స్వారోచిష మనుసంభవము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
పంక్తి 1:
'''మను చరిత్రము''' లేదా '''స్వారోచిష మనుసంభవము''', [[అల్లసాని పెద్దన]] రచించిన ఒక [[ప్రబంధము|ప్రబంధ కావ్యము]]. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. [[పింగళి లక్ష్మీకాంతం]] అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము. తత్కర్త సహజముగా శృంగార ప్రియుడు. ఆ చిత్తవృత్తి శాంతాభిముఖమయినప్పటి రచన యిది. శృంగారానుభవ రుచి, శాంతనిష్ఠయు రెండును మనోగోళమునావరించియున్నప్పటికిని శాంతివైపు చిత్తము మరలుచున్నదనవచ్చును" <ref name="pingali"> పింగళి లక్ష్మీకాంతం - '''ఆంధ్ర సాహిత్య చరిత్ర''' - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
[[బొమ్మ:Manucharitra 1947print cover.jpg|right|thumb| "మనుచరిత్రము" [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] 1947 ముద్రణ ముఖచిత్రం]]
 
===కవి===
[[అల్లసాని పెద్దన]], కృష్ణదేవరాల ఆస్థానంలో ఆష్టదిగ్గజాలలో ఒకడు.
 
===ఇతివృత్తము===
మారన [[మార్కండేయ పురాణం]]లో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషుని తో ముగుస్తుంది. కాశి నగరం దగ్గర ప్రవరుడనే పరమ నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య ఉండేవారు. వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది.
 
 
తిరుగి పోయే ఉపాయం కోసం చూస్తున్న ప్రవరుడిని చూచు వరూధిని అనే అప్సరస మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు. వారికి జన్మించిన స్వరోచి ఒక దేశానికి రాజయ్యాడు. ఆ స్వరోచి ఒకసారి వేటకు వెళ్ళి మనోరమ అనే యువతిని పెళ్ళాడాడు. వారి కొడుకే స్వారోచిష మనువు.
 
==రచనా వైభవం==
మనుచరిత్రంలో పెద్దన కథన కౌశలం, వర్ణనా చాతుర్యం పండితుల ప్రశంసలందుకొన్నాయి. పెద్దనను సమకాలికులు, అనంతర కవులు కూడా అనుసరించారు. మనుచరిత్రలోని కవితాశిల్పం అద్వితీయం. అక్షరాలా పెద్దన ఆంధ్ర ప్రబంధ కవితా పితామహుడే. మనుచరిత్రలో అనేక ఇతివృత్తాలున్నా గాని అందరినీ అలరించి పెద్దనకు కీర్తి తెచ్చిపెట్టినది వరూధినీ ప్రవరాఖ్యుల ఘట్టమే. <ref name="dvana">'''తెలుగు సాహిత్య చరిత్ర''' - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)</ref> పెద్దన రచనలో ముఖ్యాంశాలు
 
* వర్ణనా కౌశలం : హిమశైల వర్ణన, ఆరవ అశ్వాసంలో ఋతువర్ణనలు, యుద్ధ వర్ణనలు వంటి అనేక అద్భుతమైన వర్ణనలున్నాయి. ప్రబంధంలో ఉండవలసిన అష్టాదశవర్ణనలన్నీ ఇంచుమించుగా మనుచరిత్రలో కనబడుతాయి.
Line 25 ⟶ 24:
* రస పోషణ : శృంగారం, శాంతం, ధర్మం, అద్భుతం, భీభత్సం వంటి అనేక రసాలు ఆయా వృత్తాంతాలలో పాత్రలకు తగినంత ఔచిత్యంతో పెద్దన పోషించాడు.
 
* అలంకారిక రామణీయత : పాత్రలకు, సన్నివేశాలకు, రసానికి అనుగుణంగా అలంకారాలను ప్రయోగించాడు.
 
* కవితా శైలి : "అల్లసానివారి అల్లిక జిగిబిగి" అనే నానుడి ఉంది. "జిగి" అంటే కాంతి. "బిగి" అంటే కూర్పు, పట్టు. అంటే పదాల ఎంపికలోను, సమాసాల కూర్పులోను, పద్యాల ఎత్తుగడలోను చక్కదనం, చిక్కదనం ఉంటాయన్నమాట.<ref name="dvana"/>.
 
==ప్రశంసలు, విమర్శలు==
చీమలమర్రి బృందావనరావు : మార్కండేయ పురాణం లోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత ఖచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు. ... కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంధం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము. అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.<ref>[http://www.eemaata.com/em/issues/200709/1149.html ఈమాటలో వ్యాసం] "నాకు నచ్చిన పద్యం - మనుచరిత్రలో సాయంకాల వర్ణన" - చీమలమర్రి బృందావనరావు </ref>
 
==విశేషాలు==
Line 37 ⟶ 36:
==ఉదాహరణలు==
 
''వినాయక ప్రార్ధనప్రార్థన''
 
:అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా:
Line 66 ⟶ 65:
:కెడఁ దోడునీడ లై క్రీడించు సచ్ఛాత్రు:
:లింతకు నెంత చింతింతు రొక్కొ:
 
 
:యతిథిసంతర్పణంబు లే మయ్యె నొక్కొ:
Line 79 ⟶ 77:
:గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ:
:కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌:
 
 
''ప్రవరుడు వరూధినిని తిరస్కరించుట''
Line 92 ⟶ 89:
 
==వనరులు==
 
 
==బయటి లింకులు==
* [http://www.andhrabharati.com/kAvyamulu/manu/index.html "ఆంధ్ర భారతి"లో పూర్తి కావ్యము ]
* [http://www.eemaata.com/em/category/library/manucharitra/ "ఈమాట" అంతర్జాల పత్రికలో కొంత భాగం] - ఈ వ్యాసంలో ఉదాహరణ పద్యాలు "ఈమాట" నుండి కాపీ చేయబడ్డాయి. "ఈమాట" పత్రికకు కృతజ్ఞతలు.
 
 
 
{{రాయల యుగం}}
 
 
[[వర్గం:తెలుగు కావ్యములు]]