సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వ్వవసాయ → వ్యవసాయ using AWB
పంక్తి 8:
==పూర్వచరిత్ర==
 
రాష్ట్రంలోని నియోజకవర్గాలలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం వుంది. విభిన్న సంస్తృతుల గుమ్మంగా రాజకీయ చిత్రపటంలో చోటు కలిగి వుంది. తూర్పు, పశ్చిమ కృష్ణాజిల్లాలకు సరిహద్దుగానూ ఖమ్మం జిల్లాకు మొదటి నియోజక వర్గంగా ఏర్పడింది. సత్తుపల్లి ప్రజలకు పక్కజిల్లాల సంస్తృతి, సంప్రదాయాలతో తగినంత సత్సంభందాలను కలిగివుంటుంది. 1952 వరకు వేంసూరు నియోజకవర్గంగా వున్న ఈ ప్రాంతం ఆ తరువాత నైసర్గిక స్వరూపం ప్రాతిపదిక ఆధారంగా సత్తుపలి నియోజకవర్గంగా ఏర్పడింది. భౌగోళికం గానూ, చార్రితకంగానూ, రాజకీయం గానూ మొదటినుంచి ప్రత్యేకతలను చాటుకుంటోంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వరకు నియోజకవర్గ చరిత్ర స్పూర్తిదాయకంగా వుంటుంది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల సమ్మేళనంతో అధికశాతం అటవీ ప్రదేశం కలిగిన నియోజకవర్గంగా వుంది. స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ పోరాటాల్లోనూ కీలకపాత్ర పోషిం చినవారు నియోజక వర్గంలో వుండటం విశేషం. నియోజకవర్గానికి తూర్పున పశ్చిమగోదావరి, ఉత్తరం కృష్ణా, పడమర మధిర నియోజకవర్గం, దక్షిణ కొత్తగూడెం నియోజకవర్గం సరిహద్దులుగా వున్నాయి. పరిశ్రమల స్థాపనకు మెరుగైన అవకాశాలు వున్నాయి. ఓపెన్‌కాస్టు బొగ్గుగనుల తవ్వకాలు ఇప్పటికే ముమ్మరంగా నడుస్తున్నాయి ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా దేశంలో గుర్తింపు పొందిన సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గణనీయమైన అభివృద్ధి చేశారు.
 
==ప్రత్యేకతలు==
నియోజక వర్గంలో లంకాసాగర్‌, పెద్దవాగు ప్రాజెక్టు, బేతుపల్లి ప్రాజెక్టు ప్రధానమైన మేజర్‌ ప్రాజెక్టులు ఇవికూడా దివంగత జలగం వెంగళరావు హయాంలోనే నిర్మించబడినవి. మండలంలో సైన్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఒకటి నిర్మించాలనే ఉద్దేశంతో నిపుణుల బృందం ఒకటి ఇటీవల బెంగు ళూరు నుంచి వచ్చి సర్వేచేశారు. కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. ఆయా కాలువలపై ఎత్తి పోతల పథకాలు నిర్మించడం ద్వారా రైతులకు ఎక్కువగా భూగర్భ జలాలపై అశ్వారావుపేట, దమ్మపేట మండలంలో రైతులు ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి వున్నారు. పారిశ్రామికంగా సత్తుపల్లి మండలంలో జ్యూస్‌ ఫ్యాక్టరీలో ఒకటి, స్టాప్‌డ్రింక్స్‌ బాటిలింగ్‌ యూనిట్‌ ఒకటి పలువురికి ఉపాధి కల్పిస్తున్నాయి. కల్లూరులోని షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు ప్రయోజనకరంగా మారింది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి వద్ద విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్రవేటు రంగంలో పవర్‌ ప్రాజెక్టును నెలకొల్పారు. అశ్వారావుపేట మండలంలో పేపర్‌ మిల్లు, కెమిలాయిడ్స్‌ ఫ్యాక్టరీలు చెప్పుకోదగిన స్థాయిలో పనిచేస్తున్నాయి.
అశ్వారావుపేటలోని వ్వవసాయవ్యవసాయ కళాశాల నియోజకవర్గానికి తలమానికంగా వుంది. ఇటీవల కాలంలో బి.ఇ.డి కళాశాలలు, ఇంజనీరింగ్‌, జూనియర్‌ డిగ్రీ కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ప్రవేటు యాజమాన్యంలో నెలకొల్పడం ద్వారా విద్యాపరంగా ఈ ప్రాంత గణనీయమైన ప్రగతిని సాధించింది.
 
==నియోజకవర్గంలోని మండలాలు==
పంక్తి 194:
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
{{ఖమ్మం జిల్లాకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]