గోరటి వెంకన్న: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సంద్య → సంధ్య using AWB
పంక్తి 36:
}}
 
[['''గోరటి వెంకన్న]]''' ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన [[పాట]]లకు మూలాధారాలు. [[మా టీవీ]] లో ప్రసార మవుతున్న [[రేలా రె రేలా]] కార్యక్రమానికి [[సుద్దాల అశోక్ తేజ]] తో కలిసి న్యాయనిర్ణేత గా వ్యవహరిస్తున్నాడు. 1963 లో [[మహబూబ్ నగర్ జిల్లా]] [[గౌరారం (బిజినపల్లి)]] లో ఆయన జన్మించాడు.నాన్న పేరు నర్సింహ.అమ్మ ఈరమ్మ.
 
 
 
[[గోరటి వెంకన్న]] ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన [[పాట]]లకు మూలాధారాలు. [[మా టీవీ]] లో ప్రసార మవుతున్న [[రేలా రె రేలా]] కార్యక్రమానికి [[సుద్దాల అశోక్ తేజ]] తో కలిసి న్యాయనిర్ణేత గా వ్యవహరిస్తున్నాడు. 1963 లో [[మహబూబ్ నగర్ జిల్లా]] [[గౌరారం (బిజినపల్లి)]] లో ఆయన జన్మించాడు.నాన్న పేరు నర్సింహ.అమ్మ ఈరమ్మ.
తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు.
చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇవ్వడం జరిగింది. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడగలగటం జరిగింది.<ref>http://www.telugulo.com/view_news.php?id=1905</ref>
Line 49 ⟶ 46:
</poem>
 
అనే పాట ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ వినడం తటస్థించింది. ఆయన ఈపాట రాసింది ఎవరా అని రెండు నెలలపాటు వెతికి పట్టుకున్నాడు. శంకర్ ఆయన్ను సినిమా కోసం పాట రాయమని అడిగితే నిర్లక్ష్యంగా చూశాడు. సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయనీ సినిమాల వల్ల సమాజంలో మార్పు రాదనే అభిప్రాయంతో ఉన్నాడు. చివరకు మిత్రుడు సాహు ఇచ్చిన ట్యూన్ తో '''జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో''' అనే పాటను రాశాడు. అది బాగా హిట్టయింది. అలాగే [[కుబుసం]] సినిమా కోసం ఆయన రాసిన '''పల్లె కన్నీరు పెడుతోంది''' అనే పాట కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
 
రచనలు
Line 60 ⟶ 57:
"పల్లె కన్నీరు పెడుతుందో
కనిపించని కుట్రలో తల్లి బందీయై పోతుందో" అని ఆవేదన చెందుతాడు. పల్లె విద్వంసం గురించి ఇంత విషాద భరితంగా పాడిన మరే కవి మనకు కనించడంటే అతిశయోక్తి కాదేమో! ఈ పాటెంత కీర్తి గడించిందో! ఈ పాటతో కవికెంత ఖ్యాతి దక్కిందో! జగద్విఖ్యాతమే.
ఉన్న దానితో సంతృప్తి చెందడం పల్లె ప్రజలకు, అణగారిన జీవులకు అలవాటే కదా! అందుకే కవి అంత వేదనలోనూ ఆ పల్లెల్లోనే ఉన్న ఏదో సౌందర్యాన్ని అన్వేషించి, చూసి, దానికి ముగ్ధుడై పరవశించిపోతాడు. లేకుంటే- " గాలికి ఊగి ఆటాడుతూ నేలకు తలలొంచి / సెరువు నీళ్ళను ముద్దాడి మురిసే/నల్ల తుమ్మ చెట్లను..." చూసి -"నా పల్లె అందాలు సూసితే కనువిందురో" అని చెప్పగలడా? "సాళ్ళు దున్నిన ఎర్రని దుక్కిల సంద్యసంధ్య పొద్దు వాలి వొదిగినప్పుడు" సెలుక ఎంత అందంగా ఉంటుందో చూపగలడా?
నేటి జనం నాగరికులైపోతున్నారు. అక్రమాల వక్రమార్గాలను అన్వేషిస్తున్నారు . కాని ఈ లోకం పోకడ తెలియని వారు ఇంకా పల్లెల్లో అక్కడక్కడ మిగిలే ఉన్నారు. అలాంటి వారిలో గోరటి సృష్టించిన 'యలమంద' ఒకడు. వాడికి "లోకం ఎటుపోతున్నా", గొర్ల మందే వాడి లోకం. అందుకే వాడు "తోడున్న గోర్లు" " యాడాదికోసారి లారెక్కుతుంటె" యాడికోతున్నాయని తల్లినడుగుతాడు, తండ్రినడుగుతాడు" "కన్నీళ్ళు రాల్చుతాడు" అని కరుణ రసాత్మక దృశ్యాన్ని మనకు చూపి మన చేతా కన్నీళ్ళు తెప్పిస్తాడు కవి.
'పాట పాడేటి పిల్లలు' పాటతో కవి ఒక్కసారిగా మనల్ని బాల్యంలోకి లాక్కెల్తాడు. వయసు పెరిగే కొద్ది మనుషులకు జ్ఞానం పెరగడం ఏమో! కాని, స్వార్థం పెరగటం మాత్రం ఖాయం. ఏ స్వార్థం ఎరుగని ఆ బాల్యమెంత మధురమో! అన్పిస్తుంది - ఈ పాట చదివినప్పుడు.
Line 86 ⟶ 83:
File:Telugu Wikipedia Workshop in Kavi Yakoob Home 16.jpg|పాట పాడుతున్న గోరటి వెంకన్న
</gallery>
 
 
==మూలాలు==
Line 94 ⟶ 90:
* [http://etelangana.org/Goreti_Venkanna_Bio.asp గోరటి వెంకన్న జీవిత విశేషాలు]
{{పాలమూరు జిల్లా కవులు}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు]]
"https://te.wikipedia.org/wiki/గోరటి_వెంకన్న" నుండి వెలికితీశారు