రామరాజభూషణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: గ్రంధము → గ్రంథము (2) using AWB
పంక్తి 4:
[[నెల్లూరు]] ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి [[వసుచరిత్రము]], హరిశ్చంద్ర, నలోపాఖ్యనము మరియు నరసభూపాలీయము అని కావ్యములను రచించినాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన [[చేమకూరి వెంకటకవి]] భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.
 
ఇతనిని గూర్చి [[పింగళి లక్ష్మీకాంతం]] ఇలా వ్రాసాడు - "ఈ కవి గాయకుడు. సంగీత కళానిధి. సంగీతమునకు, కవిత్వమునకు గల పొత్తును ఇతనివలె మరి యే కవియు గ్రహించలేదు. ఇతని పద్యములన్నియు లయ గమకములు గలవి. కీర్తనలవలె పాడదగినవి. అంతే గాక ఈ కవి గొప్ప విద్వాంసుడు. నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. పద్య రామణీయకత, ప్రౌఢ సాహిత్యము, విజ్ఞాన పటిమ ఇతని రచనలలో గోచరించును. .... ఇతనికే శ్లేష సహజము. రామరాజభూషణునివలె పద్యము వ్రాయగలవారు లేరు. .. కవులలోనింతటి లాక్షణికుడు లేడు.<ref name="pingali">పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర</ref>
 
 
==కావ్యాలంకారసంగ్రహము==
భట్టుమూర్తి రచించిన మొదటి గ్రంధముగ్రంథము కావ్యాలంకార సంగ్రహము. ఇది 5 ఆశ్వాసాల అలంకార శాస్త్రము. నరసభూపాలీయమని దీనికి మరో పేరు. ఇది సంస్కృతంలో విద్యానాధుడు రచించిన ప్రతాపరుద్రయశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంధముగ్రంథము. కావ్య ధ్వని రసాలంకారములను గురించి , నాయికానాయకులను గురించి, గుణ దోషములను గురించి ఇందులో వివరించబడినది. నాలుక కదలనక్కరలేని అక్షరములతో రచించిన అలజిహ్వము_
<poem>
భోగాంబువాహ వాహ విభాగేహాభావుకాంగభావభావమహా
Line 42 ⟶ 41:
హరిణాం కాకృతి వొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్
</poem>
గగన రంగాభోగం వేదిక. ఆభోగం అంటే విశాలమైనది. తమోనేపథ్యం అంటే చీకటి యవనిక. రాత్రి అనే శైలూషి(అంటే నటి). దిక్కులు అనే స్త్రీలు - హరిదంభోరుహ లోచనల్, హరిత్తులు అంటే దిక్కులు - ఆ చీకటి తెరనూ కొంచెం కొంచెం దించుతున్నారు. ముందు నిశాశైలూషి మౌక్తిక పట్టం కనిపించింది. తరువాత నొసరు కనిపించింది. ఆపైన ముఖం పూర్తిగా కనిపించింది. అలా క్రమక్రమంగా చంద్రబింబపు ఆకారం, ముందు రేఖలాగా, తర్వాత అర్ధచంద్రుని లాగా, ఆ తర్వాత పూర్ణ బింబంగా తూర్పు దిక్కున కనిపించింది. నటీమణులు నొసటిపైన ముత్యాల పట్టీ ధరించడం ప్రసిద్ధం. స్త్రీ నొసరు చంద్రరేఖలా ఉండడం, స్త్రీ వదనం పూర్ణ చంద్రునిలా ఉండడం కూడా ప్రసిద్ధ కవి సమయాలే. తాను నాటకాల్లో చూసిన నటీమణి రంగప్రవేశాన్ని మనసుకు తెచ్చుకొని, కవిత్వంలో దానికి అందంగా చంద్రోదయంతో పోలిక సంధించాడు, రామరాజ భూషణకవి. చాలా సహజంగా ఉంది కదా, పోలిక! జానపదుల నిత్యానుభవ దృశ్యాలు ప్రతిబింబించిన కవిత్వం ఎంత నిసర్గంగా ఉంటుందో ఈ పద్యం చెప్పకనే చెపుతున్నది. <ref>[http://www.eemaata.com/em/issues/200903/1381.html ఈ మాట - అంతర్జాల పత్రిక] - మార్చి 2009 - "నాకు నచ్చిన పద్యం" - చీమలమర్రి బృందావనరావు </ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/రామరాజభూషణుడు" నుండి వెలికితీశారు