జువ్వాడి గౌతమరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
కవి సామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]]కు జువ్వాడి అత్యంత ఆత్మీయుడు. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షాన్ని శ్రావ్యమైన కంఠంతో తమదైన శైలిలో అంతరార్థాలను విశదీకరిస్తూ రసికులకు వినిపించగలిగి, వారి మూర్తితత్వాన్ని ఆవిష్కరించాడు. తానే రచించాడా అన్నంతగా ప్రజల్లోకి రామాయణ కల్పవృక్షాన్ని తీసుకెళ్లాడు. జువ్వాడి ప్రోద్బలంతోనే విశ్వనాథ సత్యనారాయణ కరీంనగర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. విశ్వనాథ ‘భక్తియోగ’ అనే పద్యకావ్య సంపుటిని జువ్వాడి కోసం రాసి అంకితం ఇచ్చారు. ‘కల్పవృక్షంలో కైకేయి’, ‘వేయిపడగలలో విశ్వనాథ జీవితం’ వంటి జువ్వాడి సాహిత్య వ్యాసాలు సాహిత్యలోకంలో సంచలనాలు సృష్టించాయి.
 
నవ్య సాహిత్యోద్యమ కాలంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కొంతకాలం పాటు ‘జయంతి’[[జయంతి (పత్రిక)|జయంతి]] అనే సాహిత్య పత్రిక నడిపాడు. తర్వాత దానికి జువ్వాడి సారథ్యం వహించారు. వివిధ పత్రికల్లో జువ్వాడి రాసిన వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి వెలిచాల కొండలరావు ‘సాహిత్యధార’ పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించాడు. జువ్వాడి సాహిత్య కృషికిగాని, సంపాదకత్వం వహించినప్పటి ‘జయంతి’[[జయంతి (పత్రిక)|జయంతి]] పత్రికకు గాని రావాల్సిన కీర్తి ప్రతిష్ఠలు రాలేదు. అయినా ‘జయంతి’[[జయంతి (పత్రిక)|జయంతి]] సంపాదకుడిగా ఆయన సంపాదకత్వం పత్రికా రంగానికే వన్నె తెచ్చింది. నాడు ఇంటర్ ఫైనలియర్ చదువుతున్న [[సినారె|సీ నారాయణడ్డి]] తొలి కవిత అచ్చయింది ఆ పత్రికలోనే.
జీవితమంతా సాహితీ అధ్యయనంతోను, విశ్వనాథ కల్పవృక్ష గానంతోను గడిపారు. ఇటీవలే విశ్వనాథ ప్రత్యేక సంచికను సాహిత్యపీఠం ఆయనకు అంకితం చేసింది.
 
"https://te.wikipedia.org/wiki/జువ్వాడి_గౌతమరావు" నుండి వెలికితీశారు