ఒమన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (2) using AWB
పంక్తి 52:
|footnotes = <sup>1</sup> జనాభా - షుమారు 577,293 విదేశీయులతో కలిపి
}}
'''సుల్తనత్ ఆఫ్ ఒమన్''' (Sultanate of Oman) (అరబ్బీ భాషలో:'''سلطنة عُمان''' ) నైఋతి [[ఆసియా]]లో [[అరేబియా సముద్రము]] తీరాన ఉన్న దేశము. దీనికి [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]], [[సౌదీ అరేబియా]], [[యెమెన్]] దేశాలతో సరిహద్దులున్నాయి. ముసందమ్ అనే ఒక చిన్నభాగం ప్రధానభూభాగానికి విడిగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనికి చొచ్చుకొని అరేబియా సముద్రము తీరాన ఉన్నది.
 
 
ఒమన్ జనాభా 25 లక్షల పైచిలుకు (ఇందులో దాదాపు 24 శాతం విదేశీయులు). దేశం వైశాల్యం 3,12,000 చ.కి.మీ. (పోలిక కోసం -హైదరాబాదు నగర జనాభా 36 లక్షలు - చుట్టు ప్రక్కల ప్రాంతాలతో కలిపి 61 లక్షలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైశాల్యం 2,75,068 చ.కి.మీ. అంటే ఒమన్ దేశం వైశాల్యం ఆంధ్ర ప్రదేశ్ కంటే ఎక్కువ. కాని జనాభా హైదరాబాదు నగరం జనాభా కంటే చాలా తక్కువ.)
Line 60 ⟶ 59:
ఒమన్ మధ్యభాగం చాలావరకు విశాలమైన ఎడారి. తీర ప్రాంతంలో వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న పర్వత శ్రేణులు ఉన్నాయి.'[[జబల్ అఖ్దర్]]' '[[జబల్ షామ్స్]]' అనేవి వీటిలో ఎత్తైన భాగాలు. ఈ పర్వత శ్రేణులకు, తీరానికి మధ్యలో ముఖ్యమైన నగరాలు ([[మస్కట్]], [[సలాలా]], [[సూర్]] వంటివి) ఉన్నాయి. 'అల్ హజర్' అనబడే పర్వత శ్రేణులు 'దఖిలియా'ను 'బాతినా' తీరంనుండి వేరు చేస్తున్నాయి. బాతినా తీరం సారవంతమైన మైదాన ప్రాంతం. ఖర్జూరం, కూరగాయల పంటలకూ, పశువుల పెంపకానికీ బాతినా ప్రాంతం అనువైనది.
 
'రుబ్ అల్‌ఖలి' (అంటే ఖాళీ ప్రదేశం) అనే సువిశాలమైన ఎడారి ఒమన్ పశ్చిమ భాగాన ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంది.
 
'రుబ్ అల్‌ఖలి' (అంటే ఖాళీ ప్రదేశం) అనే సువిశాలమైన ఎడారి ఒమన్ పశ్చిమ భాగాన ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంది.
 
దక్షిణాన 'ధోఫార్' ప్రాంతం ఋతుపవన ప్రదేశం. ఇక్కడ దట్టమైన చెట్లు ఉంటాయి.
Line 86 ⟶ 84:
[[దస్త్రం:Oman 1996 CIA map.jpg|right|200px|thumb|ఒమన్]]
ఒకప్పుడు ఒమన్ సుమేరియన్ భాషాపదమైన '''మాగన్''' అనే పేరుతో పిలువబడేది. తూర్పు [[పర్షియా]] సామ్రాజ్యంలో ఒక అనుబంధ రాజ్యంగా ఇది ఉండేది. సుమారు క్రీ.పూ.563లో ఈ ప్రాంతం పర్షియా సామ్రాజ్యంలో కలుపబడింది. తదనంతరం క్రీ.శ. 3వ శతాబ్దంనుండి [[సస్సానియన్ సామ్రాజ్యం]]లో భాగంగా ఉంది. క్రీ.శ. 1వ శతాబ్దంనుండి [[అరబ్బులు]] ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. క్రీ.శ.632లో సస్సానిడ్‌లు అధికారం కోల్పోయారు. అప్పటినుండి ఒమన్ అరబ్బుల అధీనంలో ఉంది.
 
 
క్రీ.శ.751లో [[ఇబాదీ ముస్లిములు]] ఒమన్‌లో ఒక ఇమామత్ (మత వ్యవహారాలలో నాయకుడిగా ఒక ఇమామ్ వ్యవహరించే విధానం) నెలకొలిపారు. 20వ శతాబ్దపు మధ్యకాలం వరకు ఈ ప్రాంతంలో వారి నాయకత్వం కొనసాగింది.
 
 
పురాతనకాలం నుండి ఒమన్ ఒక ముఖ్యమైన వర్తక కేంద్రం. 1508లో [[మస్కట్]] నౌకాశ్రయాన్ని పోర్చుగీసువారు ఆక్రమించారు. కాని 1650లో స్థానికులు వాళ్ళను వెళ్ళగొట్టారు. 1659లో [[ఒట్టొమన్ సామ్రాజ్యం]] ఒమన్‌ను ఆక్రమించింది. 1741లో వారిని ఓడించి సుల్తాన్ అహ్మద్ బిన్ సయిద్ రాజ్యపాలన ప్రాంభించాడు. అప్పటినుండి ఇప్పటివరకూ అదే సుల్తానుల వంశపాలన సాగుతున్నది. మధ్యలో (1743 నుండి 1746 వరకు) కొద్దికాలం ఒమన్‌ను పర్షియా ఆక్రమించింది.
 
 
19వ శతాబ్దం ఆరంభంలో "మస్కాట్ మరియు ఒమన్" (అప్పటి పేరు) బలమైన స్థానిక రాజ్యంగా అభివృద్ధి చెందింది. అప్పట్లో [[బెలూచిస్తాన్]] (ప్రస్తుతం [[పాకిస్తాన్]], [[ఆఫ్ఘనిస్తాన్]] సరిహద్దులలోనున్న ప్రాంతం) మరియు [[జాంజిబార్]] ([[ఆఫ్రికా]] తీరంలో ఉన్న ప్రాంతం) కూడా ఒమన్ అధినంలో ఉండేవి కాని క్రమంగా ఆ ప్రాంతాలు వేరు పడ్డాయి. చివరగా 1958లో [[గ్వదర్]] ప్రాంతం పాకిస్తాన్‌కు అమ్మబడింది. 1891లో "మస్కట్ మరియు ఒమన్" [[యునైటెడ్ కింగ్‌డమ్]] రక్షిత దేశంగా అయ్యింది. ఈ విధానం [[1971]] వరకు కొనసాగింది.
 
 
దానికి ఒక సంవత్సరం ముందు, అనగా [[1970]]లో తన తండ్రి "సయ్యిద్ బిన్ తైమూర్"ను అధికారంనుండి తొలగించి ప్రస్తుత పాలకుడు [[సుల్తాన్ బిన్ సయ్యిద్ అస్‌ సయ్యిద్]] అధికారంలోకి వచ్చాడు. అప్పటినుండి ఒమన్ ఆర్ధిక, సామాజిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. అన్ని పొరుగు రాజ్యాలతోను శాంతియుతంగా ఉండడం, గల్ఫ్ దేశాల మండలిలో భాగంగా ఉండడం, ఉన్న ఆర్ధిక వనరులను ఉపయోగించుకోవడం, విద్య, ఆరోగ్య రంగాలపై శ్రద్ధ వహించడం, స్త్రీలకు అన్ని రంగాలలోను అవకాశాలు ఇవ్వడం ఈ కాలంలో చోటు చేసుకొన్న ప్రధాన విధానాలు.
Line 101 ⟶ 95:
== పరిపాలన ==
 
ఒమన్‌ పాలకుడు వారసత్వంగా వచ్చే సుల్తాను. ఈయన అన్ని పరిపాలనాధికారాలు కలిగి ఉంటాడు. పాలనా నిర్వహణకు సుల్తానుకు సలహాలిచ్చే 25 మంది సభ్యులుగల మంత్రి మండలి నియమితమౌతుంది. 1990లో "మజ్లిస్ అస్-షూరా" అనే సలహా సంఘాన్ని పరిమితమైన వోటు విధానం ద్వారా ఎన్నుకొన్నారు. 1996లో సుల్తాన్ ప్రకటించిన రాజశాసనం కొన్ని కీలకమైన పాలనాప్రక్రియలకు మూలాధారం. వారసత్వం విషయంలో ఉన్న అనిశ్చితిని తొలగించారు. పరిమిత చట్ట హక్కులు గల రెండు సభల సలహా సంఘం ఏర్పడింది. ఒమన్ పౌరులకు ప్రాధమిక పౌరహక్కుల హామీ ఇచ్చారు.
 
ఒమన్‌కు ప్రత్యేకంగా రాజ్యాంగమంటూ లేదు. వివిధ రాజాజ్ఞలే పరిపాలనకు మౌలిక విధానాలు. అలాగే రాజకీయ పార్టీలు కూడా లేవు. ఒక్కొక్క 'విలాయత్'‌కు సుల్తానుచే నియమింపబడ్డ ఒక్కొక్క 'వాలీ' ఉంటాడు. ఇతను స్థానిక పరిపాలనకు బాధ్యుడు.
 
[[2003]]లో ప్రప్రధమంగా "మజ్లిస్ అస్-షూరా"ను సార్వజనిక వోటు విధానం ద్వారా ఎన్నుకొన్నారు. మొత్తం జనాభాలో 74% వరకు (190,000 మంది) తమ వోటు హక్కును వినియోగించుకొన్నారు. ఎన్నికైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
Line 146 ⟶ 140:
 
==== [[అల్ బురైమి]] ====
బురేమి పట్టణం ఇంతకు ముందు ధాహిరాప్రాంతంలో ఒక భాగంగా ఉండేది. అక్టోబరు 2006 నుండి దీనిని ఒక గవర్నరేట్‌గా గుర్తించారు. బురేమి పట్టణం, అల్‌ఐన్ పట్టణం జంట నగరాలు. అంటే ఇవి రెండూ కలిసి ఉంటాయి. కాని బురేమి పట్టణం ఒమన్ దేశంలో ఉంది. అల్‌ఐన్ పట్టణం [[యు.ఎ.ఇ.]]లోని [[అబూధాబి]] ఎమిరేట్‌క్రిందికి వస్తుంది. పట్టణాలు రెండూ కలిసిపోయినట్లున్నా దేశాలు మాత్రం వేరువేరు.
 
బురేమి-అల్‌ఐన్ పట్టణాలు ఎడారిలో [[ఒయాసిస్]] స్థానాలు. ఒంటెలు, ఇతర పశువుల పెంపకానికీ, [[ఖర్జూరం]] పంటకూ కేంద్రాలు. ఒమన్‌లో ఉన్న విదేశీయులు బురేమీకిగాని, ముసందమ్‌కు గాని వెళ్ళాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
 
=== ప్రాంతాలు ===
==== [[అద్ దఖలియా]] ====
"దఖిలియా" అంటే లోపలి ప్రాంతము అని అర్ధం. ఇది ఎక్కువగా పర్వతమయమైన ప్రాంతము. ఇక్కడి ప్రదేశాలలో [[నిజ్వా]] ముఖ్యమైన పట్టణము. ఒకప్పుడు ఒమన్ దేశానికి నిజ్వా రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతం రకరకాలైన ఖర్జూరాల పంటకు ప్రసిద్ధం.
[[దస్త్రం:Waadi_near_BidBidWaadi near BidBid-Oman.JPG|thumb|200px|right|బిద్ బిద్ దగ్గర 'వాడి'. దూరంగా ఖర్జూరం చెట్లు]]
దఖిలియాలోని విలాయత్‌లు
* నిజ్వా
Line 214 ⟶ 208:
* 'బథారీ' భాష మాట్లాడే వారు ధోఫార్ ప్రాంతంలో ఉన్నారు.
* 'లవాతియా'లు - వీరు [[భారతదేశం]], [[పాకిస్తాన్]] ల మధ్య ఉన్న కచ్ ప్రాంతంనుండి వచ్చిన వారు.
* కొద్దిమంది భారతదేశం నుండి వ్యాపార రీత్యా ఇటీవలికాలంలో వచ్చి స్థిరరపడినవారు కూడా ఉన్నారు. వీరు ముఖ్యంగా [[గుజరాత్]]‌కు చెందిన హిందువులు.
 
 
2003 జనాభా లెక్కల ప్రకారం ప్రాంతాలవారీగా జనాభా విస్తరణ క్రింది పట్టికలో ఉంది.<ref name=omancensus2>http://www.omancensus.net/english/final_results.asp</ref>
Line 305 ⟶ 298:
| 100.0%
|}
 
 
 
ఒమన్‌లోను, ఇతర [[గల్ఫ్]] దేశాలలోను ప్రస్ఫుటంగా కనిపించే జన విస్తరణాంశం - అధిక సంఖ్యలో విదేశాలనుండి వచ్చి ఇక్కడ పని చేసే కార్మికులు. దాదాపు 24% వరకు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది భారతదేశం, పాకిస్తాన్‌కు చెందినవారు. ఇంకా [[ఫిలిప్పీన్స్]], [[శ్రీలంక]], [[ఈజిప్ట్]], [[సూడాన్]], [[బంగ్లాదేశ్]]‌లకు చెందినవారు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. అన్ని రంగాలలోనూ, అన్ని స్థాయిలలోనూ విదేశీ కార్మికులు పని చేస్తున్నారు. స్థానికుల ఉద్యోగావకాశాలు మెరుగు పరచే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొన్న కొన్ని ముఖ్యమైన చర్యలు:
Line 320 ⟶ 311:
 
ఇది అధికారికంగా మహమ్మదీయ, అరబ్బు సమాజం. కనుక [[ఇస్లాం మతం]] ఇక్కడ దైనందిక జీవనంలో ప్రముఖమైన పాత్ర కలిగి ఉంటుంది. ఉదాహరణకు [[రమదాన్]] నెలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పని సమయాలను ఉపవాసదీక్షకు అనుగుణంగా మారుస్తారు. అంతే కాకుండా ఒమన్ పౌరులు తమ సంప్రదాయ దుస్తులు ధరించడాన్నీ, అన్ని కట్టడాలూ ఇస్లామిక్ నిర్మాణ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండడాన్నీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
 
 
అయితే ఒమన్‌లో ఆధునికత, సంప్రదాయం కలగలిసి ఉంటాయి. తక్కిన కొన్ని గల్ఫ్ అరబ్బు దేశాలకంటే ఒమన్ మరింత స్వేచ్ఛాయుత దృక్పధాన్నీ, పరమత సహనాన్నీ ప్రోత్సహిస్తుంది. ఒమన్‌లో స్త్రీలు అన్ని విధాలైన ఉద్యోగాలలోనూ రాణిస్తున్నారు. ఇక్కడ చర్చిలు, [[హిందూ దేవాలయాలు]] ఉన్నాయి. అన్ని మతాల పండుగలు తమతమ పరిధులలో ప్రజలు జరుపుకోవచ్చును. [[అరబ్బీ భాష|అరబిక్ భాష]] అధికారిక భాష అయినా [[ఆంగ్ల భాష]] విరివిగా వాడుతారు.
Line 344 ⟶ 334:
== ఒమన్‌లో భారతీయులు ==
ఒమన్‌లో షుమారు 350,000 మంది భారతీయులు ఉన్నారు <ref name=indemb-oman>http://www.indemb-oman.org/indo_oman_community.shtml</ref>. అంటే మొత్తం 560,000 విదేశీయులలో 60% పైగా భారతీయులే అన్నమాట. వీరు దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలనుండి వచ్చినవారు, అన్ని మతాలకు చెందినవారు ఉన్నారు. కాని కేరళ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలనుండి వచ్చినవారు అధికంగా ఉన్నారు. గమనించదగిన మరో ముఖ్యమైన విషయమేమంటే భారతీయులు దాదాపు అన్ని రంగాలలోనూ పనిచేస్తున్నారు. సామాన్యమైన (ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని) కూలిపనులు చేసేవారు, సాంకేతిక, వ్యాపార నిపుణులు, డాక్టర్లు, ఇంజినీరులు, దుకాణాలు నడిపేవారు, ఇంటిలో పనిమనుషులుగా పనిచేసే మహిళలు, మేనేజర్లు - ఇలా దాదాపు అన్నిరంగాలలోనూ విస్తరించి ఉన్న భారతీయ పౌరులు ఒమన్ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నారు. దేశంలో షుమారు 2000 మంది భారతీయ డాక్టర్లు ఉన్నారని అంచనా.
 
 
ఒమన్‌లో 15 భారతీయ స్కూళ్ళు ఉన్నాయి. ఒక్క స్కూలు కేరళ సిలబస్ ప్రకారం నడుస్తుంది. మిగిలినవన్నీ సి.బి.ఎస్.ఇ. (CBSE -Central Board of Secondary Education) సిలబస్‌ను అనుసరిస్తాయి.
Line 350 ⟶ 339:
15వ శతాబ్దంనుండి ఒమన్-భారత దేశాల మధ్య వర్తక సంబంధాలున్నాయని చరిత్రకారులు గుర్తించారు. ముందుగా గుజరాత్ (కచ్), సంధ్, ఖోజా (లవాతియా) ప్రాంతాలవారు వర్తక వాణిజ్యాలలో ప్రముఖ వర్గంగా ఉండేవారు. హిందూ వర్తక సంఘం (బనియా)వాఱు ఇక్కడ 'హిందూ మహాజన్ సంఘం' గా గుర్తించబడ్డారు. చిరకాలంనుండి ఉన్న కుటుంబంవారు 8 తరాలనుండి ఇక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు.
భారతీయులలో హిందువులకోసం మస్కట్‌లో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో శివాలయం 100 ఏండ్ల కంటే పురాతనమైనదని అంటారు. కంపెనీ క్యాంపు ప్రాంతాలలో గురుద్వారా, అమ్మవారి మందిరం వంటి ప్రార్ధనాప్రార్థనా సదుపాయాలున్నాయి. 1996 డిసెంబరులో అమలుచేయబడ్డ దేశపు మౌలిక న్యాయ చట్టం ద్వారా ఎవరైనా స్వేచ్ఛగా ప్రార్ధనప్రార్థన చేసుకొనే సదుపాయం కల్పించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఒమన్" నుండి వెలికితీశారు