గై డి మొపాసా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q9327
చి clean up, replaced: కధ → కథ using AWB
పంక్తి 17:
}}
 
'''గై డి మొపాసా''' (5 ఆగస్టు 1850 – 6 జూలై 1893) ప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత మరియు ఆధునిక చిన్న కథల సాహిత్యానికి ఆద్యుడు. ప్రపంచ సాహిత్యం లో కథా రచన అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాసా ఒకటి. వస్తువు, శిల్పము, విషయంలో సోమర్ సెట్ మాం కీ, ఓ హెన్రీకి కూడ మార్గదర్శకుడిగా కీర్తి సంపాదించేడు. అసామాన్యమైన సునిశితదృష్టి కనబరుస్తూ, మానవనైజం లోని అన్ని పార్స్వాలూ స్పృశిస్తూ అద్భుతమైన సాహిత్య సృష్టి చేశాడు. అందులో Naturalism and Fantastic రెండూ ఉన్నాయి. అతని కథలని చిన్నచిన్నమార్పులతో చాలామంది అనుకరించేరుకూడా. మనోవిశ్లేషణాత్మక రచన అతని ముద్ర. లియో టాల్ స్టాయ్ కళ గురించి వ్రాసిన వ్యాసాలలో మొపాసా సాహిత్యం లోని కళాత్మకత ఆవిష్కరించేడు. అతని వచన రచన కొన్ని సందర్భాలలో పద్యరచనని మించిన కల్పనాశక్తితో, సందర్భానికి తగ్గట్టుగా ఉంటూ, దానికి విలువని జోడిస్తుంది. అతను Joseph Prunier, Guy de Valmont, and Maufrigneuse అన్న మారు పేర్లతో రచనలు చేశాడు. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు.
 
=='''బాల్యం'''==
 
మొపాసా, లారే లి పొఇట్టెవిన్ మరియు గుస్తావ్ డి మొపాసా ల మొదటి సంతానం గా ఆగస్టు 5, 1850 లో ఫ్రాన్స్ లో జన్మించాడు. మొపాసాకి పదకొండేళ్ళు, అతని తమ్ముడికి అయిదేళ్ళ వయసు ఉన్నప్పుడు స్వతంత్ర భావాలు గల అతని తల్లి భర్త నుండి విడి పోయింది. బాల్యం లో మొపాస పై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆమె సాహిత్యాన్ని , ముఖ్యంగా షేక్స్పియర్ సాహిత్యాన్ని బాగా ఇష్టపడేది.
 
=='''చదువు'''==
పంక్తి 29:
=='''రచనలు'''==
 
15 కథా సంకలనాలు, 3 ట్రావెలోగ్ లూ, 6 నవలలు,1 కవితా సంకలనం అతని సాహిత్య సృష్టి. మొపాసా స్త్రీని ప్రేమిస్తాడు. బాహ్య రూపురేఖలను మాత్రమేగాక, ఆమె ఆత్మను కూడా దర్శిస్తాడు. ఆమెలోని మంచినీ, ఆమె దుఃఖం పట్ల సానుభూతినీ పాఠకుడికి బదిలీ చేస్తాడు. సమాజంలోని ప్రతి మంచీ ధ్వంసమవుతూ వస్తోంది. నీతిలేని, వివేకరహిత సమాజంలో ప్రతి మంచికీ స్థానం లేదు. దివ్యమూర్తిలాంటి స్త్రీ కూడా ఒక్కోసారి ధ్వంసమవడానికి కారణం ఇదే! స్త్రీని బహుముఖీనంగా చిత్రించాడు. మానవనైజంలోని అనేక పార్శ్వాలనూ పట్టుకున్నాడు. ‘కొత్తది, వేరే ఎవరూ గమనించలేనిది’ చూశాడు. ఎవరూ చేరుకోలేనంతటి అందమైన వచనాన్ని సృజించాడు. చిరుద్యోగిగా రచనావ్యాసంగం ప్రారంభించి, వెన్వెంటనే విపరీతమైన ఆదరణ పొందాడు. పదేళ్ల కాలంలో వేగంగా 300 కథలు, 6 నవలలు రాశాడు. ‘లె మిజెరెబుల్స్’(హ్యూగో) తర్వాత ఫ్రెంచ్ సమాజాన్ని పట్టించిన గొప్ప నవలగా మొపాసా ‘ఉనె వి’ (ఒక జీవితం) పేరుతెచ్చుకుంది.
 
శృంగారాన్ని అన్ని కోణాలనుంచీ తరచిచూసి, కీలకమైన ఆధ్యాత్మిక ముఖాన్ని మాత్రం మొపాసా విస్మరించాడని టాల్‌స్టాయ్ అంటాడు. దానివల్ల పునాదిలేని అందమైన భవనంలాగా ఆయన నిలబడ్డాడని విమర్శించాడు. అయితే, ‘ఆధ్యాత్మిక జననం’ జరిగేలోగా మరణించాడనీ, అయినప్పటికీ, ఆయన సృష్టించినది తక్కువేమీకాదనీ, దానికే మనం కృతజ్ఞులమై ఉండాలనీ చెబుతాడు.
పంక్తి 46:
==ఇతర లింకులు==
 
తెలుగు అనువాద కధకథ [http://teluguanuvaadaalu.wordpress.com/2012/11/18/%E0%B0%85%E0%B0%A6%E0%B0%82%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%97%E0%B1%88-%E0%B0%A6-%E0%B0%AE%E0%B1%8A%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE-%E0%B0%AB/ అదంతా కలేనా?]
 
[[వర్గం:1850 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/గై_డి_మొపాసా" నుండి వెలికితీశారు