బ్రహ్మాండ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
పంక్తి 1:
{{హిందూ మతము}}
'''బ్రహ్మాండ పురాణము''' (''Brahmanda Purana'') ఒక [[హిందూధర్మశాస్త్రాలు|హిందూ ధార్మిక గ్రంధముగ్రంథము]]. ఇది ముఖ్యమైన [[అష్టాదశ పురాణములు|పురాణాలలో]] ఒకటి. సంఖ్యాపరంగా దీనిని 18వ పురాణంగా చెబుతారు. ఈ గ్రంధంలో [[ఆధ్యాత్మ రామాయణము]] అంతర్గతమై ఉంది.
 
బ్రహ్మ తెలిపిన విశ్వతత్వము (బ్రహ్మాండము) గురించి ఇందులో ఉన్నందున దీనికి "బ్రహ్మాండపురాణము" అనే పేరు వచ్చింది. ఇందులో విశ్వము లేదా సకల జగత్తు ఒక హిరణ్యమయమైన అండము (బ్రహ్మాండము) నుండి ఉద్భవించినట్లుగా తెలుపబడింది. ఆధ్యాత్మ రామాయణము, రాధాకృష్ణుల విశేషములు, పరశురామావతారము వంటి కథలు ఈ పురాణంలో ఉన్నాయి. ఇందులో మొత్తం 12,000 శ్లోకాలున్నాయి. ఒక బ్రాహ్మణునికి బహుమతిగా ఇవ్వడానికి ఇది ఉచితమైన గ్రంధమని చెబుతారు.
పంక్తి 11:
{{main|మన్వంతరము}}
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
 
 
* [[కృత యుగము]] = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
Line 23 ⟶ 22:
కృతయుగంలో స్త్రీపురుషులంతా బహుచక్కనివారు, ఆరోగ్యవంతులు, దీర్ఘాయువులు, ధర్మకార్య తత్పరులు. దురాశ, దంభము, మచ్చరములెరుగరు. సద్యోగర్భమున సంతానము కంటారు. జనులు చెట్ల తొఱ్ఱలయందును, గుహలయందును, భూబిలంబులందును నివసింతురు. అందరిదీ ఒకే జాతి.
 
త్రేతాయుగంలో జనులకు రజోగుణము ప్రధానముగా ఉంటుంది. వర్షములు పుష్కలముగా కురియును. జనులు సత్యమును తప్పరు. వారిలో క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులేర్పడును. మానవులలో హర్షము, ద్వేషము వంటి ద్వంద్వగుణములు రూపుదిద్దుకొనును. స్త్రీపురుషులకు భోగేచ్ఛ అధికమగును. తపస్సు పట్ల బద్ధకము పెరుగును. వ్యాపారమునందు ఆసక్తి పెరుగును. గ్రామములు, పట్టణములు ఏర్పడును. కొలతలు ఇతర ప్రమాణములు ఏర్పడును. పెక్కు ధాన్యములు లభించును. వృత్తుల ప్రాధాన్యత పెరుగును.
 
త్రేతాయుగంలో జనులకు రజోగుణము ప్రధానముగా ఉంటుంది. వర్షములు పుష్కలముగా కురియును. జనులు సత్యమును తప్పరు. వారిలో క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులేర్పడును. మానవులలో హర్షము, ద్వేషము వంటి ద్వంద్వగుణములు రూపుదిద్దుకొనును. స్త్రీపురుషులకు భోగేచ్ఛ అధికమగును. తపస్సు పట్ల బద్ధకము పెరుగును. వ్యాపారమునందు ఆసక్తి పెరుగును. గ్రామములు, పట్టణములు ఏర్పడును. కొలతలు ఇతర ప్రమాణములు ఏర్పడును. పెక్కు ధాన్యములు లభించును. వృత్తుల ప్రాధాన్యత పెరుగును.
 
 
ద్వాపరయుగంలో జనులకు లోభగుణమతిశయించును. ధనము పట్ల కోరిక పెరుగును. ధర్మ సంఘము, వర్ణ సంకరము కూడా కలుగుతాయి. ఈ బుద్ధిమార్పులను గ్రహించి వ్యాసుడు వేదములను విభజించును. అనావృష్టి, అకాల మరణములు ప్రబలనారంభించును.
Line 41 ⟶ 38:
 
=== వాలి వృత్తాంతము ===
[[వాలి]] బలం గురించి విన్న [[రావణుడు]] బలాబలాలు తేల్చుకోవడానికి అతనితో పోరుకు బయలుదేరాడు. సంధ్యావందనం చేసుకొంటున్న వాలిని వెనుకనుండితన బాహుబంధంలో ఇరికించబోయాడు. రావణుని అలాగే వడిసిపట్టుకొని వాలి అన్ని సముద్ర తీరాలకు వెళ్ళి తన సంధ్యావందన కార్యక్రమం ముగించుకొన్నాడు. గర్వం హరించిన రావణుడు వాలిని ప్రశంసించి అతనితో సంధి చేసుకొన్నాడు.
 
 
అహల్యకు ఇంద్ర, సూర్యులవలన జనించిన వాలి, సుగ్రీవులను ఖడ్గరాజు అనే వానరరాజు పెంచాడు. దుందుభి అనే రాక్షసునితో వాలి యుద్ధం చేసినపుడు ([[కిష్కింధ కాండ]] చూడండి) [[సుగ్రీవుడు]] అకారణంగా వాలి ఆగ్రహానికి గురయ్యాడు. వాలి సుగ్రీవుని తరిమివేశాడు. సుగ్రీవుడు రామునితో మైత్రి చేసుకొన్నాడు. అప్పుడు రాముడు చెట్టుమాటునుండి వేసిన తన బాణంతో వాలిని చంపేశాడు. అనంతరం రాముడు వాలికి అగ్ని సంస్కారములు చేయించి సుగ్రీవుని వానర రాజుగా అభిషేకింపజేశాడు.
 
=== శ్రాద్ధక్రియ, విమర్శనదినము ===
చనిపోయినవాఱికి శ్రాద్ధక్రియ ఎందుకు చేయాలని మునులు అడుగగా సూతుడు ఇలా వివరించాడు - మరణించిన జీవుడు ప్రేతరూపంలో ఒక సంవత్సరకాలం ఉండును. అందులో మొదటి పదిరోజులు ఆజీవుని పంచప్రాణాలలో ఒకటి చనిపోయిన స్థలంలోను, మరొకటి స్మశానంలోను, మూడవది కర్తయందును, నాలుగవది వాయసములందును, ఐదవది వాయువునందును ఉండును. ఎత్తిపోతలు (సంచయము) అయ్యేదాకా ఆ ప్రాణములు దుర్భరమైన తాపము అనుభవించుచుండును. యథోక్తముగా కర్మలు చేసిన తరువాత ఆ ప్రాణములన్నియు తాపము శమించి, ఒకచోట చేరి యాతనా శరీరము ధరించును. ఆ యాతనాశరీరము (ప్రేతాత్మ) నరకమునకు పోవుటకు ఒక సంవత్సరము కాలము పట్టును. మనకొక మాసము వారికి ఒక దినము. కనుక ప్రతినెల మాసికము పెట్టవలయును. యమలోకమునకు పోవు మార్గములో 18 తావుల ఆగుదురు కనుక 18 మాసికములను పెట్టి, సంవత్సరాంతమున సాహపిండము పెట్టవలెను. ఆ నాటితో మృతులు ప్రేతరూపమును చాలించి పితృదేవతలగుదురు. పితృదేవతలు కూడ దేవతా సమానులే.
 
 
సంవత్సరాంతమున - సాంవత్సరికము జరిగిన మరుదినము అయిన విమోకము నాడు - యాతనా శరీరములో నున్న జీవుని యమభటులు యమధర్మరాజు వద్ద ప్రవేశపెట్టుదురు. చిత్రగుప్తుని ఖాతాను కాలము, సూర్యచంద్రుల సాక్ష్యముతో సరిచూచెదరు. జీవులు శిక్షలేమైనా ఉంటే అనుభవించి ఆపైన వారు పుణ్యలోకమునకు పోవుదురు. కర్మ జరుగని జీవులు ప్రేతరూపములోనే ఉండవలసివచ్చును. అట్టివారికి గయలో పిండప్రదానము చేసినట్లయితే వారి ప్రేతరూపము పోయి పుణ్యలోకములు ప్రాప్తించును.
 
 
సంవత్సరికము పెట్టిన మరుసటి దినమున తిథి ప్రయోజనము (ఆబ్దికము) పెట్టవలెను. తదాధి ప్రతి సంవత్సరము మృతనమాసమున పితరులను, విశ్వేదేవతలను అర్చించవలెను.
Line 59 ⟶ 52:
సాక్షాత్తు పరమేశ్వరానుగ్రహం పొందిన [[పరశురాముడు]] [[అగస్త్యుడు|అగస్త్యుని]] వద్దకు వెళ్ళి ఉపదేశం ఎందుకు పొదవలసివచ్చిందని మునులు ప్రశ్నించారు. అందుకు సూతుడు ఇలా వివరించాడు.
 
పరశురాముడు ఈశ్వరునికి శిష్యుడై పాశుపతాది దివ్యాస్త్రాలను, వాసుదేవ మంత్రమును, త్రిలోక విజయము అనబడు శ్రీకృష్ణకవచమును ఉపదేశంపొందాడు. పుష్కరతీర్ధమున [[తపస్సు]] చేయసాగాడు. ఆ సమీపంలో ఒక [[లేడి|లేళ్ళ]] జంట నీరు త్రాగి విశ్రమించాయి. వాటిని చంపడానికి ఒక వేటగాడు వచ్చి, పరశురామునికి భయపడి, ఒక పొదమాటున దాగి ఉన్నాడు. వాటిలో మగలేడి పూర్వజన్మలో ఒక విప్రబాలకుడు. పరశురాముని దర్శనభాగ్యం వలన దానికి పూర్వజన్మ వృత్తాంతము, జ్ఞానము అవగతమయ్యాయి. ఆడులేడి, మగలేడి మధ్య జరిగిన సంభాషణ సారాంశం ఇది -
 
"పరశురాముడు గొప్పతపస్వి. ఈశ్వరునినుండి కృష్ణకవచం ఉపదేశంపొంది నూరు సంవత్సరాలు జపించినా ఆ [[మంత్రము]] సిద్ధింపలేదు. దైవమునకు భక్తి ప్రదానము. [[శివుడు]], [[నారదుడు]], [[శుకుడు]], [[అంబరీషుడు]], [[బలి]], [[విభీషణుడు]], [[ప్రహ్లాదుడు]] ఉత్తమ భక్తులు. [[వశిష్ఠుడు|వశిష్ఠాది]] మహామునులు, అష్ట[[మనువు]]లు, పరశురాముడు మధ్యతరగతికి చెందినవారు. పరశురాముడు అగస్త్యాశ్రమమునకు పోయి అక్కడ శ్రీకృష్ణామృతస్తోత్రమును ఉపదేశము పొందిన యెడల అతనికి మంత్రము సిద్ధించును."
 
 
ఈ సంభాషణ విని పరశురాముడు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయనతో కూడ లేళ్ళు కూడ వెళ్ళాయి. అగస్త్యునికి నమస్కరించి పరశురాముడు అతనినుండి శ్రీకృష్ణస్తోత్రకదంబును విని మంత్రసిద్ధిని పొంది, తన ఆశ్రమమునకు వచ్చి తన శపథమును (కార్తవీర్యార్జునుని నిర్జించుట) నెరవేర్చుకొనెను. హరిణముల జంట కూడా ఉపదేశవాక్యములను విని, దివ్యశరీరములు పొంది, వైకుంఠమునకు వెళ్ళెను.
Line 125 ⟶ 117:
 
== బయటి లింకులు ==
 
 
 
{{అష్టాదశ పురాణములు}}
{{బ్రహ్మాండం}}
 
[[వర్గం:అష్టాదశ పురాణములు]]
[[వర్గం:పురాణాలు]]
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మాండ_పురాణం" నుండి వెలికితీశారు