు. ఈ స్థలమే తరువాత బ్రిటిష్ వాళ్ల ప్రధాన సైన్య శిబిరముగా మారింది.
పంక్తి 74:
| work = Tamil Nadu
| publisher = Election Commission of India }}</ref>. సేలం రామసామి ముదలియార్, సి.విజయ రాగావాచారియార్, పగడాల నరసింహ నాయుడు, [[సి. రాజగోపాలచారి]] ([[రాజాజీ]]), డా. పి.సుబ్బరాయన్, ఎస్.వి. రామస్వామి వంటి అనేక గొప్ప వ్యక్తులు సేలం కు చెందిన వాళ్లే.
మోహన్ కుమారమంగలం, ఇందిరా గాంధి మంత్రిమండలిలో ఇనుము మరియు ఉక్కు మంత్రిగా పనిచేశాడు..
 
ప్రస్తుతం [[తమిళ్ నాడు]] వ్యవసాయ మంత్రిగా ఉన్న వీరప్ప ఆరుముగం (DMK పక్షం) ఈ నగరానికి చెందిన వాడు.
 
== జనాభా ==
2001 నాటి భారత జనగణన ప్రకారం, సేలం పట్టణ సరిహద్దు ప్రాంతాలతో కలిపి మొత్తం జనాభా 751,438 గా ఉంది. వీటిలో సేలం మునిసిపల్ కార్పోరేషన్ (696,760), కొండలంపట్టి (16,808), కన్నన్ కురిచి (14,994) నెయ్క్కరపట్టి(9,869), మల్లమూప్పాంపట్టి (6,783) మరియు దలవైపట్టి (6,224) ఉన్నాయి.
 
జనాభాలో పురుషులు 64% మరియు స్త్రీలు 36%. సేలం లో సగటు అక్షరాస్యత రేటు 77%, ఇది జాతీయ సగటు 64.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 82%, మరియు స్త్రీలలో అక్షరాస్యత 72%. సేలంలో 10% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు.
 
సేలం లో మాట్లాడే ప్రధాన భాష '''కొంగు తమిళం''' . సేలం లో [[జైనులు]], మార్వారీ లు వంటి వ్యాపారంలో స్థిరపడిన ఉత్తర భారతీయులు గణనీయంగా ఉన్నారు. వీళ్ళు తమిళంలో మాట్లాడటానికి కూడా నేర్చుకున్నారు.
 
ఈ నగరం గత రెండు దశాబ్దాలలో గణనీయంగా వృద్ది చెందింది. ఈ విషయం అధికారిక జనాభా లెక్కను బట్టి తెలుస్తుంది. 1991లో జనాభా: 499,024 & 2001లో జనాభా: 696,760.
పంక్తి 89:
== వినోదం ==
=== చలనచిత్ర థియేటర్ లు ===
చలనచిత్ర థియేటర్ ల నగరంగా సేలంకు ఎంతో కాలంగా పేరు ఉంది. ఒక ప్రత్యేకత ఏమంటే కిట్చిపాలయం అనే ఒక ప్రదేశంలోనే అతి ఎక్కువ సంఖ్యలో చలనచిత్ర థియేటర్ లు ఉన్నాయి.
 
80లలో అత్యధికంగా దాదాపు 28 థియేటర్ లు, హాలివుడ్ చిత్రాలు, డబ్ చేయబడిన చిత్రాలు, పాత చిత్రాలు వంటి అన్ని రకాల చిత్రాలను ప్రదర్శిస్తూ ఉండేవి. అయితే కొన్ని థియేటర్లు మూసివేయడంతో ప్రస్తుతం సుమారు 15 థియేటర్ లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి కూడా సుమారు 15 థియేటర్ లు నడుస్తూనే ఉన్నాయి. ARRS ముల్టిప్లేక్స్, బిగ్ సినిమాస్ వంటివి కొన్ని ప్రసిద్ది చెందిన థియేటర్ లు.
పంక్తి 142:
 
== మతపరమైన స్థలాలు ==
సేలంలో అనేక [[మారియమ్మన్]] [[దేవాలయాలు]] ఉన్నాయి. ప్రతి ఏడాది జూలైలో ఒక పక్షం రోజులపాటు నగరంలో మారియమ్మన్ తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళప్పుడు, మారియమ్మన్ దేవత ఆభరణాలు, పూల రథాలతో అలంకరంచిబడి, అర్ధరాత్రి సమయములో ఊరేగింపుగా తీసుకువెళ్ల బడుతుంది. తిరుణాలు మొదటి ముఖ్యమైన రోజున, జనం ప్రార్ధనలు చేసుకుంటూ నిప్పు మీద నడుస్తారు. (గమనిక: భక్తులు నిప్పుని పువ్వు అని పిలుస్తారు) రెండవ రోజు అనేక విచిత్ర వేషధారణలతో రంగు రంగులగా ఉంటుంది. రాష్ట్రం లోని అమ్మన్ దేవాలయలాల్లో ఉన్న రధాల్లలో షేవపేట్ మారియమ్మన్ [[దేవాలయ రధంరథం]] చాలా పెద్దది. ఈ తిరుణాలు ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. కొట్టి మారియమ్మన్ దేవాలయం సేలం లోనే కాకుండా తమిళ్ నాడు అంతట చాలా ప్రసిద్ది.
 
నగర ముఖ్యప్రాంతంలో "కొట్టై పెరుమాళ్ కోయిల్" అని పిలవబడే అళగిర్నాథర్ తిరుకోయిల్ ఉంది. ఈ గుడి శతాబ్దాల కిందట నిర్మించబడింది. ఇక్కడ కొన్ని సుందరమైన శిల్పాలు ఉన్నాయి. ఈ గుడిలో "[[వైకుంట ఏకాదశి]]" చాలా ప్రసిద్ధమైన పండగ. ఆ రోజు లక్షలాది భక్తులు గుడిని దర్శిస్తారు.బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి, పురట్టాసి వంటి పండగలు కూడా మంచి భక్తి భావాలతో జరపబడుతాయి. ఈ రోజులల్లో వేలాది భక్తులు ఈ గుడికి తరలి వస్తారు. "ఆండాళ్ తిరుకల్యణం" ఈ గుడిలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అప్పుడు శ్రీ విల్లి పుత్తూర్ నుండి ఒక ప్రత్యేకమైన పూలదండ తీసుకు రాబడుతుంది. ("సూడి కొడుత సుడర్ మాలై")
పంక్తి 282:
 
[[సేలం ఎయిర్ పోర్ట్]]-
సేలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన (కోడ్ FR3241) ఒక స్వదేశీ విమానాశ్రయం ధర్మపురి, బెంగుళూరు వెళ్ళే NH7 రహదారిలో ఓమలుర్ సమీపంలో కమలాపురంలో ఉంది.
 
15 నవంబర్ 2009 నుండి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సేలం ఎయిర్ పోర్ట్ నుండి చెన్నై కు క్రమంగా విమానాలని నడుపుతుంది. ఈ విమానాలు ద్వారా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ మరియు కోల్ కట్టా కు వెళ్ళవచ్చు.
పంక్తి 322:
 
== విద్య ==
ఒకప్పుడు విద్యారంగంలో తమిళ్ నాడు లోనే చాలా వెనుకబడి ఉన్న జిల్లాగా ఉన్న సేలంలో ఇప్పుడు అనేక విద్యా సంస్థలు ఉన్నాయి.
 
ఇక్కడ గవర్నమెంట్ మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజ్, సేలం అనే పేరుతో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల 1986లో ప్రారంభించబడింది. ఇది MCI<ref>http://www.mciindia.org/apps/search/view_college.asp?ID=226</ref> గుర్తింపు పొందిన కళాశాల. ఇక్కడ 75 MBBS సీట్ లు ఉన్నాయి. ఇది ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి, సేలం తో కలిసి ఉన్నది. ఆసుపత్రికు 10&nbsp;km దూరంలో ఉన్న వైద్య కళాశాల లో తరగతులు జరుగుతాయి.
 
ఆసుపత్రిని ఇప్పుడు రు.120 కోట్లు కర్చుతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ (AIIMS) మాదిరిగా మెరుగు పరుస్తూ ఉన్నారు.<ref>http://www.hindu.com/2006/07/03/stories/2006070310620100.htm</ref> కొత్త భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు