మండోదరి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రుషి → ఋషి using AWB
పంక్తి 6:
మండోదరి అంటే రావణ బ్రహ్మ సతీమణి గా తెలుసు. ఆమె పేరు తలచుకుంటే చాలు పాపాలు హరించ బడతాయని పురాణాలు చెబుతున్నాయి. మండోదరి రావణుని భార్యనే కాదు. ఆమె మయుడనే గొప్ప నిర్మాణ శిల్పి కుమార్తె. మండోదరి అంటే మండనం యస్యస ఉదరం. అంటే సన్నని నడుము గలది అని అర్ధం. తెలుగు లో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలది. భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్యత గల ఉదరము అని.
 
మండోదరి అహల్య, తార, సీత, ద్రౌపది తో కలిసి పంచ కన్యగా ప్రసిద్ది చెందింది. విచిత్ర మేమిటంటే, ఈ అయిదుగురు స్త్రీలు తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడిన వారే. అహల్య ని గౌతమ రుషి వెళ్ళగొట్టాడుఋషివెళ్ళగొట్టాడు (పర పురుష సంబంధం ఉందన్న కారణంగా), తార తన భర్త వాలి చనిపోయిన తరువాత అతని సోదరుడైన సుగ్రీవుడిని వివాహమాడింది, సీత చెప్పుడు మాటలు విన్న రాముడి చేత వెళ్ళ గొట్టబడింది, ఇక ద్రౌపది అయిదుగురు భర్తలు ఆమెను జూదం లో ఒడ్డి, పోగొట్టుకున్నారు. అయితే మండోదరి మాత్రం ఒక అసురుని భార్య గా మాత్రమె తెలుసు.
 
మండోదరి గురించి అనేక పురాణ కథలు వ్యాప్తి లో వున్నాయి. అందులో ఒకటి: మండోదరి కి జన్మించిన సంతానం వల్ల తన భర్త కు ప్రాణ హాని ఉందని జోస్యం చెప్పింది. ఒక రోజు ఆమె ఒక కుండలో నీరనుకుని రక్తం తాగుతుంది. ఆ రక్తం రావణుడు వధించిన రుషులది. ఆ కారణం గా ఆమె గర్భం ధరించి, ఒక కుమార్తె కు జన్మనిస్తుంది. జోస్యం తెలిసిన భర్త తన బిడ్డ ని బతకనివ్వడని, ఆమెను ఒక పెట్టెలో పెట్టి, సముద్రం లో విదిచిపెడుతుంది. సముద్రుడు ఆ పెట్టెను భూదేవి కి ఇస్తాడు. భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది. ఆ పాపే సీత. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తె ను గుర్తుపట్టి, రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది.
పంక్తి 12:
{{రామాయణం}}
{{అప్సరసలు}}
 
[[వర్గం:రామాయణంలోని పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/మండోదరి" నుండి వెలికితీశారు