నేపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రారంబ → ప్రారంభ using AWB
పంక్తి 56:
నేపాలు కు వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన మరియు చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. [[గౌతమ బుద్ధుడు]] క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాలు లోని దక్షిణ ప్రాంతాలను(హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. అశోకుడు రుమ్మినిదేవి అను ప్రాంతమున ఒక స్తంభమును నెలకొల్పినాడు మరియు స్యయంభూనాధ్ అనుచోట కొండకు పడమటి భాగమున కొన్ని బౌద్ధ కట్టడములను కట్టించినట్లు చెప్పబడుచుండెను. అంతేకాక అశోకుడు తన కుమార్తె అయిన చారుమతిని దేవపటాణ్ అను ప్రాంతమున నివసించు సుక్ష్యత్రియుడు అగు ఒక బౌద్ధ భర్మధీక్షాపరాయణుడికిచ్చి వివాహము చేసినట్లు కొందరు చరిత్రకారులు చెప్పుచున్నారు. అశొకుని అనంతరము మగధ సామ్రాజ్యము విచ్చిన్నమయిపోయినది. ఇతర దేశములతోపాటు నెపాళదేశము కూడా సామ్రాజ్యంతర్భాగమున నుండుటను విరమించుకొనెను. ఈవిశెషము జరిగిన పిమ్మట చాలాకాలము వరకు అంతగ నేపాళ దేశపు చరిత్ర మెవారికీ తెలియకుండెడిది.కాని క్ర్రీస్తు వెనుక 340 సంవత్సర ప్రాంతమందు గుప్తవంశీయుడు, భారతసామ్రాజ్యాధిపతి అగు సముద్రగుప్తుడు నేపాళ దేశమును తాను జయించిన దేశముల పట్టీలో పేర్కొనెను. ఇదియే అలహాబద్ స్తంభ శాసనమందీ పట్టీకలదు. క్రీస్తు శకం 200 నాటికి బౌద్ధ సామ్రాజ్యాన్ని హిందువులు అంతమొందించి, లిచ్ఛవి వంశ పరిపాలనను ప్రారంభించారు.
 
నేపాళ దేశమున నాగవాసము (Now Called Lake Table Land) అనుపేరుగల గొప్ప సరోవరము నుండెనట, ఇది మిక్కిలి లోతుకలదై అసంఖ్యాకముగ నీటి పక్షులతో మనోహరముగ ఆవృతమై యొప్పుచుండెను. ఈ సరోవరమున కర్కోటకుడగు 'నాగరాజూ పరిపాలించుచుండెను. ఆకాలములో నాగసరోవరము నందు ఒక్క తామరమొక్క అయినా మొలవకుండెడిదట. ఇట్లుండగా అంతకు చాలాకాలము క్రిందట విందుమతీ నగరమునుండి విపస్య బుద్దుడు ఈసరోవరమునకు వచ్చినప్పుడు అతడొక తామర మొక్క మంత్రించి ఈసరోవరమున పారవైచి "ఈతామర పుష్పించిననాడు స్యంభువుడగు బుద్దభగవానుడు జ్యోతివలె భక్తులకు కనపడునని" చెప్పి వెడిలిపోయినాడట. ఈ కారణముచేతనే [[స్యయంభూనాధ్]], [[బోద్ద్ నాధ్]] దేవాలయములందు జ్యోతి ఎల్లప్పుడు వెలుగుచూనే ఉండును. అటుపిమ్మట శిఖిబుద్దుడు నాగవాసమందు నిర్వాణము పొందెను. ఆతరువాత విశ్వభూబుద్దుడు, బోధిసత్వుడు నాగవాసము నందు తప్పస్సు నొనర్చినారు. ఈ బోధిసత్వుడినే కొందరు "మంజుశ్రీ" అని పిలిచెదరు. ఈ మంజుశ్రీ అను నాతడు కొందరు చైనా దేశము వాడని, మరికొందరు ఆంధ్రుడని మరికొందరు చెప్పుచున్నారు.
 
900వ సంవత్సరంలో లిచ్ఛవి వంశాన్ని పారద్రోలి ఠాకూర్లు, వారిని పారద్రోలి మల్లులు పరిపాలనకు వచ్చారు. వాళ్ళే 18వ శతాబ్దం వరకూ పాలించారు. 1768 లో పృథ్వి నారాయణ్ షా అనే గూర్ఖా రాజు ఖాట్మండును ఆక్రమించుకున్నాడు. 1814లో నేపాలు ఇంగ్లీషు వారితో యుద్ధం చేసింది (ది ఆంగ్లో నేపాలీస్ వార్). 1816లో సుగౌలి సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఇంగ్లీషు వారికి [[సిక్కిం]] ను, దక్షిణ భాగాలను ఇచ్చివేయడంతో ఇంగ్లీషు వారు వెనుదిరిగారు. కానీ 1857లో భారత దేశంలోని సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో ఇంగ్లీషు వారికి సహాయపడినందుకు గాను ఇంగ్లీషువారు దక్షిణ ప్రాంతాలను తిరిగి ఇచ్చివేశారు.
పంక్తి 80:
{|
|-
|దదెల్ధురా:||350  mm
|-
|నేపాల్ గన్జ్:||510  mm
|-
|బుట్వల్:||715  mm
|-
|పోఖర:||920  mm
|-
|ముస్తాన్గ్:||60  mm
|-
|ఖాట్మండు:||370  mm
|-
|చైన్పుర్:||320  mm
|-
|నమ్ఛె బజార్:||220  mm
|-
|}
పంక్తి 118:
[[దస్త్రం:Patan temples.jpg|thumb|250px|పతన్‌లో హిందూ ఆలయం]]
ఆధికారికంగా నేపాలు ప్రపంచంలో ఏకైక హిందూ దేశము. కానీ దీర్ఘ కాలంగా అక్కడి చట్టాలు బలవంతపు మత మార్పిడులను, అన్య మత విద్వేషాన్ని అడ్డుకుంటున్నాయి. 2001 లెక్కల ప్రకారం 80.6% మంది హిందువులు, 11% మంది బౌద్ధులు. కాని ఇరు మతాల వాళ్ళూ ఇరు మతాల సాంప్రదాయాలనూ, ఆచారాలనూ, సమానంగా ఆచరిస్తారు. ఇంకా 4.2% మంది ముస్లింలు, 3.6% మంది కిరాంతులనబడే వాళ్ళూ, 0.5% మంది క్రైస్తవులూ ఉన్నారు. వీరి సంఖ్య 2005 కు 6 లక్షలకు పెరిగింది.
 
 
==నేపాల్ లో ముఖ్యమైన పండగలు==
Line 124 ⟶ 123:
1 ముఖ్య పండగలు
 
నేపాలీలకు కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులు చాల పవిత్రమైనవి. ఈ సందర్బంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. ఇవి ఐదు రోజులు పాటు జరుపు కుంటారు. యమలోకాధి పతి ఐన యమధర్మ రాజును పూజించడంతో ఈ పండగలు ప్రారంబప్రారంభ మౌతాయి. ఈ పండగల కొక ఇతిహాసము కలదు. దాని ప్రకారం:
 
పండగ దినాల్లో కూడ భూలోకంలో మానవులు మరణిస్తున్నారనీ, వారి ఆత్మలను తీసుకు రావడానికి తమకు బాదగా వున్నదనీ, దీనికి నివారణోపాయాన్ని చెప్పమని యమధూతలు.... యమ ధర్మ రాజుకు మొర పెట్టుకోగా. యమ ధర్మరాజు ఒక తరుణోపాయం ఆలోచించి వారికి చెప్తాడు. దాని ప్రకారం. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి వుండదనీ శలవిస్తాడు. ఆ విధంగా ఆ అయిదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు.
Line 153 ⟶ 152:
 
== నేపాల్ పర్యటన ==
ప్రపంచంలో అత్యదికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో [[నేపాల్]] ఒకటి. దీనికి కారణాలు అనేకం. అక్కడి ప్రకృతి రమణీయత కావచ్చు., హిందు మతస్తులకు, బౌద్ద మతస్తులకు సంబందించిన అత్యున్నతమైన కేంద్రాలు కావచ్చు., ట్రెక్కింగు, రాప్టింగు వంటి సాహస క్రీడలకి ముఖ్య కేంద్రం కావచ్చు, ముఖ్యంగా అక్కడి ప్రజల స్నేహ పూరిత స్వభావం కావచ్చు. ఆకాశాని తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకం లో వున్నాయా అన్నట్టున లోయలు, నదులు, సెల యేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన ఆద్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, భౌద్దులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఇలా కారణాలేవైనా నేపాల్ దేశం పర్యాటకులకు నయనాందకరం చేసే దేశం. నేపాల్ దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు కూడ పర్యటకమే.
 
== ప్రపంచంలో వున్న ఏకైక హిందు సామ్రాజ్యం ==
Line 166 ⟶ 165:
 
== గ్రామాలు పంట పొలాలు ==
సరిహద్దు నుండి కొంత దూరమె మైదాన ప్రాంతం. అక్కడక్కడ పల్లెలు పంట పొలాలు వుంటాయి. ఇక్కడ వరి ప్రధాన పంట. ఆ వరి చాల ముతక రకం. వ్వవసాయం సాంప్రదాయ పద్దతిలోనె జరుగు తున్నది. కొండ వాలున కొన్ని అడుగుల వెడల్పున చదును చేసి అక్కడే వరి పండిస్తుంటారు. ఆ పొలాలు చూడ్డానికి చాల అందంగా కనబడుతుంటాయి. కొండలకు అందమైన మెట్లు చెక్కారా అని అనిపిస్తుంది. అటు వంటి కొండల పాద భాగన మంచి పారుతున్నా అది కొన్ని వందల అడుగుల లోతులో వున్నందున ఆ నీటిని పొలాలకు పారించ లేరు. కొండల పైనుండి జారు వారె నీటి దారలే ఈ పంటలకు జల వనరులు. ఇటు వంటి నీటి దారలు చిన్నచిన్నవి చాల ఎక్కువ. కొన్ని పెద్ద పెద్ద జల ధారలు వుంటాయి అవి జలపాతాల లాక కనబడుతుంటాయి. ఈ కొండలలో ప్రజలు అన్ని రకాల కూరగాయలు, పండ్లు కూడ పండిస్తుంటారు. పల్లెలు చాల పలుచగా వుంటాయి. ఇళ్లు దూర దూరంగా వుంటాయి. కొన్ని చోట్ల పొలాల మధ్యలోనె ఇళ్లుంటాయి. ప్రతి ఇంటి ముందు బంతి పూల చెట్లుంటాయి. రోడ్లు విశాలంగా వున్నా అక్కడ తిరిగే వాహనాలు చాల పాతవి. జీపుల్లాంటి డొక్కు వాహనాలు, రిక్షాలు మొదలగునవి ప్రయాణ సాధనాలు.
 
== ఘాట్ రోడ్డు ==
Line 173 ⟶ 172:
 
== పోక్రా లో దేవి జలపాతం ==
నేపాల్ లోని ముఖ్యమైన పట్టణాలలో ''పోక్రా'' ఒకటి. ఇది అతి చిన్న పట్టణం. కొండ కోనల్లో కట్టిన ఇళ్లతో అందంగా కనబడు తుంది. ఈ పట్టణానికి ప్రాముఖ్యతను ఆపాదించడానికి మరొక కారణమున్నది. అది పట్టణానికి అల్లంత దూరంలో మంచు తొ కప్పబడిని హిమాలయా పర్వతాలు. వెండి కొండలవలె ప్రకాసిస్తున్న ఆ హిమాలయాలను దగ్గర నుండి చూడ డానికి విమాన ప్రయాణాన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ చిన్న విమానాలలొ హిమాలయాలకు కొంత దగ్గరికి వెళ్లి తిరిగి వస్తాయి. ఈ పట్టణాన్ని '''స్విజ్డర్ లాండు'''తో పోలుస్తారు. దీనికి ఆసియాలోని స్విజ్డర్ ల్యాండు అని అంటారు. హిమాలయాల అందాలను చూడ డానికి మంచి సమయం సూర్యోదయానికి కొంత ముందు దాని తర్వాత కొంత సమయం. ఆ సమయానికి పర్యాటకులు తాము బస చేసిన భవనాల పైకెక్కి హిమాలయాల అందాలను తిలకిస్తుంటారు. సూర్యోదయానికి ఇంకా కొన్ని నిముషాలుందనగా ఆకాశం ఎర్ర బడుతుంది. ఆ కాంతిలో ఆ మంచు కొండలు బంగారు కాంతి తో మెరిసి పోతుంటాయి. ఆ బంగారు కాంతి పొద్దెక్కే కొద్ది రంగు మారి వెండి కొండ వలే వెలుగు లీనుతుంది. ఆదృశ్యం అత్యంత నయానంద కరం. ఈ పట్టణంలో మరొక వింత '''దేవి జలపాతం'''. సాధారణంగా జలపాతాలను క్రింద నుండి పైకి చూసారు. కాని ఈ జలపాతాన్ని పైనుండి క్రిందికి చూడాలి. అంటే కొండ పైకెక్కి చూడాలని కాదు. భూమి పైనుండే విశాలమైన బావిలోనికి చూడాలి. ఆ బావి చుట్టూ ప్రమాద నివారణ కొరకు ఇనుప పట్టీలతో కంచె ఏర్పాటు చేశారు. దాని అంచున నిలబడి బావి లోనికి చూడాలి. లోపల బావి [[దరి]] లోనుండి అతి పెద్ద జల ప్రవాహం వచ్చి చాల లోతున్న బావిలోనికి పడుతుంది. ఆ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. పర్యాటకులు నిలబడిన భూమి క్రింద సుమారు ఇరవై అడుగుల లోతోలొనుండి వచ్చి బావిలోనికి పడుతుంది. ఈ జలంతో ఆ బావి నిండి పోదు. ఆ వచ్చిన నీరు ఎలా వచ్చాయో అదేవిదంగా భూమి లోపలికి వెళ్లి పోతాయి. అవి ఎక్కడ బయట పడతాయో. ఈ వింత జలపాతం పోక్రా పట్టణం మధ్యలోనె వున్నది. పోక్రా కు దిగువన కొంత మైదాన ప్రాంతమున్నది. అక్కడ వరి పంట పొలాలు ఎక్కువగా వున్నాయి. అల్లంత దూరంలో వున్న మంచు కొండల నుండి మంచు కరిగి వచ్చే నీరె వీరిపంటలకు సాగునీరు. ఆ నీరు అనేక చిన్న చిన్న కాలువగుండా స్వచ్చంగా ప్రవహిస్తుంటుంది.
 
== ఖాట్మండు ==
ఖాట్మండు నగరం కొండల మధ్యన మైదాన ప్రాంతంలో వున్నది. ఇది ఈ దేశంలో అతి పెద్ద పట్టణం మరియు దేశ రాధాని కూడ. ఇక్కడ ఇది పెద్ద పట్టణమైనా భారత దేశంలో పట్టణాలతో పోలిస్తే ఇది చిన్నదె. భహుళ అంతస్తుల భవనాలు, బారీ కట్టడాలు చాల తక్కువ. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి డొక్కువి కూడాను. పాత జీపుల్లాంటి వాహనాలె ఇక్కడి ప్రయాణ సాధనాలు. ఖాట్మండులొ ఒక ఆకర్షన అక్కడి జూద గృహాలు. వీటిని '''కాసినొ''' అంటారు. ఇక్కడ మధ్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడు తారు. ఈ జూదం ఆడడనికే ఇతర దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు. సాధారణ పర్యటకులు కూడ వెళుతుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగు సెంటర్లు కూడ వున్నాయి. కాని అవి ఎక్కువగా భారత్ లాంటి విదేశాల వర్తకులకు చెందినవే. అన్ని దేశాలకు చెందిన వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు. సామాన్యంగా ఇక్కడ తయారైన వస్తువులు అంటు ఏమి వుండవు. అన్ని విదేశాలవే. స్థానికులకాన్నా పర్యటకులే ఈ వస్తువులను కొంటుంటారు. ఇది కూడ అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి ఆదాయ వనరె. ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందు చేత రుద్రాక్షలు ఎక్కువగా, చాల చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటుంటారు. వాటిని పగల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండి నట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయ లుంటుంది.
 
Line 201 ⟶ 199:
[[దస్త్రం:In the kings palace in bhaktapur at Nepal.JPG|thumb|right|నేపల్ లో భక్తఫూర్ లో ఒక ఆలయం]]
నేపాల్ దేశంలో భక్థాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరం లో చూడ వలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం వున్నాయి. పశుపతి నాద్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడ ఇక్కడ వున్నది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలె. రాజ దర్బారు హాలు చాల గంబీరంగ వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి వున్నది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమె తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్బ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతం లోని కట్టడాలు అతి మనోహరంగా వున్నవి.
 
 
 
ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాల తో అనేక ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడే నేపాల్ దేశం రాజకీయంగా అత్యంత వేడి. వాడి చర్యలు చాల ఎక్కువగా జరుగు తుంటాయి. ఇదే ఈ దేశం ఆర్థికంగా ఎదగక పోవడానికి కారణం.
Line 375 ⟶ 371:
{{సార్క్}}
{{విష్ణు దేవాలయాలు}}
 
[[వర్గం:నేపాల్]]
[[వర్గం:ఆసియా]]
"https://te.wikipedia.org/wiki/నేపాల్" నుండి వెలికితీశారు