కోలాటం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
పంక్తి 19:
 
==ఆట విధానం==
కోలాటం పట్ల ఆసక్తి ఉన్న కొందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతా[[ ప్రార్ధనప్రార్థన]] చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి కోలన్న పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కళ్ళకు గజ్జెలతో చూడముచ్చటగా ఉంటారు. కోలాటంలో అనేకమైన [[ గతి]] భేదాలుంటాయి. వాటిని కోపులు అంటారు. కోపు అంటే నాట్య గతి విభేదం. ప్రాంతాలను బట్టి కోపుల పేర్లు మారుతూ ఉంటాయి. రాత్రీ, పగలూ ఈ ప్రదర్శనలుంటాయి.
==జడ కోలాటం==
కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక కోలాటంలో "జడకోపు కోలాటం" అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమసంఖ్యలో సాధారణంగా ఒక చింతచెట్టు క్రింద ఆడేటప్పుడు ఆ చింత చెట్టుకు పైనున్న కొమ్మకు ఆటగాళ్లు ఎంత మంది వున్నారో అన్ని తాళ్లు కడతారు. అన్ని సరి సంఖ్యలో మాత్రమే వుండాలి. ప్రతి ఒక్కరు ఒక తాడును పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ (రెండు పక్షాలుగా చీలుతారు). [[లయ]] ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన ఒకరి స్థానం నుంచి మరోకరి స్థానంలోకి ఒకరి తర్వాత మరొకరు వరుసక్రమంలో మారుతూ తిరగడంతో ఈ తాళ్ళన్నీ ఒక క్రమ పద్దతిలో అల్లబడిన [[జడ]] లాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా వ్వతిరేక దిశలొ ఆడి తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం. ఒక వేళ ఈ ఆటలో ఏదేని అపశృతి జరిగితే అనగా ఎవరైనా లయ తప్పితే క్రమ పద్దతిలో అల్లిన ఆ జడలో తెలిసి పోతుంది ఎవరు తప్పుచేశారనని. తిరిగి విడదీసేటప్పుడు కూడా అదే తప్పును చేసి ఆ జడను విడగొట్టాలి. అది మరింత క్లిష్టమైన ప్రక్రియ. తప్పు జరిగిన సమయం అతి జాత్రగా గుర్తుపెట్టుకొని ఆ జడను విడదీసేటప్పుడు అదే తప్పును చేస్తే (వ్యతిరేఖ దిశలో) ఆ జడ విచ్చుకుంటుంది. అలా చేయకపోతే ఆ జడ అనేక దారాలు కలిగి వున్నందున చిక్కుబడి పోతుంది. ఆటలో అడుగులు తడబడకుంటే జడ చాల అందంగా తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని వ్వతిరేక దిశలో ఆడి విడదీస్తారు. అది అద్బుతమే. కాని మొదట ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే .... ఎవరు తప్పు చేసారని ఆ దారం పట్టుకున్న వ్వక్తి అని తెలిసి పోతుంది. కాని ఆ తప్పు చేసిన వ్వక్తి ఆ జడను విడదీసేటప్పుడు వ్వతిరేక దిశలో ఆడుతునప్పుడు, మొదట చేసిన తప్పును అదే సమయానికి చేస్తే ఆ జడ సులభంగా విడి పోతుంది. లేకుంటే ఆ జడ ఆ తర్వాత అనేక చిక్కుముడులు పడిపోతుంది. ఇందులో విశేషమేమంటే...... తప్పును చేయడం మానవ సహజం.... కాని ఆ తప్పును సరిదిద్దు కోవడం మంచి పద్దతి. ఈ జడ కోలాటంలో ఎన్ని అడుగులకు తర్వాత తప్పు జరిగింది, తెలుసుకోవాలి. వ్వతిరేక దిశలో ఆడుతున్నప్పుడు దాన్ని గుర్తుంచుకొని అన్ని అడుగుల తర్వాత అదే తప్పుడు అడుగు వేస్తే ఆ దారం సక్రమం అయి అల్లిన జడ యదాతధంగా విడిపోతుంది. ఇందులో ఒక ప్రాముఖ్యత వున్నది. '''తప్పులు అందరు చేస్తారు దాన్ని సరిదిద్దుకున్న వాడే గొప్ప '' అనే సందేశం వున్నది. దానికి ఇది మంచి ఉదాహరణ. తప్పటడుగు వేసినవాడు ఏ సమయంలో తప్పటడుగు వేశాడో గుర్తుపెట్టుకొని అదే సమయానికి అదే తప్పుచేసి సమం చేస్తే ఆ అల్లబడిన జడ సులభంగా విడిపోతుంది. లేదా..... మొదట తప్పుచేసి తిరిగి సక్రమంగా చేస్తే ఆ జడ అనేక చిక్కు ముడులతో తయారయి ప్రేక్షకుల దృష్టిలో అవమానము పాలౌతారు. కనుక తప్పడడుగు వేసి జడను సరిగా అల్లక పోయాడనే నిందకన్నా దాన్ని అదే తప్పు చేసి విడదీసేటప్పుడు అదే విధంగా ఆడితే అది విడిపోతుంది. ఇలా చేయడం అంత సులభం కాదు. కాని కొందరు నిష్ణాతులు కావాలని తప్పు చెసి .... వ్వతిరేక దిసలో అదే తప్పును చేసి ఆటను సరి చేసి తమ గొప్ప తనాన్ని నిలబెట్టుకుంటారు. అదే గొప్ప విషయం. ఎలాగైతేనేమి ఈ జడ కోలాటము అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనిని చూసి తరించ వలసినదే. ఆటలు, బజనలు, నాట్యాలు, వంటి అనేక విధానాలలో అత్యంత సంక్లిస్టమైనది ఈకోలాటమె. సాధారణ కోలాటాలు ..... మామూలె... చాల నృత్యాల లాగ వుంటాయి. ఈ జడకోపు కోలాటలు మాత్రమే అత్యంత క్లిస్టమైనవి........ అసధారణమైనవి,.
పంక్తి 33:
==కోలాటానికి కొన్ని కావాలి==
 
కోలాట ప్రక్రియకు, జట్టు, జట్టు నాయకుడు, ఆటగాడు, గరిడి, లుద్ది, కోపు, ఎత్తుగడ, ఉసెత్తు, ముక్తాయింపు, ఇంతే గాక కోలాట కర్రలు, గజ్జెలు, అందెలు, కొరడా, వాయిద్యాలు, వెలుగు సాధనాలు కోలాటానికి పనికి వచ్చే వస్తువులు.;జట్టు జట్టు నాయకుడు. కోలాటం ఆడే ఆట గాళ్ళందరినీ కలిపి జట్టు అంటారు. జట్టు అంటే గుంపు లేక సమూహము అని అర్థం చెపుతారు. ఈ జట్టులోని ఆట గాళ్ళు జట్టు నాయకుడు వుంటారు. జట్టులో సభ్యులు సరి సంఖ్యలోనే వుంటారు. బృంద సభ్యులందరూ గురువు చెప్పే మాటకు కట్టుబడి క్రమశిక్షణతో మెలగుతారు. జట్తు నాయకుణ్ణి [[కోలన్న పంతులనీ[[]], [[పెన్నుద్ద]]అనీ, ముందు పాటగాడనీ, అయ్యవారనీ, మేళగాడనీ వివిధ పేర్లతో పిలుస్తారు. [[గరిడీ]] ఏర్పాటు చేయడానికి, ఆట ముగించటానికీ, జట్టు నాయకుడిచ్చే సంజ్ఞలమీదే ఆధారపడి వుంటుండి. గరిడీకి స్థలాన్నీ నిర్ణయించడం లోనూ, ప్రారంభించడంలోనూ ప్రారంభించడానికి సమయం నిర్ణయించడానికి ఆయకకే అధికారం.
 
జట్టు నాయకుడు..............లయ, తాళం, పాటలు, ఆట బాగా తెలిసిన వాడై యుండాలి. వికలాంగులు జట్టు నాయకుడుగా పనికిరాడు. ఆరోగ్యవంతుడైన వానినే జట్టు నాయకునిగా ఎన్నుకుంటారు. కోలాట ల్జయ ప్రదానికి జట్టు నాయకుడే ముఖ్యుడు. ఆటగాళ్ళు ఇరవై మంది నుంచి, నలబై మంది వరకూ వుంటారు. వీరు సరి సంఖ్యలోనే వుంటారు. ప్రతి ఆటగాడూ రంగు రంగుల కోల కర్రలతో, కాళ్ళకు గజ్జెలతో, రంగు రంగుల చొక్కాలతో, పంచెలతో చూడ ముచ్చటగా వుంటారు. సామాన్యంగా వెలుపల గాని, గ్రామ మద్యలో వున్న ఖాళీ స్థలాల్లో గాని గరిడిని ఏర్పాటు చేస్తారు. సారిగా హుషారుగా, ఎగురుతూ, పాడుతూ, పాట కనుకూలంగా అడుగులు వేస్తూనే కోలాటం వేయటాన్ని [[ఉసెత్తుకోవటం]] అంటారు. దీనినే త్వరితం ఉసి.... దుడుకు అని కూడ అంటారు. ఇలా ఆటలో ఉసెత్తు కోవడం ప్రేక్షకులను ఎంతో ఆనందపరుస్తుంది.
పంక్తి 74:
భార్య: గాలి ధూళి వచ్చి - గంపంత్గ మబ్బొచ్చి
కొమ్మ వూగి కొప్పు - నిండింది మొగుడా
నాతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు
 
భర్త: అన్నీ సరే కాని - ఇన్ని సరే కాని
పంక్తి 119:
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:జానపద కళారూపాలు]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కోలాటం" నుండి వెలికితీశారు