బొల్లిముంత శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి using AWB
పంక్తి 40:
[[గుంటూరు జిల్లా]] [[వేమూరు]] మండలం [[చదలవాడ]] లో అక్కయ్య, మంగమ్మ దంపతులకు జన్మించిన శివరామకృష్ణ గుంటూరులోనే హయర్‌ గ్రేడ్ ట్రెయినింగ్ పూర్తిచేశారు. ఆయన తండ్రి చదలవాడలో పాఠశాల నెలకొల్పడంతో ఉపాధ్యాయుడిగా అందులోనే చేరారు. కవిరాజు [[త్రిపురనేని రామస్వామి చౌదరి]], [[త్రిపురనేని గోపీచంద్]] లతో పరిచయం కలిగింది. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేవి. అందుకు కారణం వారి తండ్రి గారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం తోనూ, జస్టిస్‌ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ సంబంధాల ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడ్డాయి. ఈలోగా గోపీచంద్‌ కథలు రాసి పత్రికల్లో అచ్చేస్తూ ఉండేవారు. మంచి పేరు వస్తూ ఉండేది. అది చూసి శివరామకృష్ణ కూడా వచనంలోకి మారారు. తనూ కథలు రాసి పత్రికలకు పంపాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1936లో మద్రాసు నుండి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ‘ఏటొడ్డు’ ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు.
==రచయితగా==
1945లో తన ఉపాధ్యాయ వృత్తిని వదలి వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి చల్లపల్లి రాజాకి వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట అనుభవాలతోనే తొలి రాజకీయ నవల ''మృత్యుంజయులు'' రాశారు. ''నగారా'' అనే పత్రిక నడిపారు. కొడవటిగంటి కుటుంబరావు రాసిన 'పిల్లి' అనే కథపై కొడవటిగంటి తిరోగమన యాత్ర'' అంటూ విమర్శ రాశారు. బెంగాల్ కరవుపై బుర్రకథ రాశారు. 'రైతుబిడ్డ' హరికథ రాశారు. ''సూక్ష్మంలో మోక్షం'', ''అంతరాత్మ అంత్యక్రియలు'', ''శివరామకృష్ణ కథలు'' బొల్లిముంతవే. ''ఏ ఎండకాగొడుగు, పత్రికా న్యాయం, తెలంగాణా స్వతంత్రఘోష, క్విట్ కాశ్మీర్, ధర్మసంస్థాపనార్థాయ... ఇలా ఎన్నో నాటికలు రాశారు. ''రాజకీయ గయోపాఖ్యానం, రాజకీయ కురుక్షేత్రం'' వంటి పద్యనాటకాలు రాశారు. ''దొంగ దొరికింది, భలేమంచి చౌకబేరం...'' వంటి రేడియో నాటికలు రాశారు. ''నేటి భారతం'' పేరుతో మూకీ నాటిక రాశారు. ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సమయంలో బొల్లిముంత శ్రీకాంత్‌తో కలసి ''అందరూ బతకాలి'' నాటకం రాశారు. దీన్ని [[రక్తకన్నీరు నాగభూషణం]] వందకు పైగా ప్రదర్శనలిచ్చారు.
 
1955 మధ్యంతరం ఎన్నికల్లో రెండు పర్యాయాలు బొల్లిముంతపై హత్యాప్రయత్నం జరిగింది. 1960లో మనసుకవి [[ఆత్రేయ]] దగ్గర చేరారు. వాగ్దానం, కలసివుంటే కలదుసుఖం, కలిమిలేములు'' వంటి అనేక చిత్రాలకు ఆరుద్రకు సహరచయితగా సహకరించారు. [[బి.ఎస్.నారాయణ]] దర్శకత్వం వహించిన సినిమాల్లో అధిక భాగం ఆయన రాసినవే. 1968లో విశాలాంధ్ర ప్రారంభించిన ''[[ప్రతిభ]]'' వారపత్రికకి సంపాదకుడయ్యారు. దర్శకుడు [[వి.మధుసూదనరావు]] చిత్రాలకు ఎన్నిటికో సంభాషణలు రాశారు. ఆయన రాసిన దాదాపు యాభై సినిమాల్లో మనుషులు మారాలి, [[ప్రజా నాయకుడు]] వంటి సీరియస్ సినిమాలేకాక [[శారద]], [[కళ్యాణమంటపం]], [[మూగకు మాటొస్తే]], [[విచిత్రబంధం]] వంటి సెంటిమెంట్ ప్రధానమైన చిత్రాలు కూడా ఉన్నాయి. నాటకాల్లో హార్మోనియం వాయించారు. స్త్రీ పాత్రలు ధరించారు.
 
==ఉద్యమాలలో==
1938-39 సంవత్సరంలో గుంటూరులో హయ్యర్‌ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్ధి ఉద్యమంతోవిద్యార్థిఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లోనే ఆయన ‘దేశం ఏమయ్యేట్టు?’, ‘వ్యక్తి స్వాతంత్య్రం’ వంటి కథలు రాసి ప్రచురించారు. కమ్యూనిస్టు కార్యకర్తగా ఆయన తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని కథలుగా మలచడం తప్ప, పనికట్టుకుని కథలు రాయాలని రాయలేదు. వ్యవసాయ కూలీలు, ఇతర నిరుపేదలపై దృష్టి సారించి, కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రతిబింబిస్తూ రాశేవారు.
ఆ రోజుల్లో [[చదలవాడ పిచ్చయ్య చౌదరి]] అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నాయకుడు. ఆయన ఇటు త్రిపురనేని రామస్వామి చౌదరి, అటు కృష్ణ శాస్ర్తి లాంటి వారందరినీ కలుపుకుని అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందుకు తీసుకు వెడుతూ ఉండేవారు. 1943 లో [[తెనాలి]] లో అరసం తొలి మహాసభ జరపడంలో చదలవాడ పిచ్చయ్య చౌదరి కృషి ఎంతో ఉంది. ఆ సభకు అధ్యక్షులు [[తాపీ ధర్మారావు]]. బొల్లిముంత శివరామకృష్ణ అప్పటికి ఇరవై మూడేళ్ళ యువకుడు. ఆ మహాసభకు కార్యకర్తగా పనిచేశారు. అప్పటిదాకా అరసంతో సంబంధాలు లేకపోవడం వల్ల, అరసం నిర్వహణలో వెలువడే ‘తెలుగు తల్లి’ పత్రికలో బొల్లిముంత కథలు అచ్చు కాలేదు.
 
పంక్తి 62:
*[[తిరుపతమ్మ కథ]] (1963) (మాటల రచయిత)
*[[వాగ్దానం]] (1961) (స్క్రీన్ ప్లే)
 
 
* ఆయన [[జూన్ 7]] , [[2005]] న మరణించారు.ఆ మరుసటి నెలే జులై 2005 సంచికను ‘ప్రజాసాహితి’ బొల్లిముంత శివరామకృష్ణ సంస్మరణలో వెలువరించింది.