పానగల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర మరియు ఇతర విషయాలు: clean up, replaced: స్మశానం → శ్మశానం using AWB
పంక్తి 27:
kota
చారివూతక సంపద
ఒకప్పుడు ఇక్కడ యుద్ధాలు జరిగాయి అనడానికి ఆధారాలుగా పెద్దపెద్ద ఫిరంగులున్నాయి... శిల్పసంపద... పూజించుకునేందుకు దేవుళ్లు... శిథిలావస్థలో ఉన్న ఉయ్యాల, కోటలు... ఇవన్నీ గతవైభవ దీప్తులే! మిగిలిన చారివూతక సంపదలే! చనిపోయిన వారిని ఖననం చేసిన స్మశానంశ్మశానం కూడా నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నది. చనిపోయిన వారిని వరుసగా ఖననం చేసినట్లు ఇక్కడున్న ఆనవాళ్లను చూస్తే అర్థమవుతుంది. ముండ్లగవిని అనే ప్రధానద్వారం ఈనాటికీ దర్జాగా నిలబడి ఉన్నది. ఈ కట్టడానికి పెద్దపెద్ద బండరాళ్లనుపయోగించారు. దీని గోడలపై సింహం, గజ, లత శిల్పాకృతులున్నాయి! ఇలాంటి అమూల్యమైన సంపదనంతా తన గర్భంలో దాచుకున్న ఈ ఖిల్లా సముద్రమట్టానికి 1800 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది!
శిలా శాసనాలు
ఈ ఖిల్లాపై తెలుగు, కన్నడ, కొంత ఉర్దూ లిపిలో ఓ శిలా శాసనం లభ్యమైంది. అయితే ఇది శిథిలమై చదవడానికి అనువుగా లేదు. ఆ శాసనంపై ఉన్న ఆధారాలతో అది భైరాన్‌ఖాన్ మూడో శాసనమని మాత్రం అవగతమవుతున్నది. దీన్ని చిన్నమంత్రి అనే రచయిత చెక్కినట్లు తెలుస్తున్నది. ‘‘స్వస్తీశ్రీ జయభ్యుదయ శాలివాహన వర్షంబులు 1540 అగుననేడి చాంద్రమాన రౌద్రినామ మహామండలేశ్వర సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్‌షా వారి సుబేదారుడు భైరాన్‌ఖాన్ ముక్తి పానుగంటి బాలల్లా మీద బురుజు కట్టించి ఈ సుభాకొండలోని కుమ్మరివీధిలో నడ బావిని తవ్వించి రాతి కట్టడంతోపాటు సున్నపుగచ్చు వేయించి ఆ చంద్రార్కరము నిలుచునట్లు ప్రతిష్ఠ చేసె’నని ఆ శాసన సారాంశం.
"https://te.wikipedia.org/wiki/పానగల్" నుండి వెలికితీశారు