స్త్రీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: మహలక్ష్మి → మహాలక్ష్మి using AWB
పంక్తి 3:
[[దస్త్రం:Truth.jpg|160px|right|thumb|''Truth'', 1870 by [[Jules Joseph Lefebvre]]]]
 
'''స్త్రీ''' లేదా '''మహిళ''' ([[ఆంగ్లం]] Woman) అనగా ఆడ [[మనిషి]]. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్తవయసు వచ్చేంతవరకు ఆడపిల్లలను [[బాలికలు]] అనడం సాంప్రదాయం. [[మహిళా హక్కులు]] (Woman Rights) మొదలైన కొన్ని సందర్భాలలో దీనిని వయస్సుతో సంబంధం లేకుండా వాడతారు.
 
== జీవశాస్త్రంలో స్త్రీ ==
పంక్తి 12:
జీవశాస్త్రం ప్రకారం, స్త్రీ జననేంద్రియాలు ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగపడతాయి. [[అండాశయాలు]] హార్మోనులను తయారు చేయడమే కాకుండా అండం విడుదల కు మూలం. ఫలదీకరణంలో భాగంగా అండం, పురుష శుక్ర కణాలతో సంయోగం చెంది, [[పిండం]]గా మారడానికి [[గర్భం]] చేరి, తద్వారా కొత్త తరం జీవులను తయారుచేస్తాయి. [[గర్భాశయం]] పెరుగుతున్న పిండాన్ని రక్షించి కొంత పెరుగుదల వచ్చిన తర్వాత కండరాల సహాయంతో బయటకు పంపిస్తుంది. [[యోని]] పురుష సంయోగానికి మరియు [[పిండం]] జన్మించడానికి తోడ్పడుతుంది. [[వక్షోజాలు]] వంటి ద్వితీయ స్త్రీలింగ లక్షణాలు పిల్లల పోషణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చర్మ గ్రంధుల నుండి అభివృద్ధిచెందిన పాల గ్రంధులు [[క్షీరదాలు|క్షీరదాల]] ముఖ్యమైన లక్షణము. ఎక్కువమంది స్త్రీల [[కారియోటైపు]] 46,XX, అదే పురుషుల కారియోటైపు 46,XY. ఇందువలన [[X క్రోమోసోము]] మరియు [[Y క్రోమోసోము]]లను క్రమంగా స్త్రీ, పురుష క్రోమోసోములు అంటారు.
[[దస్త్రం:Sky spectral karyotype.png|right|thumb|మానవ స్త్రీల [[కారియోటైపు]].]]
 
 
అయితే [[కొజ్జా]]లలో (Intersex) ఈ విధమైన జీవ లక్షణాలు మాత్రమే సరిపోవు. జన్యు నిర్మాణం, జననేంద్రియ నిర్మాణాలతో సహా వారి సాంఘిక, వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
Line 21 ⟶ 20:
 
మూడేండ్ల బాలికను త్య్రబ్ద అని అందురు. యువతికి ఎలనాగ, కాహళి, కొమరు, చామచిరంటి, జవరాలు, జవ్వని, తరుణి, ధని, పడుచు అనీ; వృద్ధురాలుకు జరతి, ఏలిక్ని, మందాకిని, ముదుసలి, ముద్ది, వృద్ధ, అవ్వ వంటి పదాలున్నాయి. ఒక బిడ్డను మాత్రమే కన్న స్త్రీని కదళీవంధ్య అనీ; ఇద్దరు బిడ్డలు మాత్రమే కన్న స్త్రీని కాకవంధ్య అనీ ఒకప్పుడు అనేవారు.
దూషిత, హత అంటే కన్యాత్వము చెడినది అనీ; భర్త, పిల్లలు గతించిన స్త్రీని నిర్వీర అనీ; మారుమనువాడిన స్త్రీని పునర్భువు అనీ; పిల్లలు కలగని స్త్రీని గొడ్రాలు, అప్రజాత, అశశ్వి, గొడ్డురాలు, బందకి, వంజ, వంధ్య, వృషలి, శూన్య అనీ; గర్భవతియైన స్త్రీని అంతరాపత్య, అంతర్గర్భ, ఉదరిణి, గర్భిణి, చూలాలు, దౌహృదిని, నిండు మనిషి, భ్రూణ, సనత్త్వ, సూష్యతి, వ్రేకటిమనిషి అని పేర్కొనడం వుంది. అలాగే బాలెంతరాలు అయిన స్త్రీని జాతాపత్య, నవప్రసూత, పురుటాలు, పురుటియాలు, ప్రజాత, ప్రసూత, ప్రసూతిక, బాలెంత, బిడ్డతల్లి, సూతక, సూతి అని పేర్కొంటారు. ఇలా స్త్రీకి వివిధ దశల్లో కూడా పేర్కొనబడే అర్థసూచక పదాలు అనేకం వున్నాయి. ఆత్రేయి, ఉదక్య, ఏకవస్త్ర, త్రిరాత్ర, నెలబాల,స్త్రీ ధర్మిణి అంటూ ఋతుమతి అయిన స్త్రీకి పర్యాయపదాలున్నాయి.
 
== సమాజంలో స్త్రీల పాత్ర ==
Line 31 ⟶ 30:
 
== తగ్గుతున్న స్త్రీల జనాభా ==
మాతృస్వామ్యంలో అవతరించి పితృస్వామ్య వ్యవస్థకు మారింది దేశీయ సంస్కృతి. మహిళల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పురుషాధిక్యత పెరుగుతోంది. గతంలో ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుడితే మహలక్ష్మిమహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయేవారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటి భావిస్తున్నారు. ఆడపిల్లలైతే చదువులు, కట్నాలు ఇచ్చి వివాహం చేయాలని అనంతరం ఏ సమస్య తలెత్తినా తామే పరిష్కరించాల్సి వస్తుందని తల్లిదండ్రులు భావించడంతో ఆడపిల్లల పై ప్రేమానురాగాలు తగ్గాయి. ఇదే తరుణంలో మగపిల్లల పై మోజు పెరిగింది. విద్యాబుద్దులు నేర్పిస్తే ఉద్యోగం చేసి తమను పోషిస్తాడని అంతేకాక లక్షలాది రూపాయల కట్నం తెస్తాడని, తమను పున్నామ నరకం నుండి రక్షిస్తాడని భావించారు. దీంతో తల్లి గర్బంలోనే పిండం ప్రాణం పోసుకుంటున్న దశలో [[స్కానింగ్‌]]లు తీయించి పాప అయితే [[గర్భవిచ్ఛిన్నం]] చేయించుతున్నారు.
* ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను క లిగి ఉన్న భారత్‌... స్త్రీ, పురుషులను సమానంగా చూసేవిషయం లో మాత్రం అట్టడుగున ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన సూచి వెల్లడించింది. భారత్‌లో ఆడ శిశువుల ను గర్భంలోనే చంపేస్తున్నారని, 2.5 కోట్ల మంది ఆడపిల్లలు భూ మ్మీదకు రాకముందే హత్యకు గు రయ్యారని నోబెల్‌ బహుమతి గ్ర హీత అమర్త్యసేన్‌ వెలిబుచ్చిన ఆందోళనలను ఇది నిర్ధారించింది. 134 దేశాలపై రూపొందించిన ఈ సూచిలో భారత్‌ 114వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌, శ్రీలంక, నే పాల్‌ దేశాలు సైతం ఈ సూచీలో భారత్‌ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.<ref>ఆంధ్రజ్యోతి11.11.2009</ref>
* పురుషులతో పోలిస్తే మహిళలకే వ్యవసాయ భూములు తక్కువగా ఉన్నాయి. చాలాచోట్ల అసలు మహిళలకు వ్యవసాయ భూమి అనేదే లేదు.. తమ పేరుమీద వ్యవసాయ భూములున్నవారు మనదేశంలో మొత్తం 119 లక్షల మంది ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 9.21 శాతంగా మాత్రమే<ref>ఈనాడు 22.2.2010</ref>
"https://te.wikipedia.org/wiki/స్త్రీ" నుండి వెలికితీశారు