పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: గవర్నమెంటు → ప్రభుత్వ using AWB
పంక్తి 22:
 
=చరిత్ర=
ప్రత్తి మొదటగా 7 వేల సంవత్సరాల క్రితం (క్రీ.పూ.5 మరియు 4 వ శతాబ్దాలలో) సాగు చేయబడింది. అలా సాగు చేసిన వారు భారత ఉపఖండములో నైరుతి భాగాన, అంటే ఇప్పటి [[పాకిస్థాన్]] లోని తూర్పు భాగాలు, భారతదేశంలోని నైరుతి భాగాలలో విలసిల్లిన [[సింధూ నాగరికత]]కు చెందిన వాళ్ళు. అప్పట్లోనే వాళ్ళు ప్రత్తిని గుడ్డలుగా నేయటంలో అద్భుతమైన ప్రతిభగల వాళ్ళు. ఆ విధానాలు భారత దేశం పారిశ్రామీకరించటానికి ముందుదాకా కూడా వాడేవాళ్ళు. వాళ్ళ దగ్గరనుండే ఆ విజ్ఞానం క్రీస్తుపూర్వమే [[మధ్యధరా నాగరికత]]కు, ఇంకా ముందుకు వెళ్ళింది.
 
అరబ్బులకిగాని, గ్రీకులకిగాని ప్రత్తి అంటే ఏమిటో [[అలెగ్జాండరు]] భారతదేశం మీద దండెత్తేదాకా కూడా తెలియదు. అలెగ్జాండరు సమకాలీనుడైన [[మెగస్తనీసు]], [[ సెల్యూకస్]] కు [[భారత దేశం]]లో చెట్లపై ఉన్ని పెరుగుతుంది అని చెప్పినట్లు తన [[ఇండికా]] గ్రంధంలో వ్రాసుకున్నాడు.
 
[[బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా]] 6వ ప్రకరణ ప్రకారం,
"ప్రత్తిని చరిత్ర ముందుకాలం నుండి [[భారత దేశం]]లో వడికే వారు, నేసేవారు, రంగులు అద్దేవారు. ప్రత్తి [[చైనా]], [[ఈజిప్టు]], భారత దేశాలలోని ప్రజలకు దుస్తులు అందించింది. క్రీస్తుపూర్వానికి కొన్ని వందల ఏళ్ళ ముందే భారతీయులకి ప్రత్తి నుంచి దుస్తులు నేయటంలో అసమానమైన ప్రతిభ ఉండేది. అది వారి నుంచి మధ్యధరా నాగరికతకు వెళ్ళింది. 1వ శతాబ్దంలో అరబ్బు వ్యాపారులు నాణ్యమైన [[మస్లిన్]], [[కాలికొ]] వస్త్రాలని [[స్పెయిన్]] తీసుకు వెళ్ళారు. 9వ శతాబ్దంలో మూర్లు అనబడే అరబ్బు నీగ్రోలు ప్రత్తి సాగు [[స్పెయిన్]] దేశస్థులకి నేర్పారు. ఫస్తియన్ అనే మందపాటి గుడ్డని నేయటం 14వ శతాబ్దంలో ఇటలీ వారికి తెలిసింది. నారతో కలిసిన అట్లాంటి గుడ్డని [[వెనిస్]], [[మిలాన్]] నగరాలలో నేసేవారు.
 
15వ శతాబ్దం పూర్వం అతి కొద్ది నూలు గుడ్డ మాత్రం [[ఇంగ్లాండు]] వెళ్ళేది. అదికూడా కొవ్వొత్తుల వత్తిగా వాడటం కోసం తెప్పించుకునేవారు. కానీ 17వ శతాబ్దానికి [[ఈస్టిండియా కంపెనీ]] భారత దేశం నుంచి అరుదైన నూలు వస్త్రాల్ని ఇంగ్లాండు తేవటం మొదలుపెట్టింది. అమెరికా ఆదివాసులుకి ప్రత్తి వడికి వాటితో దుస్తులు నేయటం, అద్దకం పని చేయటంలో ఎంతో నైపుణ్యం ఉండేది. [[పెరూ]] దేశంలోని సమాధులలో దొరికిన నూలు వస్త్రాలు 'ఇంకా నాగరికత'కన్నా ముందువని తేలింది. అక్కడ దొరికిన పెరూ, [[మెక్సికో]] వస్త్రాలు రంగులలోగానీ, పనితనంలోగానీ, [[ఈజిప్టు]] సమాధులలో దొరికిన వస్త్రాలలాగా ఉన్నాయి".
 
పౌష్ఠికాహార సర్వస్వం ప్రకారం అమెరికా ఖండంలో మెక్సికోలో 8000 సంవత్సరాలకు పూర్వమే ప్రత్తి సాగుచేయబడింది. వాళ్ళు సాగుచేసిన ప్రత్తి రకం పేరు గాస్సిపియమ్ హిర్సూటం. ఈ రకాన్నే ప్రస్తుతం ప్రపంచమంతా సాగు చేస్తోంది. దాదాపు 90 శాతం సాగులోఉన్న ప్రత్తి ఈ రకమే. కానీ అడవి ప్రత్తి రకాలు చూడాలంటే ఎక్కువ రకాలు మెక్సికోలో, తరువాత [[ఆస్ట్రేలియా]], [[ఆఫ్రికా]]లో చూడవచ్చు. [[ఇరాన్]] లోని ప్రత్తి చరిత్ర చూడాలంటే, క్రీ.పూ.5వ శతాబ్దం అఖాయమెనిద్ శకానికి వెళ్ళాలి. అయినా ప్రత్తి సాగు గురించి గట్టి ఆధారాలు లేవు. ఇరాన్ లోని మెర్వ్,రే, పార్స్ ప్రాంతాల్లో ప్రత్తి పండించేవారని తెలుస్తోంది. పర్షియా కవుల గ్రంధాలలో ప్రత్తి ని గురించి ఎన్నో ద్రుష్టాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు [[ఫిరదౌసి]] [[షానామా]]. 13వ శతాబ్దానికి చెందిన [[మార్కోపోలో]] అనే [[స్పెయిన్]] యాత్రికుడు పర్షియా యొక్క గొప్ప ఉత్పత్తులను గురించి వ్రాసుకున్నాడు. వాటిల్లో ప్రత్తిని గురించి కూడా ఉంది. 17వ శతాబ్దంలో పర్షియాని సందర్శించిన జాన్ ఖార్డిన్ అనే ఫ్రెంచి యాత్రికుడు కూడా పర్షియా లోని విస్తారమైన ప్రత్తి పండించే క్షేత్రాల గురించి వ్రాసుకున్నాడు. ప్రత్తి
 
[[వర్గం:పంటలు]]
[[వర్గం:మాల్వేసి]]
 
పెరూ దేశంలో కోస్తా నాగరికతలైన నార్టె చికో, మోచె, నాజ్క వంటివి అభివృద్ధి చెందటానికి, ప్రత్తి సాగు వెన్నెముక లాగా నిలిచింది. వారు దేశీయమైన గాసిపియమ్ బార్బడెన్సె అనే ప్రత్తి రకాన్ని సాగు చేసేవారు. ప్రత్తిని నది మొదటి భాగంలో పండించి, వలలు అల్లి, ఆ వలల్ని,తీరప్రాంతం వెంబడి గల మత్శ్యకార పల్లెలతో వారికి కావలసిన చేపల కోసం మార్పిడి చేసుకునేవారు. 15వ శతాబ్దం మొదట్లో మెక్సికో వచ్చిన స్పెయిన్ దేశస్థులు, అక్కడి ప్రజలు ప్రత్తి పండించడం, వాటితో నేసిన నూలు దుస్తులు ధరించటం కనుగొన్నారు.
[[Image:Vegetable lamb (Lee, 1887).jpg|thumb|left|టార్టారీ యొక్క గొర్రె మొక్క ]]
మధ్యయుగాల్లో ఉత్తర యూరోపులో పత్తిని ఒక దిగుమతి చేసుకున్న మొక్కల పీచు లాగా చూశారేకానీ అది ఏమిటి, ఎట్లా వచ్చింది, అనే విషయాలని గురించి కనీస జ్ఞానం కూడాలేదు.పైగా నూలు చెట్లకి పెరిగే గొర్రెల బొచ్చు అనే మూఢ నమ్మకం ఉండేది. 1350వ సంవత్సరంలో జాన్ మాండవిల్లె అనే రచయిత ఈ విధంగా వ్రాసుకున్నాడు. భారత దేశంలోఒక అద్భుతమైన చెట్టు ఉంటుందని, దానికి కొమ్మల చివర చిన్న గొర్రె పిల్లలు కాస్తాయని, ఆ గొర్రె పిల్లలకి ఆకలి వేస్తే ఆ కొమ్మలు బాగా కిందకి వంగి గొర్రె పిల్లలు గడ్డి తినడానికి వీలు కల్పిస్తాయని అనుకునేవారు. ఈ విషయం ఎంత నిజమంటే, యూరోపు దేశాల్లో ప్రత్తిని పిలిచే పేర్లలో చూడచ్చు. జెర్మను భాషలో ప్రత్తిని బౌమ్ వూల్ అంటారు. అంటే, చెట్లకి కాసే బొచ్చు అని అర్ధం. 16వ శతాబ్దం చివరకి కానీ ఆసియా, అమెరికాలలోని ఉష్ణ మండలాల్లో ప్రత్తి విస్తారంగా పండించడం మొదలు కాలేదు.
 
Line 46 ⟶ 43:
1840కి భారత దేశం ప్రపంచానికంతా కావలసిన దుస్తులు నేసే బ్రిటీషు మరమగ్గాలకి కావలసిన ప్రత్తిని ఉత్పత్తి చెయ్యలేకపోతోంది. అతి తక్కువ ధరలో దొరికే భారత ప్రత్తిని, ఓడల్లో బ్రిటన్ కి తీసుకువెళ్ళడం, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, పైగా ఆలస్యమవుతోంది. ఇంతలో అమెరికాలొ పండే ప్రత్తి, ఇంతకన్నా బావున్నదని తెలిసింది. (పొడుగు పింజ, గట్టిదనం ఎక్కువ. అవి అమెరికా దేశవాళీ విత్తనాలైన, గాస్సిపియమ్ హిర్సూటం, గాస్సిపియమ్ బార్బడెన్సె). దాంతో బ్రిటీషు వర్తకులు, అమెరికాలో, కరేబియన్ దీవుల్లో ప్రత్తి క్షేత్రాల్ని కొనుగోలు చెయ్యడం మొదలుపెట్టారు. అక్కడ ఇంకా చవక, ఎందుకంటే పనివాళ్ళంతా [[బానిస]]లు. 19వ శతాబ్దం మధ్యకల్లా, కింగ్ కాటన్ అనేది దక్షిణ అమెరికా ఆర్ధికావసరాలకి వెన్నెముక అయ్యింది. యునైటెడ్ స్టేట్స్ లో బానిసల ముఖ్యమైన పని, ప్రత్తి పండించడమే.
 
అమెరికా అంతర్యుద్ధం సమయంలొ అమెరికా ప్రత్తి ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. దానికి కారణాలు ఒకటి, యూనియన్ ప్రభుత్వం, దక్షిణాది రేవులపై నిషెధం విధించటం, రెండు, కాన్ఫెడరేషన్ ప్రభుత్వం బ్రిటీషు ప్రభుత్వాన్ని తమ కాన్ఫెడరేషన్ ని ఒప్పుకునేలా, లేదా యద్ధానికన్నా వచ్చేలా చెయ్యడం కోసం, తమ ప్రత్తి ఎగుమతులు ఆపెయ్యడం. ఈ పరిణామాలు, ముఖ్య ప్రత్తి కొనుగోలుదారులైన బ్రిటన్, ఫ్రాన్స్ లను ఈజిప్టు ప్రత్తి వైపు మొగ్గేలా చేశాయి. బ్రిటీషు, ఫ్రెంచి వర్తకులు ఈజిప్టులోని ప్రత్తి క్షేత్రాలపై భారీగా పెట్టుబడులు పెట్టారు. అవికాక, ఈజిప్టు గవర్నమెంటుప్రభుత్వ వైస్రాయి అయిన ఇస్మాయిల్, యూరోపు బాంకర్ల నుండి, వ్యాపార వర్గాలనుండి, భారీగా అప్పులు చేశాడు. 1865 లోఅమెరికా అంతర్యుద్ధం ముగిసే సరికి, ఈజిప్టు ప్రత్తిని వదిలేసి బ్రిటీషు, ఫ్రెంచి వర్తకులు మళ్ళీ చవకైన అమెరికా ప్రత్తి వైపు మళ్ళారు. దాంతో ఈజిప్టు ఆర్ధిక స్థితి దెబ్బతిని, 1876లో దివాలా ప్రకటించింది. అదే అదునుగా తీసుకుని, బ్రిటీషు సామ్రాజ్యం 1882లో ఈజిప్టుని ఆక్రమించుకుంది.
అమెరికా అంతర్యుద్ధ సమయంలో, అక్కడ తగ్గిన ఉత్పత్తిని పూడ్చుకోవటానికి, బ్రిటీషు సామ్రాజ్యంలో ముఖ్యంగా భారత దేశంలో ప్రత్తి సాగు గణనీయంగా పెంచబడింది. అనేక నిషిద్ధాలు, [[పన్నులు]] వేసి, ప్రభుత్వం ముడి ప్రత్తి ఉత్పత్తిని ప్రోత్సహించింది కానీ నూలు వస్త్రాలని తయారుచెయ్యటం మాన్పించింది.
 
Line 65 ⟶ 62:
 
=సాగుబడి=
ప్రత్తి యొక్క సాగుబడి బాగా సాగాలంటే కావలిసినంత సూర్యరశ్మి, తక్కువ ఛలికాలం, మధ్యతరహా వర్షపాతం ఉండాలి. ఉదా: 600 నుండి 1200 మి.మీ. (24 నుండి 48 అంగుళాలు). భూమి బరువుపాటిదై ఉండాలి. నేలలో ఖనిజాలు మధ్యస్థంగా ఉంటే చాలు. సాధారణంగా ఈ అంశాలన్నీ ఉత్తర, దక్షిణ ధ్రువాల్లోని ఉష్ణ,సమసీతోష్ణ మండలాల్లో సరిగ్గా ఉంటాయి. కానీ ఈనాడు ఎక్కువ భాగం సాగు తక్కువ వర్షపాతం గల, నీటిపారుదల మీద ఆధారపడ్డ ప్రాంతాల్లో జరుగుతోంది.
 
ప్రత్తి ఉత్పత్తి వసంతం వెళ్ళంగానే మొదలవుతుంది. విత్తే సమయం సాధారణంగా ప్రాంతాలని బట్టి మారుతుంది. ఫిబ్రవరి నుంచి జూను దాకా ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని దక్షిణ పీఠభూమి అనేది ప్రపంచంలొ అతి విస్తారమైన ప్రత్తి పండే ప్రాంతం. నీటిఎద్దడి ప్రత్తి సాగు ఇక్కడ సాధారణంగా చేస్తారు. ఉత్పత్తి పక్కన ఉన్న ఒగల్లాలా గుట్టల నుంచి వచ్చే నీటిపై అధారపది ఉంటుంది.
Line 77 ⟶ 74:
[[ఆస్ట్రేలియా]] లో బి.టి. ప్రత్తి ప్రవేశపెట్టినప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. 85 శాతం పురుగుమందుల వాడకం తగ్గింది. మిగతా దేశవాళీ రకాలలాగానే దిగుబడి వచ్చింది. రెండవ రకం బి.టి. విత్తనం విడుదల చెయ్యంగానే జి.ఎమ్. ప్రత్తి సాగు అమాంతం పెరిగి, ఇప్పుడు ఉత్పత్తి 90 శాతానికి చేరింది.
 
ప్రత్తిని [[గ్లైఫోసైట్]] అనే [[కలుపునివారిణి]] ని కూడా తట్టుకునేలాగా కూడా రూపొందించారు. [[గ్లైఫోసైట్]] అనేది తక్కువ ఖరీదుకల ఒక [[ కలుపునివారిణి]]. మొదట్లో మొక్క చిన్నగా ఉన్నప్పుడే నిరోధకశక్తిని పెంపొందించటం కుదిరేది. కాని ఇప్పుడు మొక్క పెద్దదైన తరువాత కూడా సాధించగలుగుతున్నారు.
 
భారతదేశంలో కూడా బి.టి. ప్రత్తి సాగు విస్తీర్ణం త్వరితగతిన పెరుగుతోంది. 2002 లో 50,000 హెక్టార్లు ఉండగా 2006కి 38 లక్షల హెక్టార్లు అయ్యింది. మొత్తం ప్రత్తి సాగు విస్తీర్ణం భారతదేశంలో 90లక్షల హెక్టార్లు (ప్రపంచ విస్తీర్ణంలో 25 శాతం. ప్రపంచంలో అతి విస్తీర్ణమైనది). ఇప్పుడు బి.టి. ప్రత్తి విస్తీర్ణం 42 శాతం అయ్యింది. అంటే ఛైనా ని వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద బి.టి. ప్రత్తి సాగు విస్తీర్ణం కల దేశం అయ్యింది. కారణం, పెరిగిన ఆదాయం, కాయ తొలుచు పురుగుని బి.టి. ప్రత్తి సమర్థంవంతంగా ఎదుర్కొనడం, పురుగు మందుల ఖర్చు గణనీయంగా తగ్గడం. ప్రత్తి ఆకులలో [[గాస్సిపోల్]]అనే విషరసాయనం ఉంటుంది. దాని వల్ల అది పశువుల మేతగా పనికిరాదు. శాస్త్రజ్ఞులు ఆ విషాన్ని ఉత్పత్తి చేసే జన్యువుని పనిచేయకుండా చేసి దాన్ని పశువుల మేతగా ఉపయోగపడేలా చెయ్యడంలో విజయం పొందారు.
Line 93 ⟶ 90:
 
=కృత్రిమ నూలు నుండి పోటీ=
1890లో ఫ్రాన్స్ లో రెయాన్ తయారీతో కృత్రిమంగా తయారుచేయబడే నూలు చరిత్ర మొదలయ్యింది. [[రెయాన్]] అనేది పూర్తిగా కృత్రిమం కాదు, కానీ దాని తయారీలొ ఉన్న ఇతర కష్టాలు అంతకంటే చవకైన కృత్రిమ నూలు తయారీకి బీజం వేశాయి. తరువాతి దశాబ్దాలలో రకరకాల కృత్రిమ నూలు రసాయన పరిశ్రమలు ఆవిష్కరించాయి. నూలు రూపంలో ఉన్న ఎసిటేట్ ని 1924 లో అభివృద్ధి చేశారు.1936లో కుట్టు దారంగా డ్యూపాంట్ కంపనీ [[నైలాన్]] ని తయారు చేసింది. వాళ్ళే 1944లో ఆక్రిలిక్ ని తయారుచేశారు. ఈ నూలు ఉపయోగించి కొన్ని స్త్రీల దుస్తులు తయారు చేశారు.కాని 1950లో మార్కెట్లోకి పాలిస్టర్ వచ్చిన తరువాత ప్రత్తి నూలుకి నిజమైన దెబ్బ తగిలింది. పాలిస్టర్ దుస్తుల గిరాకీ ఒక్క సారిగా పెరిగేసరికి ప్రత్తి పంట మీద ఆధారపడిన ఆర్ధికవ్యవస్థలు గల దేశాలకి ఇబ్బంది మొదలయ్యింది. ముఖ్యంగా చవకైన పురుగుమందుల లభ్యతతో 1950 నుంచి 1965 లమధ్య ప్రత్తి ఉత్పత్తిని పదింతలు పెంచుకున్న [[నికరాగువా]] లాంటి మధ్య అమెరికా దేశాలు. ప్రత్తి ఉత్పత్తి 1970ల్లో కొంచెం పుంజుకున్నా, 1990లో మళ్ళీ 1960 కన్నా ముందు స్థాయికి పడిపోయింది. 1960 మధ్యల్లో క్రమంగా పడిపోతున్న ప్రత్తి స్థాయిని చూసి అమెరికా ప్రత్తి రైతులు స్వయం సహాయక విధానాలని మొదలుపెట్టారు. ప్రతి బేలుకి ఇంత అనే విధానానికి, అందరూ మొగ్గుచూపారు. అందుకు కారణాలు ఒకటి నిధులు సేకరించటానికి, రెండు తమకు నష్టం రాకుండా ఉండటానికి. 1996 లో ప్రత్తి పరిశోధన, ప్రోత్సాహం అనే చట్టం వచ్చిన తరువాత ప్రత్తికి కృత్రిమ నూలు పోటీదారులతో పోటీపడటానికి, తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవటానికి ఎంతొ ప్రోత్సాహాన్నిచ్చింది. ఈ విధానం యొక్క ప్రగతి, అమెరికాలో ప్రత్తి నూలు అద్భుతమైన అమ్మకాలు సాధించటానికి, ప్రపంచంలో తన స్థానం తిరిగి నిలబెట్టుకోవటానికి ఉపయోగపడింది.
 
ప్రత్తి బోర్డు ద్వారా, ప్రత్తి ఇంకార్పొరేటేడ్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రత్తి పరిశోధన మరియు ప్రొత్సాహము అనే సంస్థ ప్రత్తి పండించే రైతుల ప్రయోజనాలకై అహర్నిశలూ శ్రమిస్తుంది. ప్రత్తి రైతులు, దిగుమతిదారులు ఈ సంస్థకు నిధులు సమకూరుస్తున్నారు.
Line 100 ⟶ 97:
ప్రత్తిని [[వస్త్ర పరిశ్రమ]]లో అనేకమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా టెర్రిక్లాత్, అంటే బాగా నీళ్ళు పీల్చుకునే తుండుగుడ్డలు, దుస్తులు తయారుచేస్తారు. నీలం జీన్సు తయారీకి కావల్సిన డెనిమ్ గుడ్డని తయారుచేస్తారు. పనివాళ్ళువాడే నీలంరంగు గుడ్డలు, కార్డ్యురాయ్, ట్విల్ అనే మందపాటి గుడ్డలు, సీర్ సకర్ అనే పలుచని బల్ల గుడ్డలు కూడా చేస్తారు. సాక్సులు, లోదుస్తులు, చాలా రకాల టి-షర్టులు, దుప్పట్లు ప్రత్తి నూలు తోనే చేస్తారు. అల్లికలలో ఉపయోగించే ప్రత్యేకమైన నూలు ప్రత్తి తోనే తయారవుతుంది. వస్త్రపరిశ్రమలో మిగిలిన నూలుతోకూడా గుడ్డలు నేయవచ్చు. పూర్తి నూలుతోనే కాకుండా నూలుని ఇతర పాలిస్టర్తో కాని, రెయాన్తోకాని కలిపికూడా గుడ్డలు తయారు చెయ్యొచ్చు. రబ్బరు దారాలతో కలిపి, అల్లే గుడ్డలకి కావలసిన నూలు చెయ్యచ్చు. వాటితో సాగే జీన్స్ తయారు చేస్తారు. వస్త్ర పరిశ్రమే కాకుండా ప్రత్తిని చేపల వలలు, కాఫీ వడకట్టే గుడ్డలు, గుడారాలు, తుపాకిమందు, గుడ్డకాగితం మరియు పుస్తకాల బైడింగులలో వాడతారు.
 
ప్రత్తిని ఉపయోగించిన తరువాత మిగిలే [[ప్రత్తి గింజ]]లని [[పత్తిగింజల నూనె]] తీయడానికి వాడతారు. శుద్ధి చేసిన తరువాత ఆ నూనెని మనుషులు మామూలు ఇతర నూనెలలాగా వాడుకోవచ్చు. మిగిలిన పిప్పిని పశువులకి దాణాగా ఉపయోగించవచ్చు. కాని అందులో ఉండే [[గాసిపోల్]] అనే విష పదార్థం కొన్ని పశువులకు హానికారి. ప్రత్తి గింజల పొట్టు పశువుల దాణాలో కలుపుతారు. అమెరికాలో బానిసత్వం అమలులో ఉన్నప్పుడు ప్రత్తి వేళ్ళ మీద ఉండే పొట్టు గర్భస్రావాలకై వాడేవారు.
 
ప్రత్తిని గింజలనుండి వేరుచేసిన తరువాత ఆ గింజలకి మెత్తని నూగు ఉంటుంది. ఇంచుమించు 3మి.మి. పొడవు ఉంటుంది. ఆ నూగుని, కాగితం తయారుచేయడానికి,సెల్లులోజ్ ని చేయడానికి వాడతారు.ఈ నూగుని ప్రత్తి ఉన్ని అంటారు. ఈ నూగుని శుద్ధి చేసి వైద్య రంగంలో, సౌందర్య సాధనాలలో, ఇంకా ఇతరత్రా వాడతారు. ఈ ప్రత్తి ఉన్నిని, మొదట వైద్య రంగంలో వాడింది, '''డా.జోసఫ్ శాంసన్ గామీ'''. ఆయన ఇంగ్లాండు, బర్మింగ్ హామ్ లోని క్వీన్స్ ఆసుపత్రిలో మొదట వాడారు.
Line 109 ⟶ 106:
 
ఈనాడు ప్రపంచంలో పత్తి యొక్క అతిపెద్ద ఉత్పత్తి దారులు మొదట [[చైనా]] మరియు [[భారత్]]. వీరి సాలుసరి ఉత్పత్తి రమారమి 34 లక్షల బేళ్ళు, 24 లక్షల బేళ్ళు వరుసగా. ఈ ఉత్పత్తి అయిన ప్రత్తి అంతా స్వదేశాల్లోని నూలు మిల్లులే వాడుకుంటాయి. అతిపెద్ద ఎగుమతిదారులు మొదట అమెరికా (4.9 బిలియన్ డాలర్లు), ఆఫ్రికా (2.1 బిలియన్ డాలర్లు).
 
 
మొత్తం ప్రపంచ సాలుసరి వాణిజ్యం సుమారు 12 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఆఫ్రికా వాటా 1980 తరువాత రెట్టింపు అయ్యింది. ఎందుకంటే వారికి దేశీయ వస్త్ర పరిశ్రమ లేదు.ఉన్నా అవి తూర్పు,దక్షిణ ఆసియాకి అంటే భారత్, ఛైనా లాంటి అభివృద్ధి చెందుతున్నదేశాలకి వలస పోయాయి.
Line 187 ⟶ 183:
=బ్రిటీషు నూలు కొలమానాలు=
 
1 దారం(థ్రెడ్) = 55 అంగుళాలు (దాదాపు 137 సెం.మీ.)
 
1 స్కీన్ లేదా ర్యాప్ = 80(థ్రెడ్స్) దారాలు (120 గజాలు లేదా రమారమి 109 మీ)
 
1 ఉండ(హాంక్) = 7 స్కీన్లు (840 గజాలు లేదా రమారమి 768 మీ)
 
1 చుట్ట(స్పిండిల్) = 18 ఉండలు(హాంకులు) (15,120 గజాలు లేదా రమారమి 13.826 కి.మీ.)
Line 234 ⟶ 230:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:పంటలు]]
[[వర్గం:మాల్వేసి]]
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు