అసోం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up using AWB |
||
పంక్తి 29:
== పేరు పుట్టుపూర్వోత్తరాలు ==
కొందరు '''అస్సాం''' "అసమ" లేదా "అస్సమ" అనే [[సంస్కృతం|సంస్కృత]] పదము యొక్క అపభ్రంశమని భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు ఖచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన [[అహోం]]లకు సంబంధించినదని భావిస్తారు. [[1228]]కి పూర్వము ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడము, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి ఊతానిస్తున్నాయి.
''అసమ'' లేదా ''అస్సమ'' అన్న పదాలు "కామరూప"ను [[భాస్కర వర్మ]] పరిపాలించిన కాలములో వాడబడింది. ఆ కాలములో ప్రస్తుత ఉత్తర అసోం భూమి నుండి విషవాయువులు విరజిమ్ముతూ అనివాసయోగ్యముగా ఉండేది. కొంతమంది కామరూప నేరస్థులు శిక్షను తప్పించుకోవడానికి ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చారని [[చైనా]] యాత్రికుడు [[హ్యుయాన్ త్సాంగ్]] యొక్క యాత్రా రచనల వళ్ల తెలుస్తున్నది. వీరే అసమ లేదా అస్సమ అని పిలవబడ్డారు. హ్యుయాన్ త్సాంగ్ అస్సమ ప్రజలు దాడిచేస్తారనే భయముతో చైనాకు ఈ మార్గము గుండా తిరిగి వెళ్లలేదు. కామరూపి భాషలో, ఈ పదానికి ''వింత మనిషి/పాపి'' తో పాటు ''ఎవ్వరితో పోల్చలేని వ్యక్తి'' అనే అర్ధం కూడా ఉన్నది. అయితే పూర్వపు కామరూపి గ్రంథాలలో ఈ ప్రాంతాన్ని ''అసమ'' లేదా ''అసం'' లేదా ''అసోం'' అని వ్యవహరించనే లేదు. ▼
▲''అసమ'' లేదా ''అస్సమ'' అన్న పదాలు "కామరూప"ను [[భాస్కర వర్మ]] పరిపాలించిన కాలములో వాడబడింది. ఆ కాలములో ప్రస్తుత ఉత్తర అసోం భూమి నుండి విషవాయువులు విరజిమ్ముతూ అనివాసయోగ్యముగా ఉండేది. కొంతమంది కామరూప నేరస్థులు శిక్షను తప్పించుకోవడానికి ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చారని [[చైనా]] యాత్రికుడు [[హ్యుయాన్ త్సాంగ్]] యొక్క యాత్రా రచనల వళ్ల తెలుస్తున్నది. వీరే అసమ లేదా అస్సమ అని పిలవబడ్డారు. హ్యుయాన్ త్సాంగ్ అస్సమ ప్రజలు దాడిచేస్తారనే భయముతో చైనాకు ఈ మార్గము గుండా తిరిగి వెళ్లలేదు. కామరూపి భాషలో, ఈ పదానికి ''వింత మనిషి/పాపి'' తో పాటు ''ఎవ్వరితో పోల్చలేని వ్యక్తి'' అనే అర్ధం కూడా ఉన్నది. అయితే పూర్వపు కామరూపి గ్రంథాలలో ఈ ప్రాంతాన్ని ''అసమ'' లేదా ''అసం'' లేదా ''అసోం'' అని వ్యవహరించనే లేదు.
బ్రిటిషు జనరల్ పై ఏదేని కారణము వల్ల ఈ పేరు ఎన్నుకోలేదు. ఈయన ఆంథెరా అస్సమ అనే ఒక శాస్త్రీయ నామము నుండి ఆంథెరాను వదిలేసి మిగిలిన పేరును తీసుకున్నాడు అంటారు. ఈ పద ప్రయోగము తొలిసారిగా బ్రిటీషు వారు యాండబూ అకార్డ్ తరువాత ఎగువ అస్సాం రాష్ట్రమును సృష్టించినప్పుడు జరిగినది. కాని ఈ వాదన అంత నమ్మదగినదిగా లేదు. ''ఆంథెరా అస్సమ'' అనే ఒక విధమైన పట్టుపురుగు అస్సాం ప్రాంతంలో అంతటా ఉన్నది. కనుక అస్సాం ప్రాంతపు పేరు ఆ పురుగుకు తగిలి ఉండ వచ్చును కాని ఆ పురుగుపేరు ప్రాంతానికి వర్తించకపోవచ్చును.
Line 41 ⟶ 39:
[[దస్త్రం:Rhino side view.jpg|thumb|250px|[[కాజీరంగా]]లో ఖడ్గమృగం]]
అస్సాంలో జీవ సంపద, అడవులు మరియు వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఒకప్పుడు కలప వ్యాపారము జోరుగా సాగేది అయితే భారతదేశ సుప్రీం కోర్టు దీన్ని నిషేదించడముతో అది తగ్గింది. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన [[కాజీరంగా]] జాతీయ వనము. రాష్ట్రములో అత్యధికంగా వెదురు ఉత్పత్తి అవుతుంది. కానీ వెదురు పరిశ్రమ ఇంకా ఆరఁభ దశలోనే ఉన్నది. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు మరియు జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
అతివృష్టి, చెట్ల నరికివేత, మరియు ఇతరత్రా కారణాల వళ్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది. భూకంప బాధిత ప్రాంతములో ఉన్న అస్సాం 1897లో ([[రిక్టర్ స్కేలు]] పై 8.1 గా నమోదైనది), 1950లో (రిక్టర్ స్కేలు పై 8.6 గా నమోదైనది) రెండు అతిపెద్ద భూకంపాకలకు గురైనది.
== చరిత్ర ==
Line 56 ⟶ 52:
మధ్యయుగంలో దీనిపేరు కామరూప, లేదా కమట. అక్కడ రాజ్యమేలిన వంశాలలో వర్మ వంశం ప్రధానమైనది. కనోజ్ను పాలించిన [[హర్షవర్ధనుడు|హర్షవర్ధనుని]] సమకాలీనుడైన భాస్కరవర్మ కాలంలో జువన్జాంగ్ అనే చైనా యాత్రికుడు కామరూప ప్రాంతాన్ని సందర్శించాడు. ఇంకా కచారి, చూటియా వంశాలు కూడా రాజ్యమేలాయి. వీరు ఇండో-టిబెటన్ జాతికి చెందిన రాజులు.
తరువాత టాయ్ జాతికి చెందిన అహోమ్ రాజులు 600 సంవత్సరాలు పాలించారు. కోచ్ వంశపు రాజులు అస్సాం పశ్చిమభాగాన్నీ, ఉత్తర బెంగాల్నూ పాలించారు. ఈ రాజ్యం అప్పుడు రెండు భాగాలయ్యింది. పశ్చిమ భాగం మొగల్చక్రవర్తుల సామంతరాజ్యమైంది. తూర్పు భాగం అహోం రాజుల పాలన క్రిందికి వచ్చింది. మొత్తానికి బ్రిటిష్ వారి కాలం వరకూ ఎవరూ అస్సాంను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొనలేక పోయారు.
Line 62 ⟶ 57:
;బ్రిటీషు పాలన
అహోం రాజులలోని అంతర్గత కలహాల కారణంగా అది 1821 నాటికి [[బర్మా]] పాలకుల సామంతరాజ్యంగా మారింది. దానితో బర్మావారికి, బ్రిటిష్ వారికి వైరం మొదలయ్యింది. మొదటి ఆంగ్ల-బర్మా యుద్ధము తరువాత 1826లో యాండబూ ఒడంబడిక ప్రకారం అస్సాం బ్రిటిషు అధీనంలోకి, బెంగాలు ప్రెసిడెన్సీలో భాగంగా, తీసుకోబడింది. 1905-1912 మధ్య అస్సాం ఒక వేరు పరగణా అయ్యింది.
భారత స్వాతంత్ర్యం తరువాత అహోం రాజ్యభాగం, ప్రస్తుత [[అరుణాచల్ ప్రదేశ్]], నాగా పర్వత ప్రాంతం, కచారి రాజ్య ప్రాంతం, లూషాయ్ పర్వత ప్రాంతం, గారో పర్వత ప్రాంతం, జైంతియా పర్వత ప్రాంతం - ఇవన్నీ అస్సాం రాష్ట్రంలో చేర్చ బడ్డాయి. రాజదానిగా [[షిల్లాంగ్]] నగరం ఏర్పడింది. సిల్హెట్ ప్రాంతం వారు పాకిస్తాన్లో చేరారు. [[మణిపూర్]], [[త్రిపుర]] సంస్థానాలు ప్రత్యేక పరగణాలయ్యాయి.
▲భారత స్వాతంత్ర్యం తరువాత అహోం రాజ్యభాగం, ప్రస్తుత [[అరుణాచల్ ప్రదేశ్]], నాగా పర్వత ప్రాంతం, కచారి రాజ్య ప్రాంతం, లూషాయ్ పర్వత ప్రాంతం, గారో పర్వత ప్రాంతం, జైంతియా పర్వత ప్రాంతం - ఇవన్నీ అస్సాం రాష్ట్రంలో చేర్చ బడ్డాయి. రాజదానిగా [[షిల్లాంగ్]] నగరం ఏర్పడింది. సిల్హెట్ ప్రాంతం వారు పాకిస్తాన్లో చేరారు. [[మణిపూర్]], [[త్రిపుర]] సంస్థానాలు ప్రత్యేక పరగణాలయ్యాయి.
== స్వాతంత్ర్యానంతర అస్సాం ==
స్వాతంత్ర్యం తరువాత 1960 - 1970 దశకాలలో అస్సాం రాష్ట్రంలోంచి [[అరుణాచల్ ప్రదేశ్]], [[నాగాలాండ్]], [[మేఘాలయ]], [[మిజోరామ్]] రాష్ట్రాలు వేరుచేయబడ్డాయి. రాజధాని [[దిస్పూర్]] కు మార్చబడింది. పెరుగుతున్న [[గౌహతి]] నగరంలో దిస్పూర్ కలిసిపోతున్నది. [[అస్సామీస్]]ను అధికారిక భాషగా చేయాలని సంకల్పించినపుడ కచార్ జిల్లా వాసులూ, ఇతర [[బెంగాలీ]] భాష మాటలాడేవారూ ప్రతిఘటించారు. ఇది తీవ్రమైన ఉద్యమమైంది.
1980 దశకంలో ఆరు సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమం నడచింది. బయటి ప్రాంతనుండి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చి స్థిరపడినవారిని వెళ్ళగొట్టాలనీ, వారు స్థానికుల జన విస్తరణను మార్చేస్తున్నారనీ అనేది ఈ ఉద్యమంలో ప్రధానాంశం. మొదట శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం క్రమేపీ హింసాత్మకమవసాగింది. కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం తరువాత ఈ ఉద్యమం చల్లబడింది. కాని ఆ ఒప్పందంలో చాలా భాగం ఇప్పటికీ అమలు కాలేదు. ఇది ప్రజలలో అసంతృప్తికి ఒక ముఖ్యకారణం.
1980-90 లలో బోడో తెగల వారు, మరికొన్ని తెగలవారు ప్రత్యేక ప్రతిపత్తి కోసము ఘర్షణలు ప్రారంభించారు. ఇవి క్రమంగా సాయుధ, హింసాత్మక పోరాటాలయ్యాయి. ''యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ United Liberation Front of Asom'' (ULFA) and ''నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ National Democratic Front of Bodoland'' (NDFB) వంటి తీవ్రవాద వర్గాలకూ, భారత సైన్యానికీ మధ్య పోరులు పెచ్చరిల్లాయి. సైన్యం మానవహక్కులను మంటకలుపుతున్నదనీ, విచక్షణా రహితంగా హింసను అమలు చేస్తున్నదనీ ఆరోపణలు బలంగా ఉన్నాయి. వర్గాల మధ్య పోరాటాలలో ఎన్నో మూక హత్యలు జరిగాయి
Line 85 ⟶ 77:
! width="25%" | ముఖ్య పట్టణము
! width="10%" | జనాభా ([[2001]])
! width="10%" | విస్తీర్ణము (కి.మీ.
! width="10%" | జన సాంద్రత (/కి.మీ.
|---- bgcolor=#F4F9FF
|1 || BA || [[బార్పేట]] || [[బార్పేట]] || 1642420 || 3245 || 506
Line 142 ⟶ 134:
== సంస్కృతి ==
[[దస్త్రం:Print2.gif|right|thumb|200px|సంప్రదాయ దుస్తుల్లో సత్రియా నాట్యం చేస్తున్న యువతి]]
ఆదిమవాసుల ఆచారాలు, అందిపుచ్చుకున్న సంప్రదాయాలు కలగలిపి ఉండటం వల్ల మిగిలిన ప్రాంతాలకంటే అస్సామీ సంస్కృతి కాస్త భిన్నమైన, సుసంపన్నమైన సంస్కృతి గా అభివృద్ధి చెందింది.
;గమోసా
Line 159 ⟶ 151:
;అస్సాం టీ
[[దస్త్రం:Csinensis.jpg|thumb|200px|ప్రధాన వ్యవసాయమయిన తేయాకు]]
తేయాకు ఉత్పత్తి అస్సాం ఆర్ధిక వ్యవస్థలో ప్రధానమైనది. సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో పండే అస్సాం తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ''[[కామెల్లియా అస్సామికా]]'' Camellia assamica'' అనేది అస్సాము పేరుతో ప్రసిద్ధమైన ఒక తేయాకు రకం. (ఇటువంటి గౌరవం అస్సాంకూ, చైనాకు మాత్రమే దక్కింది ''[[కామెల్లియా సినెసిస్]]''Camellia sinensis అనే పేరుతో ఒక చైనా తేయాకు రకం ఉన్నది.
అస్సాంలో తేయాకు వ్యవసాయం బ్రిటిషువారు వృద్ధి చేశారు. ఆ కాలంలో [[బీహారు]], [[ఒరిస్సా]] ప్రాంతాలనుండి కూలీలుగా వచ్చి చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు.
|