బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ (2) using AWB
పంక్తి 35:
| weight =
}}
 
 
'''బూర్గుల రామకృష్ణారావు''' బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. [[హైదరాబాదు]] రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు.
 
== రాజకీయ జీవితం ==
[[1912]]లో వివాహం జరిగింది. ఆమె [[1920]]లో మరణించడంతో, [[1924]]లో మళ్ళీపెళ్ళి చేసుకున్నాడు. [[1923]]లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నాడు. [[ఆంధ్రోద్యమం]], [[గ్రంథాలయోద్యమం]], [[భూదానోద్యమం]] మొదలైన వాటిలో పాల్గొన్నాడు. [[మాడపాటి హనుమంతరావు]], [[సురవరం ప్రతాపరెడ్డి]] మొదలైన వారితో కలిసి పనిచేసాడు. [[కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం]]కు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.
 
హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టి తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. [[1931]]లో [[నల్గొండ]] జిల్లా [[దేవరకొండ]]లో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. [[1948]] లో [[పోలీసు చర్య]] తరువాత [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు]] అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సిసైటి ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 222</ref>
 
[[1952]]లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో [[ముఖ్యమంత్రి]] అయ్యాడు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలోనూ సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.<ref>ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 56</ref> [[1956]]లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు]] అయినపుడు, కొత్త రాష్ట్రానికి [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాడు. బూర్గుల, [[కేరళ]] రాష్ట్రానికి [[గవర్నరు]]గా వెళ్ళాడు. [[1960]] వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత [[1962]] వరకు [[ఉత్తర ప్రదేశ్]] గవర్నరుగా పనిచేసాడు.
 
[[1967]] [[సెప్టెంబర్ 14]]న బూర్గుల మరణించాడు.
Line 69 ⟶ 68:
{{పాలమూరు జిల్లా కవులు}}
{{తెలంగాణ సాహిత్యం}}
 
[[వర్గం:1899 జననాలు]]
[[వర్గం:1967 మరణాలు]]