సౌందర్యలహరి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
పంక్తి 1:
[[ఫైలు:Lalita sm.JPG|right|thumb|200px|శ్రీ లలిత, బాలా త్రిపురసుందరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి ఇత్యాది నామములతో అర్చింపబడే శక్తి స్వరూపిణియే సౌందర్యలహరిలో స్తుతింపబడే శ్రీమాత.]]

[[ఆది శంకరాచార్యుడు]] జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంధముగ్రంథము '''సౌందర్యలహరి'''. ఇది '''[[స్తోత్రము]]''' (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), '''[[మంత్రము]]''' (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), '''[[తంత్రము]]''' (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), '''[[కావ్యము]]''' (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి మరియు సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి.

==స్తోత్ర పరిచయం==
శంకరాచార్యుని అనేక స్తోత్రాలలో శినస్తోత్రంగా [[శివానందలహరి]], దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. [[త్రిపుర సుందరి]] అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే [[ఛందస్సు]]లో ఉంది. సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. <ref name="dvr">'''శ్రీ శంకరాచార్యుల సౌందర్య లహరి''' - వ్యాఖ్యాత : '''డి.వి.రామరాజు''' (ఈ రచయిత ఆంగ్లంలోను, సంస్కృతంలోను M.A. పట్టా సాధించాడు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఆంగ్లభాషోపన్యాసుకినిగా పని చేసి పదవి విరమణ చేశాడు.) - ప్రచురణ : (2007) శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్, 2-22-311/97, వెస్టర్న్ హిల్స్, కూకట్‌పల్లి, హైదరాబాదు.</ref>

# ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.
పంక్తి 33:
:న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ,
:అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి
:ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి .

44వ శ్లోకము
పంక్తి 40:
:పరీవాహస్రోతః సరణిరివ సీమంతసరణిః ,
:వహంతీ సిందూరం ప్రబలకబరీ భార తిమిర
:ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణమ్

73వ శ్లోకము
పంక్తి 47:
:న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః
:పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూసంగమరసౌ
:కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదలనౌ

</poem>
పంక్తి 93:
# [[స్వాధిష్ఠాన చక్రము]] నందలి సంవర్తాగ్నికి (అగ్ని తత్వము గలది) స్తుతి. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - సంవర్తేశ్వరుడు, సమయాంబ
# [[మణిపూరక చక్రము]] నందుండి ముల్లోకములను తడుపు నీలమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - మేఘేశ్వరుడు, సౌదామిని
# [[మూలాధార చక్రము]] నందు నటన చేయు ఆనందభైరవునికి వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - ఆదినటుడు, లాస్యేశ్వరి (ఆనంద భైరవుడు, సమయ)

'''మొదటి 41 శ్లోకములు "ఆనంద లహరి"యనబడును.'''
'''42వ శ్లోకమునుండి "సౌందర్య లహరి"గా భావింపబడుచున్నది.

# ద్వాదశాదిత్యులనే మణులతో కూర్చబడిన దేవి కిరీటం వర్ణన.
# దేవి కురులు అజ్ఞానమును నశింపజేయునని వర్ణన.
Line 134 ⟶ 138:
# దేవి వళుల వర్ణన : మన్మధ నిర్మితములై కనక కలశములవంటి దేవి స్తనములు ఈశ్వర స్మరణచేత సారెకు ప్రక్కలయందు చెమర్చుచు రవికను పిగుల్చుచున్నవి. చంకలను ఒరయుచున్నవి. ఆ కుచ భారమునకు నడుము విరిగిపోకుండా కాపాడుటకై దేవి వళులు (నడుముపైని మూడు ముడుతలు) లవలీలతచే కట్టబడిన మూడు కట్లవలెనున్నవి.
# దేవి నితంబము వర్ణన: పార్వతీ! నీ తండ్రి యగు క్షితిధరపతి భూమినుండి విస్తారమును తీసి నీకు అరణముగా నిచ్చెను. అందున నీ నితంబము (పిఱుదులు) విస్తారమై వసుమతి (భూమి)ని కప్పివైచుచు తేలిక చేయుచున్నవి.
# భవతి తొడలు, మోకాళ్ళ వర్ణన : పార్వతీదేవి తొడలు గజరాజు తుండములను, బంగారపు అరటి కంబములను జయించునవి. భర్తకు సదా మ్రొక్కుచుండుటచే ఆమె మోకాళ్ళు గట్టిపడినవి.

83 నుండి 91వ శ్లోకము వరకు దేవి పాదములు, గోళ్ళ వర్ణన యున్నది.

# గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.
# మాతా! నీ పాదములు వేదములకు శిరోభూషణములు. నీ పాద్య జలమే శివుని జటాజూటముననున్న గంగ. విష్ణువు తలపైనున్న చూడామణి కాంతియే నీ శ్రీ పాదముల లత్తుక శోభ. తల్లీ నీ పాదములను దయతో నా శిరసుపైనుంచుమమ్మా.
Line 143 ⟶ 151:
# చండీమాత పాదములు బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను ప్రసాదించును. చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి ఆదేవతాస్త్రీల కర పద్మముల ముకుళించుచున్నట్లుగా అనిపించుచున్నది. ఆ చంద్రులు స్వర్గములో (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను పరిహసించుచున్నట్లున్నది.
# తల్లీ! నీ పాదములు ఎల్లప్పుడు కోరిన సంపదలనిచ్చునవి. సౌందర్యమనెడు మకరందమును వెదజల్లెడు కల్పవృక్షపు పుష్పగుచ్ఛములు. ఆఱు ఇంద్రియములతో (మనసు + జ్ఞానేంద్రియములు) గూడిన నా జీవము ఆఱు కాళ్ళ తుమ్మెదవలె నీపాదములను ఆశ్రయించును గాక.
# మాతా! సుందర గమనా! నీ భవనములోని పెంపుడు హంసలు నీ నడకల తీరును నేర్చుకొన గోరి, నీ వెంటనే తిరుగుచున్నవి. నీ పాదముల మణిమంజీరములు (అందెలు) ఆ హంసలకు పదన్యాసమునందు శిక్షణ నిచ్చుచున్నట్లుగా ఉన్నది.

42వ శ్లోకము నుండి 91వ శ్లోకము వరకు శంకరాచార్యుడు శ్రీమాత కిరీటము నుండి పాదములవరకు స్తుతించాడు. ఇప్పుడు దేవి సంపూర్ణ స్వరూపము వర్ణింపబడుచున్నది.

# దేవీ! బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్రులు నీకు సమీప సేవను పొందుటకై నీ మంచమునకు కోళ్ళుగా ఉన్నారు. శివుడు తెల్లని కాంతి అను మిషతో నీకు పైని కప్పుకొనుటకు దుప్పటియైనాడు. అట్టి సదాశివుడు నీ యెఱ్ఱని దేహకాంతులు ప్రతిఫలించిన కారణమున తానును ఎఱ్ఱబారి మూర్తీభవించిన శృంగార రసము వలెనుండి నీ కనులకు వినోదము గొలుపుచున్నాడు. (శివుని శరీర వర్ణం తెలుపు. దేవి శరీర వర్ణం ఎఱుపు.)
# కామేశ్వరి సంపూర్ణ సౌందర్య స్తుతి - శివాణి కేశములు వక్రమైనవి. సహజ మందహాసము సరళమైనది. దేహము శిరీష పుష్పము వలె మృదువైనది. కుచ ప్రాంతము కఠినమైనది. నడుము లతవలె సన్ననైనది. నితంబములు విశాలమైనవి. సదాశివుని కరుణా శక్తి మూర్తీభవించిన రూపమే ఆ సౌందర్యమూర్తి. అట్టి అరుణాదేవి లోకములను రక్షించుటకు జయమొందుగాక.
Line 161 ⟶ 173:

==శ్రీవిద్యా రహస్యాలు, మంత్ర శాస్త్రం==
శాక్తేయ సంప్రదాయంలో శ్రీవిద్య చాలా ముఖ్యమైనది. [[శ్రీవిద్య]] అంటే వివిధ రకాలుగా నిర్వచిస్తారు. త్రిపుర సుందరిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు మూడు విధాలుగా ఆరాధనాదీక్షను ఆచరిస్తారు (1) దేవీ ధ్యానము (2) శ్రీచక్ర పూజ (3) శాక్త సిద్ధాంత అధ్యయనము. ఈ మూడింటినీ కలిపి '''శ్రీవిద్య''' అంటారు. <ref name="dvr"/> వీటిలో శ్రీచక్రపూజ చాలా ముఖ్యంగా భావిస్తారు. దీనినే మరొక విధంగా [[లలితా సహస్రనామ స్తోత్రము]] పారాయణము, [[శ్రీచక్రార్చన]], [[షోడశాక్షరీ మంత్రము]] అనుష్ఠానము కలిపి "శ్రీవిద్య" అని చెబుతారు. శ్రీవిద్యలో "వామాచారము", "సమయాచారము" అనె రెండు విధాలున్నాయి. సౌందర్య లహరిలో శ్రీచక్రం గురించి 11వ శ్లోకంలో చెప్పబడింది.

Line 174 ⟶ 186:

==విశేషాలు==
సౌందర్యలహరిలోని శ్లోకాలు మంత్రాలుగా కూడా భావింపబడుతాయి. ఒక్కొక్క శ్లోకం నియమానుసారం ఉపాసిస్తే ఒక్కో ప్రయోజనం లేదా సిద్ధి లభిస్తుందని విశ్వాసం. ఉదాహరణకు -

* మొదటి శ్లోకము - దినమునకు 100సార్లు చొప్పున 12 దినాలు జపించి త్రిమధురము (బెల్లము+నేయి+కొబ్బరి) లేదా మధురమైన అపూపము నైవేధ్యంగా పెడితే ఇష్ట సిద్ధి, అభ్యుదయము, సకల విఘ్ననివారణ కలుగుతాయి.
Line 210 ⟶ 222:
==బయటి లింకులు==
* [http://soundarya-lahari.blogspot.com/2008/03/blog-post_1259.html ఒక తెలుగు బ్లాగు]

[[వర్గం:స్తోత్రములు]]
"https://te.wikipedia.org/wiki/సౌందర్యలహరి" నుండి వెలికితీశారు