"వీరశైవ మతం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎వీరశైవ మత స్తాపకులు:: clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
చి (→‎వీరశైవ మత స్తాపకులు:: clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB)
 
రేణుకాచార్యులు అగస్త్య మహామునికి ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంధస్తం చేయటం జరిగింది. ఈ గ్రంధం అప్పటికే వీరాగమాది 28 గ్రంధాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు భోదించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది.
 
 
రేణుకాచార్యులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ద, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా కొలనుపాకలో అన్ని కులాలవారికీ వీరశైవ దీక్షలు ఇవ్వటమే కాక ప్రతి కులానికీ ఒక మఠాన్ని స్థాపించటం జరిగింది. ఇప్పటికీ అక్కడ పాడుబడిపోయిన ఆనాటి కులాల వారీ మఠాలు నేటికీ కనిపిస్తాయి. ఆ తరువాత రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది.
 
రేణుకాచార్యులవారు కొలనుపాకలోని శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగోద్భవులని తెలుపు పురాణపరమైన ఆధారాలు:
 
రేణుకాచార్యుల వారు నల్గొండ జిల్లా కొలనుపాకలోని సోమేశ్వర లింగోద్భవులని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని సిద్దంతశిఖామనిలోని 4వ పటలములోని శ్లోకాలు వివరిస్తాయి.
విస్మితాః ప్రాణినః సర్వే బభూవురతి తేజసమ్ !! (4-2)
 
2. రేణుకాచార్యులు కొలనుపాక శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగమునుండి ఉద్భవించారని 28 శివాగమాలలొ ఒకటైన స్వయంభువాగమం 9వ పటలం లో చెప్పబడింది. ఈ 9వ పటలంలో మొత్తం అయిదుగురు పంచాచార్యుల గురించి వివరంగా తెలుపబడి ఉంది, శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల చరిత్ర ఒకటైన వీరాగమంలో ఉంటుందిమరియు స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో కుడా రేణుకాచార్యుల గురించి వివరించబడి ఉంది,
 
శ్రీమద్రేవణ సిద్దస్య కొలిపాక పురోత్తమే!
4. శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల వారు ప్రతి యుగమున కొలనుపాక శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగమునుండి ఉద్భవించి కృతయుగమున ఏకాక్షర శివాచర్యులు అని, త్రేతాయుగమున ఏకవక్త్ర శివాచార్యులు అని, ద్వాపరయుగమున రేణుకాచార్యులు అని, కలియుగమున రేవణారాధ్యులు అని ప్రసిద్ది కాంచి ఉన్నారు.
5. శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి వీరశైవ సిద్దాంతమును ఉపదేశించారు.
6. త్రేతాయుగమునందు మహా శివభక్తుడైన రావణుని సోదరుడైన విభీషణుడి ప్రార్ధనప్రార్థన మేరకు ఒకే ముహుర్తమున 3 కోట్ల శివ లింగములను లంకా నగరములో ప్రతిష్ఠించారు.
7. ద్వాపర యుగములో అనేక మహిమలను ప్రదర్సించడం రేణుక తీర్ధము లేక రేణుక సరోవరము అని సుక్షేత్రముగా ప్రసిద్ది గాంచినది. కలియుగమున విక్రమాదిత్యుడు, చోళరాజులతో పాటు అనేక మంది రాజులను, చక్రవర్తులను అనుగ్రహించి వారికి శైవ సిద్దాంతమును బోధించి వేయి సంవత్సరములపాటు భారతావని అంతటా సంచరించి శివ ఙ్ఞానామృతాన్ని సర్వులకు ఉపదేశించి చివరికి తాము ఉద్భవించిన కొలనుపాక శ్రీ స్వయంభూ సోమేశ్వర లింగము నందు ఐక్యమై శివ స్సన్నిధ్యమును చేరిరి.
 
రేణుకాచార్యులవారు కొలనుపాకలోని స్వయం భూ సోమేశ్వర లింగోద్భవులని తెలుపు చారిత్రక ఆధారాలు:
 
1. రేణుకాచార్యులు ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంధస్తం చేయటం జరిగింది. ఈ గ్రంధం అప్పటికే వీరాగమాది 28 గ్రంధాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు భోదించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది.
 
2. ఈ గ్రంధమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము. ఈ సిద్దాంత శిఖామణి గూర్చి తరువాత పలు గ్రంధాలలో ప్రస్తుతించటం జరిగింది. బ్రహ్మసూత్రములకు భాష్యము - శ్రీకరభాష్యం వ్రాసిన శ్రీపతి పండితాచార్యుడు తన గ్రంధమున సిద్దాంతశిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోన్నాడు, తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదాహరించటం జరిగింది.
"ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథ ఔన్నత్యాన్ని కొనియాడాడు.
3. శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో సిద్దాంత శిఖామణి శ్లోకములను
ప్రమాణ యుక్తముగా ఉదాహరించుట జరిగింది., తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను
 
బ్రహ్మ సూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్
ముక్త శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదాహరించుట జరిగింది..
 
4. ప్రసిద్ద సిద్దాంత కౌముది కర్త భట్టోజీ దీక్షితుల "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకరభట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక" , "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" మొదలుగాగల గ్రంధములలో సిద్దాంతశిఖామణి ప్రమాణముల ఉదాహరించుట జరిగింది.
 
రేణుకాచార్యులు కొలనుపాక లింగోద్భవులని తెలిపిన కొన్ని గ్రంధాలు – రచయితలు:
vii. పంచబ్రహ్మొదయ భాష్యం (పుట-17) - సోసల చిక్క వీరనాధ్య, కన్నడము.
viii. శివాధిక్య శిఖామణి (ప్రథమోపదేశమ్ – పుట- 2) - సోసల రేవణారాధ్య, కన్నడము.
 
 
కొలనుపాకలో అన్ని కులాల వారికీ రేణుకుల వారు మఠాలు కట్టించి దీక్షా సంస్కారాలు ఇవ్వటం జరిగింది. అవి నేడు చాలా వరకు కనుమరుగైపోగా కొన్ని మఠాలు మాత్రం శిథిలావస్థలో ఉన్నవి.
 
1. పెద్ద మఠము 2. కురుమ మఠము 3. కాపు మఠము 4. కోమటి మఠము 5. గౌండ్ల మఠము 6. చాకలి మఠము 7. మంగలి మఠము 8. పద్మశాలి మఠము 9. మేదరి మఠము 10. పెరుక మఠము 11. మాల మఠము 12. మీమ్మాఱు మఠము (వడ్రంగి, కంచరి, కమ్మరి, శిల్పి) 13. గొల్ల మఠము 14. ఒడ్డెర మఠము (దీనిని నక్క రామేశుని గుడి అనీ అంటారు) 15. సంగరి మఠము 16. తెనుగు మఠము 17. మేరె మఠము 18. గాండ్ల మఠము
 
 
కొలనుపాకలో రేణుకుల సంస్కరణల ప్రభావం నేటికీ ఉందని, అన్ని కులాలవారు పుట్టినపుడే లింగాలు ధరిస్తారని, ఈ ఊరిలో లింగవంతులైన మాలవాండ్లు మిగతా గ్రామాలలో మాదిరి ఊరి వెలుపల కాక ఊరు మధ్యలోనే నివసిస్తున్నారని శ్రీ ఉజ్జయిని జగద్గురువులు శ్రీ తరుళబాళు శివకుమార ఆచార్యులు తమ 1-జనవరి 1962 నాటి కొలనుపాక క్షేత్ర పర్యటన వివవరాలను 19-4-1963 (సంచిక- 37) నాటి నవసందేశ కన్నడ పత్రికలో వివరించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1420846" నుండి వెలికితీశారు