తైవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 1:
'''తైవాన్''' ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందని, చైనాలోని అంతర్భాగముగా ప్రపంచముచే గుర్తించబడ్తున్నఫసిఫిక్ మహాసముద్రములోని ఒక దీవి. తైవాన్ చైనా నుండి స్వాతంత్ర్యము ప్రకటించుకుంది. వాస్తవ నియంత్రణాధికారము దీనిపై చైనాకు లేదు. ప్రజల భాష చైనీసు(చీనీ).
 
== వివిధ నామాలు==
== చరిత్ర==
=== ఆదిమ తైవాన్ ===
హిమయుగం ఆఖరి దశలో తైవాన్ ఆసియా ప్రధాన భూభాగంలో సముద్రమట్టం పెగిగిన 10,000 సంవత్సరాల తరువాత కలిసి పోయింది . ఈ ద్వీపంలో లభించిన మానవ అవశేషాలు అలాగే పురాతన కళాఖాండాలు 20,000 - 30,000 సంవత్సరాల నాటివిగా గుర్తించబడ్డాయి.
 
ప్రస్తుత తైవాన్ ఆదిమ వాసులు 4,000 సంవత్సరాల ముందు చైనా భూభాగం నుండి వెళ్ళి స్థిరపడిన వారని భావిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష ఆస్ట్రో ఏషియన్ కుటుంబానికి చెందినది. తైవాన్ ద్వీపంలోని తూర్పు భాగంలో ఉన్న మడగాస్కర్ మలయో-పాలినేషియన్ భాష కూడా విస్తరించి ఉంది.
పంక్తి 12:
1622లో ది డచ్ ఈస్టిండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థను ప్రారంభించాలని ప్రయత్నించింది. ఈ ప్రయత్నం మింగ్ అథారిటీల చేత తిప్పికొట్టబడింది. 1624 లో డచ్ కంపెనీ సముద్రతీరంలోని తాయోయాన్ అనే చిన్న ద్వీపంలో " ఫోర్ట్ జీలండియా " పేరుతో వ్యాపార సంస్థను ప్రారంభించింది. అది ప్రస్తుతం ప్రధాన ద్వీపంలోని ఆంపింగ్ లో ఒక భాగంగా ఉంది. కంపెనీకి చెందిన స్కాటిష్ ప్రతినిధి ద్వీపంలోని దిగువభూములు 11 ప్రధాన భూభాగాలుగా విభజింపబడ్డాయని వాటిలో కొన్ని డచ్ ఆధీనంలో ఉండగా మిగిలినవి స్వతంత్రంగా ఉన్నాయని వర్ణించాడు. కంపెనీ ఫిజీ మరియు పెంగూ (మత్స్యకారులు) నుండి కూలీలను దిగుమతి చేసుకున్నారు. వారిలో చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు.
 
1626లో ఈ భూమిలో పాదం మోపిన స్పెయిన్ వారు ఉత్తర తవాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. స్పెయిన్ వారు కీలంగ్ మరియు తాంసు రేవులలో వ్యాపారం విస్తరింపజేసారు. ఈ కాలనీ కాలం 16 సంవత్సరాల కాలం కొనసాగి డచ్ సైన్యాల చేతిలో స్పెయిన్ వారి చివరి కోట పతనం కావడంతో 1642 నాటికి ముగింపుకు వచ్చింది.
 
మింగ్ సామ్రాజ్యం పతనం తర్వాత మింగ్ విశ్వాసి అయిన కాక్సింగా ప్రవేశించి ద్వీపాన్ని ఆక్రమించి 1662 నాటికి జిలాండియా కోటను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత డచ్ ప్రభుత్వం మరియు సైన్యాలను ద్వీపం నుండి తరిమి కొట్టాడు. కాక్సింగ్ తంగ్నింగ్ రాజ్యాన్ని స్థాపించి (1662-1683) తైవాన్ ని రాజధానిని చేసాడు. అతడు అతడి వారసులైన జెంగ్ జింగ్ 1662-1683 వరకు ఈ ద్వీపాన్ని పాలించాడు. తరువాత రాజ్యానికి వచ్చిన జెంగ్ కెషంగ్ పాలన ఆగ్నేయ చైనాను పాలిస్తున్న క్వింగ్ సామ్రాజ్యంతో నిరంతరంగా సాగించిన దాడుల కారణంగా ఒక సంవత్సరం కంటే ముందే ముగింపుకు వచ్చింది.
పంక్తి 18:
ఫ్యుజియన్ నౌకాసేన 1683 లో కాక్సింగ్ మనుమడిని ఓడించిన తరువాత క్వింగ్ ను ఆనుకుని ఉన్న తైవాన్ ద్వీపం ఫ్యూజియన్ న్యాయపరిధిలోకి చేర్చబడింది. క్వింగ్ రాజ్యాంగం ఈ భూభాగంలో సముద్రపు దోపిడీదారులు మరియు దేశదిమ్మరుల నుండి రక్షిస్తూ వచ్చింది. అలాగే స్థానిక ప్రజల భూహక్కు మరియు వలసలను నిర్వహించడానికి వరుసగా శాసనాలను అమలుచేసింది. దక్షిణ ఫ్యుజియన్ నుండి వలసదారులు తైవానులో ప్రవేశించసాగారు. పన్ను చెల్లించే భూములకు పోరుకొనసాగిన భూముల సరిహద్దులు తూర్పు తీరాలకు మారింది. స్థానికులు కొండ ప్రాంతాలకు పంపబడ్డారు. ఈ సమయంలో చైనీయులకు మరియు దక్షిణ ఫ్యూజియన్లకు అలాగే చైనీయులకు, దక్షిణ ఫ్యూజియన్లకు మరియు స్థానికులకు మధ్య అనేక పోరాటాలు జరిగాయి.
 
ఉత్తర తైవాన్ మరియు పెంగూ ద్వీపాలలో సినో-ఫ్రెంచ్ యుద్ధాలు (1884 ఆగస్ట్ నుండి 1885 ఏప్రెల్ ) కొనసాగాయి. 1884 అక్టోబర్ మాసంలో ఫ్రెంచ్ కీలంగ్ ను ఆక్రమించుకుంది. అయినప్పటికీ అది కొన్ని రోజుల తరువాత తిరిగి స్వాధీనం చేసుకొనబడింది. ఫ్రెంచ్ కొన్ని విజయాలను సాధించినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేని ప్రతిష్టంభన కొనసాగింది. 1885 మార్చ్ 31లో మత్సయకారులతో సాగించిన యుద్ధంలో ఫ్రెంచ్ విజయం సాధించినప్పటికీ అధిక సమయం ఆ విజయాన్ని నిలబెట్టుకోలేక పోయింది. యుద్ధానంతరం ఫ్రెంచ్ వారు కీలాంగ్ మరియు పెంగూ ఆర్చిపెలగో లను ఖాళీచేసారు.
 
1885లో క్వింగ్ ప్రభుత్వం తైవాన్ ప్రిఫెక్చర్ అఫ్ ఫ్యూజియన్ ను తైవాన్ భూభాగంగా మార్చడంతో సామ్రాజ్యంలో తైవాన్ 20వ భూభాగం అయింది. తైపి తైవాన్ రాజధానిగా చేయబడింది. తరువాత తైవాన్ భూభాగంలో ప్రారంభం అయిన ఆధునికీకరణలో భాగంగా భవననిర్మాణాలు, రైలు మార్గం నిర్మాణం మరియు తపాలా సర్వీస్ వంటివి చోటు చేసుకున్నాయి.
పంక్తి 24:
మొదటి సినో-జపానీ యుద్ధంలో (1894-1895) క్వింగ్ సామ్రాజ్యం ఓడిపోయింది. తైవాన్ మరియు పెంగూ తమ పూర్తి స్వాతంత్రాన్ని జపానుకు సామ్రాజ్యానికి వదిలివేసింది. క్వింగ్ సామ్రాజ్యాభిమానులకు తమ ఆస్తులను విక్రయించి ప్రధాన భూమి అయిన చైనాకు తరలి వెళ్ళడానికి రెండు సంవత్సరాల గడువు ఇవ్వబడింది. చాలా స్వల్పమైన వారు మాత్రమే ఇది సాధ్యమని భావించారు. 1895 మే 25 క్వింగ్ మద్దతుదార్లు జపాన్ పాలనను అడ్డగిస్తూ ఫార్మోసా రిపబ్లిక్ ప్రకటన చేసారు. 1895 అక్టోబర్ 21 న రాజధాని అయిన తైవాన్‌లో ప్రవేశించి క్వింగ్ మద్దతుదార్ల తిరుగుబాటును అణిచివేసారు.
 
జపాన్ పాలనలో ద్వీపంలో రైలుమార్గాల విస్తరణ మరియు రహదారుల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత నిర్మాణాలను మెరుగుపరచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆధునిక విద్యావిధానం స్థాపించబడింది. ప్రతిద్వందుల వేట సాగించిన కారణంగా జపాన్ పాలన ముగింపుకు వచ్చింది. జపాన్ పాలనా కాలంలో బియ్యం మరియు చెరుకు ఉత్పత్తిలో విపరీతంగా అభివృద్ధి చెందింది. 1939 నాటికి తైవాన్ చక్కెర ఉత్పత్తి ప్రపంచంలో ఏడవస్థానానికి చేరుకుంది. తైవానీయులు - స్థానికులు రెండవ స్థాయి పౌరులుగానే పరిగణించబడ్డారు. జపాన్ పాలనలో మొదటి దశాబ్ధంలో చైనీయుల గెరిల్లా యుద్ధం అణిచివేయబడిన తరువాత స్థానిక గిరిజనుల మీద క్రూరమైన యుద్ధపరంపరలను సాగించిన యుద్ధాలు 1930 వూష్ సంభంవంతో ముగింపుకు వచ్చాయి.
 
1935 నాటికి ద్వీపాన్ని జపాన్ సామ్రాజ్యంతో అనుసంధానించే ప్రయత్నాలు చేసారు. ద్వీపంలోని ప్రజలు తమకు తాము జపానీయులుగా భావించారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వేలమంది తైవానీయులు జపాన్ సైన్యాలలో సేవచేసారు. ఉదాహరణగా ఆర్.ఒ.సి అధ్యక్షుడైన లీ తెంగ్-హుయీ అన్న జపాన్ నావికాదళంలో సేవచేసి ఫిలిప్పైన్లో 1945లో పనిచేసే సమయంలో మరణించాడు. జపాన్ సామ్రాజ్య నౌకా దళం ఎక్కువగా తైవాన్‌ రేవులలో స్థావరాలు ఏర్పరచుకున్నారు. తైపీలో ఉన్న తైహోకూ ఇంపీరియల్ యూనివర్సిటీ సమీపంలో " ది సౌత్ స్ట్రైక్ గ్రూప్ " సైనిక స్థావరం ఉండేది. వాయు సైనిక స్థావరమైన " ఏరియల్ బాటిల్ ఆఫ్ తైవాన్-ఒకినవాలో అనేక జపాన్ సైనిక స్థావరాలు తమ సైనిక చర్యలను కొనసాగించాయి. జపాన్ ముఖ్య సైనిక కేంద్రాలు మరియు పరిశ్రమలు తైవాన్ అంతటా విస్తరించి ఉండేవి. అమెరికన్ బాంబింగ్ లక్ష్యంగా చేసుకున్న కయోసియంగ్ వద్ద ఉన్న స్థావరం వీటిలో ఒకటి. 1938 లో 3,09,000 మంది జపానీయులు తైవానులో నివసించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జపానీయులకు జపాన్ దేశం మీద భక్తి అధికమయింది.
పంక్తి 30:
=== రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ===
=== చైనా పాలన ===
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చైనా అంతర్యుద్ధం మొదలైంది. 1949లో చియాంగ్ కై షెక్ నాయకత్వంలో ది చైనీస్ నేషనలిస్టులు మరియు మావో జడాంగ్ నాయకత్వంలో ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తీవ్రమైన ఘర్షణలు మొదలయ్యాయి. వరుసగా కొనసాగిన కమ్యూనిస్టు చర్యలు నేషలిస్ట్ సైన్యాల ఓటమికి దారితీసాయి. కమ్యూనిస్టులు అక్టోబర్ 1 న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించారు.
 
1949లో చియాంగ్ తనప్రభుత్వాన్ని తైవానుకు తరలించి తైపీని ఆర్.ఓ.సికి రాజధానిని ( తైపీని కయి-షెక్ " యుద్ధసమయ రాజధాని అని పేర్కొన్నాడు)చేసాడు. అత్యధికంగా సైనికులు, కుయోమింతాంగ్ సభ్యులు , మేధావులు మరియు వ్యాపారులు మొత్తం 20 లక్షల మంది ప్రధాన భూమి అయిన చైనాను ఖాళీచేసి తైవానులో ప్రవేశించారు. వీరి రాకతో తైవాన్ ప్రజల సంఖ్య 60 లక్షలకు చేరుకున్నది. ఆర్.ఓ.సి తమతో ప్రధానభూమి అయిన చైనా నుండి అత్యధికంగా దేశీయనిధిని తీసుకువచ్చింది. చైనా బంగారం నిలువలు మరియు చైనాకరెన్సీ కూడా అందులో ఒకభాగమే. ఈ కారణంగా కుయోమింతాంగ్ తైవాన్, కిన్మెన్, మాత్స్ ద్వీపాలు మరియు డాంగ్ షా ద్వీపాలలో రెండు ప్రధాన ద్వీపాలు మరియు నాంషా ద్వీపాల మీద ఆధిపత్యం తగ్గించుకున్నాడు. కుయోమింతాగ్ క్రమంగా చైనా మొత్తం మీద పూర్తి ఆధిపత్యం సాధించాడు. ఆక్రమిత చైనాతో తైవాన్ మంగోలియా వెలుపలి ప్రాంతాలు అనుసంధానించబడ్డాయి. విజయం సాధించిన కమ్యూనిష్టులు తాము తైవాంతో చేరిన చైనా ప్రధాన భూభాగాన్ని పాలిస్తున్నట్లు చెప్తూ వచ్చారు. అయినప్పటికీ ది రిపబ్లిక్ ఆఫ్ చైనా చాలా కాలం నిలబడలేక పోయింది.
 
1949 మే మాసంలో తైవాన్లో మార్షల్ లా ప్రకటించబడి కేంద్రప్రబుత్వం తైవానుకు మారిన తరువాత ప్రభావం చూపింది. 1987 వరకు అది రద్దు చేయబడలేదు. ఈ మధ్యకాలంలో తైవానులో రాజకీయ అణిచివేత చర్యలు కొనసాగాయి. వైట్ టెర్రర్ అనిపిలువబడిన ఈ కాలంలో 1,40,000 మంది ఖైదు లేక వధించడం వంటి అణిచివేత చర్యలు అమలయ్యయి. ఒకప్పుడు కమ్యూనిస్టులుగా ఉన్నవారు కుయోమింతాంగ్ వ్యతిరేకులుగా భావించబడిన వారిని లక్ష్యంగా చేసుకుని అణిచివేత చర్యలు కొనసాగాయి. మేధావులు, ఉన్నతవర్గాలవారు, సాంఘకనాయకులు మొత్తం, రాజకీయనాయకులు మొత్తం ఈ చర్యలలో తుడిచిపెట్టుకు పోయారు. 2008 వరకు ఈ చర్యలకు క్షమాపణ కోరబడలేదు. 2010 వరకు నివారణ కాని, నష్టపరిహారం కాని ఇవ్వబడలేదు.
 
కె.ఎం.టి ని అమెరికా విసర్జించింది అలాగే కమ్యూనిస్టులు తైవానును పడగొడతారని అనుకున్నారు. ఉత్తరకొరియా మరియు దక్షిణ కొరియా మధ్య కొనసాగిన ఘర్షణలు 1945లో జపాన్ వెనుకంజ తరువాత మరింత తీవ్రమై 1950 నాటికి యుద్ధానికి దారి తీసింది. యు.ఎస్ అధ్యక్షుడైన హారీ ఎస్ ట్రూమన్ కలుగ చేసుకుని 7వ సైనిక దళాన్ని తైవానుకు పంపి ప్రధాన చైనాభూభాగం మరియు తైవాన్ మధ్య ఘర్షణలు ఆపడానికి ప్రయత్నించాడు. 1952 ఆగస్ట్ 5 న జరిగిన శాంఫ్రాసింస్కో ఒప్పందం మరియు 1952 ఆగస్ట్ 5 న జరిగిన తైపీ ఒప్పందం తరువాత జపాన్ తైవాన్ మరియు పెంగూ మీద హక్కులు వదులుకున్నది. అలాగే 1942 కు ముందు చైనాతో చేసుకున్న ఒప్పందాలను కూడా వదులుకుంది. అయినప్పటికీ ఈ ఒప్పందాలలో తైవాన్ రాజ్యాధికారం ఎవరికి చెందాలన్నది పేర్కొనబడలేదు. యునైటెడ్ స్టేట్స్ కాని యుంసిటెడ్ కింగ్‌డం కాని చైనా ప్రభుత్వ అధికారాన్ని ఆర్.ఒ.సి కాని పి.ఆర్.సి కాని స్వంతం చేకుకోవడానికి అజ్ంగీకరించక పోవడమే ఇందుకు కారణం. 1950 అంతా సాగినన చైనా అంతర్యుద్ధం అమెరికా జోక్యంతో ఒక దారికి వచ్చింది. ఫలితంగా 1955 లో సినో అమెరికన్ ముచ్యుయల్ డిఫెంస్ ఒప్పందం మరియు ఫార్మోసా రిసొల్యూషన్ ఒప్పందంతో చైనా ప్రభుత్వం రూపొందించబడింది.
 
చైనా అంతర్య్ద్ధం తాత్కాలిక సంధివంటివి లేకుండా కొనసాగింది. ప్రభుత్వం తైవాన్ అంతటా సైనిక కోటలను నిర్మించింది. ఈ ప్రయత్నంలో కె.ఎం.టి సైనికులు కొత్తగా 1950 లో ప్రఖ్యాత సెంట్రల్ క్రాస్ హైవేను నిర్మించారు. 1960 వరకు రెండు వైపులా సైకులు చెదురుమదురుగా ఘర్షణలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ద్వీపం ప్రాంతాలలో రాత్రి దాడులు అనేకం జరిగాయి. 1958 లో రెండవ తైవాన్ క్రైసిస్ సమయంలో తైవాన్లో మొదటిసారిగా మిస్సైల్స్ ప్రవేశించాయి. చైనా సైనికదళం స్థాపించిన మొదటి మిస్సైల్ బెటాలియన్ 1997 వరకు నిర్వీర్యం చేయబడలేదు. 1960 -1970 మధ్యకాలంలో ఆర్.ఓ.సి ఏకపార్టీ విధానంతో ప్రభుత్వాధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వధనం పరిశ్రమలకు మరియు సాంకేతికాభివృద్ధికి మార్చబడింది. వేగవంతమైన ఆర్ధిక ప్రగతి తైవాన్ అద్భుతంగా వర్ణించబడింది. బాహ్యంగా చైనా ప్రధాన భూభాగం నుండి లభించిన స్వాతంత్రం మరియు వెనుక నుండి లభిస్తున్న అమెరికన్ నిధులు అలాగే తైనా ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా తైవాన్ వేగవంతంగ ఆర్ధిక ప్రగతి సాధించింది. 1970 నాటికి జపాన్ తరువాత వేగవంతమైన ఆర్ధిక ప్రగతి సాధించిన ఆసియాదేశంగా ఖ్యాతిగాంచింది. తైవాన్, హాంగ్‌కాంగ్, సౌత్‌కొరియా మరియు సింగపూర్ ఆసియన్ పులులుగా గుర్తింపబడ్డాయి. 1970 వరకూ ప్రచ్చన్న యుద్ధం కారణంగా పలు పశ్చిమదేశాలు మరియు ఐఖ్యరాజ్య సమితి చైనామీద ఆర్.ఓ.సి ఆధిపత్యాన్ని గౌరవించాయి. ప్రత్యేకంగా సినో-అమ్నెరికన్ ఒప్పందం ముగింపుకు వచ్చేవరకు పలు దేశాలు పి.ఆర్.సి తో దౌత్యసంబంధాలను ఏర్పరచుకోవడానికి ఉత్సాహం చూపాయి.
పంక్తి 49:
1988 లో చియాంగ్ చింగ్ -కుయో మరణం తరువాత లీ-టెంగ్ హుయీ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి చైనా ప్రధాన భూభాగంలో కేంద్రీకృతమైన అధికారాన్ని తగ్గించాడు. లీ ఆధిపత్యంలో తైవానీస్ లోకలైజేషన్ మూవ్మెంట్ రూపుదిద్దుకుంది. అప్పటివరకు తైవానీయులను చైనా సంస్కృతికి చెందినవాతుగా కె.ఎం.టి ప్రయత్నాన్ని తిప్పికొట్టి అసలైన తైవాన్ సంస్కృతిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. లీ సంస్కరణలో బ్యాంక్ నోట్ ముద్రణ, తైవాన్ భూభాగాన్ని రక్షిస్తూ తైవాన్ రాజ్యనిర్వహణ కార్యక్రమాలను ఎగ్జిక్యూటివ్ యువాన్(నిర్వహణాధికార సభ్యుల బృందం) కు తరలించబడింది. లీ ఆధ్వర్యంలో 1947 లో ఎన్నుకోబడి దశాబ్ధాల నుండి ఎన్నికలు జపబడని లెజిస్లేసువ్ యువాన్ మరియు నేషనల్ అసెంబ్లీ సభ్యులను 1991లో వారిని వత్తిడి చేసి రాజీమాచేయించారు. చైనా ప్రధాన భూభాగం నియోజకవర్గాల స్థానాలకు 4 దశాబ్ధాలకు ఎన్నికలు జరగలేదు. అప్పటికే నామమాత్రంగా ఉన్న లెజిస్లేటివ్ యువాన్ రద్దుచేయబడింది. ఫలితంగా ఆర్.ఒ.సి న్యాయపరిధి నుండి చైనా ప్రధానభూభాగం మరియు వైస్ వర్స తొలగించబడ్డాయి. తవానీస్ హాకియన్ ప్రసారమాధ్యమం మరియు పాఠశాలల మీద ఉన్న నిర్భంధాలు తొలగించబడ్డాయి.
 
1990 వరకు ప్రజాప్రభుత్వ సంస్కరణలు కొనసాగాయి. 1996లో లీ టెంగ్-హుయీ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైయాడు. ఈ ఎన్నికలు ఆర్.ఒ.సి చరిత్రలో మొదటి స్వతంత్ర ఎన్నికలుగా గుర్తించబడ్డాయి. లీ తరువాత పరిపాలన సమయంలో భూమి మరియు ఆయుధాల విడుదల విషయంలో లంచం తీదుకున్న వివాదంలో చిక్కుబడి పోయాడు. అయినప్పటికీ ఎలాంటి ఆయన మీద చట్టపరమైన చర్యలూ తీసుకోలేదు. 2000 లో మొదటిసారిగా కె.ఎం.టి కి చెందని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సభ్యుడైన చెన్ షుయి - బైన్ అధ్యక్షుడిగా ఎన్నుకొనబడ్డాడు. 2004 లో ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికై పరిపాలన సాగించాడు. కె.ఎం.టి నాయకత్వంలో పాన్-బ్లూ మరియు చైనీయుల అభిమానులైన పాన్-గ్రీన్ పార్టీల సమైక్య డి.పి.పిగా ప్రభుత్వం ఏర్పడింది. తరువాత శాశ్వత అధికారిక స్వతంత్ర ప్రకటన చేయబడింది.
 
2007 సెప్టెంబర్ 30న డి.పి.పి తైవాన్ చైనాకు అతీతంగా స్వర్వస్వతంత్ర దేశంగా గుర్తించబడాలని తీరర్మానం చేసింది. తమదేశం ముందులా రిపబ్లిక్ ఆఫ్ చైనా కాకుండా సాధారణంగా పిలువబడుతున్న తైవాన్ దేశంగా గుర్తించబడాలని తీర్మానంలో పేర్కొన్నది.
 
కె.ఎం.టి 2008 నాటి ఎన్నికలలో లెజిస్లేటివ్ సభ్యుల సంఖ్యను అధికం చేసింది. కె.ఎం.టి ప్రతిపాదించిన మా యింగ్ - జియో చైనా అధ్యక్షుడిగా పోటీ చేసి విజయంసాఫ్హించాడు.
పంక్తి 59:
తైవాన్ ద్వీపం ప్రధాన చైనా భూమికి దక్షిణ సముద్రతీరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. తైవాన్ వైశాల్యం 35,883 చదరపు కిలోమీటర్లు. ఉత్తరదిశలో తూర్పు చైనా సముద్రతీరం, తూపుదిశలో ఫిలిప్పై సముద్రం, దక్షిణదిశకు నేరుగా
ల్యూజాన్ స్ట్రైట్ మరియు ఆగ్నేయంలో దక్షిణ చైనా సముద్రం ఉన్నాయి. తైవాన్ దీవి ఆకారం చిలగడదుంప అకారంలో ఉంటుంది. దక్షిణదిశ నుండి ఉత్తరదిశ వైపు వాలినట్లు ఉంటుంది. మిన్-నాన్ నగరవాసులు తరచుగా తాము చిలగడదుంప సంతానం అని చెప్పుకుంటారు.
 
 
ద్వీపం లోని మూడింట రెండు భాగాల భూమి తూర్పు తైవాన్ భూభాగంగా భావించబడుతుంది. తూర్పు మరియు పడమర తైవాను ఖటినమైన ఐది పర్వత శ్రేణూలు విడదీస్తుంటాయి. ఈ పర్వతశ్రేణులు ద్వీపం ఉత్తర దిశ నుండి దక్షిణ సముద్ర తీరంవరకు విస్తరించి చివర చదునై చైనన్ మైదానం ఎర్పడడానికి కారణమయ్యాయి. అత్యధిక తైవానీయులు పడమరదిశలో నివాసముంటున్నారు. 3,952 మీటర్ల ఎత్తు ఉన్న
యుషాన్ లోని జేడ్ పర్వతం తైవాన్ లోని అత్యంత ఎత్తు అయిన ప్రాంతమని అంచనా. 3,500 మీటర్ల ఎత్తు ఉన్న మరో 5 శిఖరాలు తైవాన్‌లో ఉన్నాయి. మే మాసంలో తూర్పు ఆసియా వర్షాలు ఉంటాయి. ద్వీపం మొత్తం ఉష్ణోగ్రత వేడిగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. మధ్య మరియు దక్షిణ ప్రాంత తైవాన్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది
 
ప్రధాన రిపబ్లిక్ చైనా ఆధ్వర్యంలో ఉన్న 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన పెంగ్యూ ద్వీపం చైనాకు 50 కిలో మీటర్ల దూరంలొ ఉంది. ఫ్యూజియన్ తూర్పు తీరంలో ఉన్న మాత్సూ ద్వీపం రిపబ్లిక్ చైనా ఆధ్వర్యంలో ఉన్నాయి.
ప్రాతాస్ ద్వీపాలు మరియు తైపీ ద్వీపాలు దక్షిణ చైనా సముద్రంలో ఉన్నాయి. ఈ దీవుల మొత్త వైశాల్యం 29 చదరపు కిలో మీటర్లు. ఇక్కడ శాశ్వత నివాసితులెవెరూ లేరు.
 
 
===భూతత్వం===
Line 81 ⟶ 79:
 
=== పి.ఆర్.సి తో సంబంధాలు ===
 
 
 
=== విదేశీ సంబంధాలు ===
Line 102 ⟶ 98:
=== తైవాన్ అభిప్రాయాలు ===
 
తైవాన్ లోపల తైవానీయులు కొందరు సమైక్యతను మరి కొందరు స్వతంత్రం కోరుతూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సమైక్యతను కోరేవారు " పాన్-బ్లూ కోయిలేషన్ " ప్రాతినిధ్యంలోనూ సవతంత్రం కోరేవారు " పాన్- గ్రీన్ కోయిలేషన్ " ప్రతినిధ్యంలోనూ పనిచేస్తున్నారు.
 
పాన్-బ్లూ అతిపెద్ద పార్టీ కె.ఎం.టి, సమైక్యత లేకుంటే భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుందని భావిస్తుంది. అయినప్పటికీ పి.ఆర్.సి తో స్వల్పకాలిక సమైక్యతను కె.ఎం.టి పార్టీ అందులోని సభ్యులూ అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. యింగ్- జ్యూ సమైక్యత సాధిస్తే తైవాన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఆర్ధికప్రగతి ప్రయోజనాలను సమానంగా వితరణ చేయవచ్చు అని అభిప్రాయం వెలిబుచ్చాడు.
Line 111 ⟶ 107:
== ప్రభుత్వం ==
రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వ రాజ్యాంగం సంక్షిప్తంగా ఆర్.ఒ.సి అంటారు. ఆర్.ఒ.సి ప్రధాన సిద్ధాంతం ప్రజారాజ్యాన్ని ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాలి. ప్రభుత్వం 5 రాజ్యాంగ విభాగాలుగా విభజించబడ్డాయి.
అవి వరుసగా ది ఎగ్జిక్యూటివ్ యువాన్(యువాన్ నిర్వహణ), ది లెజిస్లేటివ్ యువాన్(యువాన్ చట్టం), ది జ్యుడీషియల్ యువాన్(యువాన్ న్యాయవ్యవస్థ), ది కంట్రోల్ (యువాన్ ఆర్ధికం ) మరియు ది ఎగ్జామినేషన్ యువాన్ (యువాన్ సివిల్ సర్వీస్ పరీక్షలు). ప్రస్థుతం రిపబ్లిక్ చైనాలో పాన్-గ్రీన్ కోయిలేషన్ ఆధిఖ్యత వహిస్తున్నది.
 
అధ్యక్ష లేక ఉపాధ్యక్ష ఎన్నికల ద్వారా 2-4 సంవత్సరాల కాలపరిమితి వరకు రాజ్యాంగ అధికారం పొందిన అధ్యక్షుడే త్రిదళాలకు అధిపతిగా ఉంటాడు. అధ్యక్షుడికి యువాన్ పాలనాధికారం ఉంటుంది. అధ్యక్షుడు తన కాబినెట్ మంత్రులను అలాగే అలాగే ప్రధానమంత్రిని స్వయంగా నియమిస్తాడు.
 
ప్రధాన చట్టసభ " యూనికేమరల్ లెజిస్లేటివ్ యువాన్" (ఒకే శాసనసభ) సభ్యుల సంఖ్య 113. వీరిలో 73 స్థానాలకు ఒక్కో నియోజకవర్గం నుండి ఒక్కొక్కరుగా ప్రజలచేత నేరుగా ఎన్నుకొనబడతారు. 34 స్థానాలకు దేశం మొత్తం నుండి ప్రత్యేక బ్యాలెట్ ద్వారా ఎన్నుకొనబడతారు. మూడు స్థానిక గిరిజన నియోజకవర్గాల నుండి 6 గురు సభ్యులు ఓటింగ్ పద్ధతిలో నేరుగా ఎన్నుకొనబడతారు. గతంలో నేషనల్ అసెంబ్లీ రాజ్యాంగ పరమైన కొన్ని సభలను నిర్వహించేది. 2005లో నేషనల్ అసెంబ్లీ రద్దుచేయబడింది.తరువాత రాజ్యాంగసవరణాధికారం లెజిస్లేటివ్ యువాన్‌కు ఇవ్వబడింది
Line 123 ⟶ 119:
తైవాన్‌లో ఇప్పటికీ మరభశిక్ష అమలులో ఉంది. అయినప్పటికీ వీటి సంఖ్య తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ 2006 లో 80% తైవానీయులు మరణశిక్ష విధించడానికి మద్దతు ఇస్తున్నారు.
== రాజకీయాలు ==
1951 జనవరిలో తైవానీయుడు అయిన వూశాన్- లియాన్ మేయర్ ఎన్నికలలో 65.5% ఓట్లతో విజయం సాధించి మేయర్ అయ్యాడు.
 
ప్రధాన చైనా భూభాగంలో కమ్యూనిస్ట్ పతనం ముందు రిపబ్లిక్ ఆఫ్ చైనా కె.ఎం.టి ఆధ్వర్యంలో విడుదలచేసిన దస్తావేజులో తైవాన్ భూగాన్ని కూడా చేర్చింది. కమ్యూనిస్టులు ఈ పత్రాలను బహిస్కరించారు. 1947 డిసెంబర్ 25 అది అమలుకు వచ్చింది.
Line 152 ⟶ 148:
== సైనికదళం ==
నేషనల్ రివల్యూషనరీ సైనికదళం మూలాల నుండి రిపబ్లిక్ ఆఫ్ చైనా సైనికదళం ఆవిర్భవించింది. 1925లో గుయంగ్డోంగ్ వద్ద సన్ యెట్-సెన్ ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఇది కొమింటాంగ్
సాంరాజ్యం కింద చైనాను తిరిగి సమైక్యపరచడానికి రూపుదిద్దుకున్నది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చైనీయుల సివిల్ యుద్ధంలో గెలుపొందగానే నేషనల్ రివల్యూషనరీ ఆర్మీ ప్రభుత్వంతో సహా తైవానుకు తరుమికొట్టబడింది. తరువాత ఈ సైనికదళం రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్మీగా మార్చబడింది. చైనా ప్రధాన భూభాగంలో ఉనా మిగిలిన దళాలు రద్దు లేక పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో విలీనం చేయబడ్డాయి.
 
ప్రస్థుతం రిపబ్లిక్ ఆఫ్ చైనా బృహత్తరమైన అలాగే అధునాతన సాణ్కేతిక నైపుణ్యం కలిగిన సైనికదళాన్ని కలిగి ఉంది. రిపబ్లిక్ చైనా ఆఫ్
వారసత్వ వ్యతిరేక చర్యలకు ప్రతిగా పి.ఆర్.సి సైనిక చర్య తీసుకుంటుందన్న భయం కారణంగా 1949 నుండి 1970 వరకు మిలిటరీ ప్రధానభాగాన్ని నేషనల్ గ్లోరీ ప్రణాళిక పేరుతో చైనా ప్రధాన భూమికి తరలించబడింది. సైన్యం రక్షణవైపు మళ్ళించబడడంతో ఆర్.ఒ.సి సంప్రదాయక సైన్యాలను వాయు మరియు నావిక దళంవైపు మరల్చింది. సైనికదళాల నియంత్రణ ప్రజాప్రభుత్వం ఆధీనంలోకి మారింది. ఆర్.ఒ.సి సైనిక దళం చారిత్రక మూలాలను కె.ఎం.టి తో పంచుకుంది. పాతతరం పాన్-బ్లూ కి చెందిన ఉన్నతశ్రేణి సైనికాధికారులకు పాన్-బ్లూ అంటే అభిమానం ఉండడమే ఇందుకు కారణం. వారిలో చాలా మంది సైన్యం నుండి పదవీ విరమణ చేసిన తరువాత ఆ ఖాళీలను యువ తైవాన్ వాసులతో భర్తీ చేసారు. అందువలన సైనికుల రాజకీయ అభిమానం తైవాన్ ప్రజలవైపు మొగ్గింది.
ఆర్.ఒ.సి వ్యయం తగ్గించడానికి సైనికదళాను తగ్గించే కార్యక్రమంలో 1997 నాటికి 4,50,000 మంది ఉన్న సైనిక ఉద్యోగులను 2001 నాటికి 3,80,000 స్థాయికి కుదించింది. 2005 నాటికి సైనికుల సంఖ్య 3,60,000 ఉండగా 2009 నాటికి ఆర్.ఒ.సి సైనిక దళం సంఖ్య 3,00,000 చేరుకుంది. సైనికదళంలో చేరడానికి వయోపరిమితి 18 సంవత్సరాలు. తగ్గింపులో ఒక భాగంగా సైనిక శిక్షణా సామర్ధ్యంసామర్థ్యం ఉన్న వారిలో అధికశాతం వారి నైపుణ్యాన్ని వినియోగించే విధంగా ప్రత్యామ్నాయ ఉద్యోగాలవైపు మళ్ళించబడ్డారు. ప్రభుత్వ సంస్థలు మరియు రక్షణ ప్రాముఖ్యం కలిగిన ఇతర ఉద్యోగాలు వాటిలో ముఖ్యమైనవి. తరువాతి దశాబ్ధంలో ఈ మార్పులు ప్రధానంగా రక్షణప్రధానమైన వృత్తులవైపు మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు. బుష్ నిర్వహణలో నిర్బంధ సైనిక కాలపరిమితి 14 మాసాల కాలం నుండి 12 మాసాలకు కుదించబడింది. సైనిక వ్యయం తగ్గించడానికి శాంతిమార్గాలను అనుసరించాలని తైవాన్ భావిస్తుంది. అధికమైన ఆసియా దేశాలు సైనికవ్యయం తగ్గించడానికి ఒకప్పుడు ఈ మార్గాన్ని అనుసరించాయి. రక్షణ వ్యవస్థను చట్టపరిరక్షణ వ్యవస్థను ఆధునికీకరణ చేయాలని తైవాన్ భావిస్తుంది. ఇప్పటికీ తైవాన్ శక్తివంతమైన సైనికవ్యస్థను కలిగి ఉంది. తైవాన్ సౌనికవ్యవస్థ కొరకు 1050 కోట్ల ఆఅమెరికన్ డలర్లను ఖర్చుచేస్తున్నది. ఇదిదేశీయ జి.డి.పిలో 2.94%.
 
ఆసమయంలో తైవాన్ సైనికశక్తుల ఎప్పుడైనా పి.ఆర్.సి సైనికచర్యను ఎదుర్కొనవలసి వస్తుందో అన్నది ప్రధాన ఆందోళనగా ఉండేది. నావికాదళ దాడిగాని, వాయుమాసేనల దాడిగాని లేక మిస్సైల్ బాంబింగ్ కాని ఎదురుకావచ్చని భావిస్తూ వచ్చారు. సమీపకాలంలో 4 ఆధునిక కిడ్ క్లాస్ డిస్ట్రాయర్స్ కొనుగోలు చేయబడ్డాయి. అవి ప్రత్యేకంగా తైవాన్ వాయుమార్గం మరియు సబ్మెరీన్ దాడులను ఎదుర్కొనడానికి ఉపకరించడానికి రూపొందించబడ్డాయి. రక్షణశాఖ మంత్రి డీసెల్ పవర్ సబ్మెరీన్లు మరియు పాట్రియాట్ ఏంటీ- మిసెయిల్ బ్యాటరీలు కొనుగోలుచేయాలని ప్రణాళిక వేయగా పాన్-బ్లూ నియంత్రిత చట్టసభ నిధుల కొరత కారణంగా అడ్డగించింది. 2001 నుండి 2007 వరకు రక్షణ నిధులు నియంత్రించబడ్డాయి. 2008లో 650 కోట్ల అమెరికన్ డాలర్లు నిధులు రక్షణ వ్యవస్థకు మంజూరు చెయ్యబడ్డాయి. పాక్ త్రీ ప్యాకేజ్ పధకం కింద ఏంటీ-ఎయిర్ రక్షణ వ్యవస్థ, ఎహెచ్-64డి అటాక్ హెలికాఫ్టర్లు మరియు ఇతర ఆయుధాలు విడిభాగాలు కొనుగోలు చెయ్యబడ్డాయి. అలాగే ఆధునిక సైనిక హార్డ్‌వేర్లు కూడా అమెరికా నుండి కొనుగోలు చెయ్యబడ్డాయి. 2009 కూడా ఇవి కొనసాగాయి. ఆ.ఒ.సి ఫ్రాంస్ మరియు నెదర్లాండ్ నుండి కూడా కొంత
హార్డ్ వేర్ మరియు సైనిక ఆయుధాలను కొనుగోలు చేసారు. అయినప్పటికీ పి.ఆర్.సి వత్తిడి కారణంగా 1990 నాటికి అవి పూర్తిగా నిలిపివేయబడ్డాయి. పి.ఆర్.సి దాడిని ముందుగా ఆర్.ఒ.సి సైనిక
శక్తి. ఆర్..ఒ.సి ప్రస్థుతం పి.ఆర్.సి దాడిని ఎదుర్కోవడం లేక యు.ఎస్ సైన్యం స్పందించే వరకు అడ్డగించడం వంటి వ్యూహాలను యోచిస్తుంది. తైవాన్ మీద దాడిజరిగితే తైవానుకు రక్షణ కల్పించే నమ్మకం కాని ఒప్పందాలు కాని యు.ఎస్ ప్రభుత్వానికి తైవానుకు మధ్య జరగలేదు. 1996లో యు.ఎస్ మరియు జపాన్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం కారణంగా ఒకవేళ జపాన్ తైవాన్ రక్షణకు అనుకూలంగా స్పందించ వచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ రక్షణ ఒప్పదం లేక ఆస్ట్రేలియా వంటి యు.ఎస్ మిత్రదేశాలు తైవానుకు అనుకూలంగా స్పదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్థవంగా చైనాతో ఉన్న ఆర్ధిక ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉన్నందున ఆస్ట్రేలియాను తైవాన్ అనుకూల చర్యలను తీసుకోవడానికి అడ్డగించవచ్చు. సంయుక్త రాష్ట్రాలు ,[[ జపాన్]], [[కెనడా]], యునైటెడ్ కింగ్డం, [[దక్షిణ కొరియా]], [[ఆస్ట్రేలియా]], [[పెరూ]] మరియు [[చిలీ]] పసిఫిక్ సముద్రంలో ప్రతి 2 సవంత్సరాలకు ఒకసారి (రింపాక్) సముద్ర విన్యాసాలు ప్రాక్టిస్ చేస్తున్నాయి. వారు ఈ ప్రాంతంలో యుద్ధాన్ని నివాతించి స్థిరత్వం ఏర్పడడానికి కృషిచేయవచ్చు. తైవాన్ మీద చైనా దాడి కూడా ఇందులో ఒకటి.
 
== ఆర్ధికం ==
20వ శతాబ్ధం మధ్యకాలం నుండి ఆరంభమైన తైవాన్ వేగవణ్తమైన ఆర్ధికాభివృద్ధి మరియు పరిశ్రమాభివృద్ధి " తైవాన్ మిరాకిల్ " గా అభివర్ణించబడింది. [[సింగపూర్]], [[హాంగ్ కాంగ్]] మరియు [[దక్షిణ కొరియా ]] దేశాలతో కలిసి " ఫోర్ ఆసియన్ టైగర్లలో తైవాన్ ఒకటిగా గుర్తింపు పొందింది.
 
జపానీయుల పాలనకు ముందు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలలో మాత్పులు తీసుకురాబడ్డాయి. ప్రయాణవసతులు, రవాణా మరియు సమాచార రంగం ద్వీపం అంతటా అభివృద్ధి చేయబడ్డాయి. జపానీయులు విద్యావ్యవస్థను అభివృద్ధి చేసి నిర్భంధ విద్యావిధానం అమలుకు తీదుకువచ్చారు.
 
1945 నాటికి చైనా ప్రధాన భూభాగం మరియు తైవానులో ద్రవ్యోభణం అధికమైంది. ఫలితంగా చైనా ప్రధాన భూభాగం మరియు తైవాను జపానుతో యుద్ధానికి తలపడ్డాయి. తైవానుని వేరుచేయడామికి నేషనల్ ప్రభుత్వం తైవాన్ కరెంసీని కొత్తగా రూపొందించింది. అలాగే ధరల నియంత్రణ కాత్యక్రమం చేపట్టింది. ఇ ప్రయత్నాలు ద్రవ్యోభణం వేగాన్ని తగ్గించాయి.
 
ప్రధాన భూభాగం మరియు తైవానులో ప్రవేశించిన కె.ఎం.టి ప్రభుత్వం తమతో తైవానుకు అంతులేని బంగారం మరియు ధనం నిల్వలు తీసుకువచ్చారు. తరువాత తైవానులో ధరలు అదుపులోకి
Line 178 ⟶ 174:
1962 లో తైవాన్ తైవాన్ సరాసరి తలసరి జాతీయ ఉత్పత్తి 170 అమెరికన్ డాలర్లు. ఇది తైవానును ఉతపత్తిలో కాంగో మరియు జైరే సరసన నిలబెట్టింది. పి.పి.పి సమాచార సేకరణ ఆధారంగా1960 సరాసరి తలసరి జి.డి.పి 1353 అమెరికన్ డాలర్లు. 1990 వరకు ధరలు స్థిరంగా ఉండడం విశేషం. 2011 నాటికి సరాసరి తలసరి జి.ఎన్.పి కొనుగోలు శక్తి 37,000 అమెరికన్ డాలర్లకు చేరింది. తైవానును సాధించిన మానవాభివృద్ధి తైవానుని అభివృద్ధి చెందిన దేశాల సరసకు చేరేలా చేసింది. 2007 తైవాన్ హెచ్.డి.ఐ 0.943. 2010 నాటికి 0.868. చింగ్-కుయో
10 ప్రధాన నిర్మాణాల ప్రణాళిక రూపొందించాడు. తైవాన్ ఎగుమతి రంగ అభివృద్ధికి ఈ నిర్మాణాలు నాంది అయ్యాయి.
 
 
తైవాన్ హైస్పీడ్ రైలు 300 కిలో మీటర్ల ఎత్తులో కూడా పయనిస్తున్నాయి. తైపీ నుండి దక్షిణ భూభాగం లోని కావోహ్సియుంగ్ చేరడానికి 90 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. ప్రస్థుతం తైవాన్
క్రియాశీలకంగా, పెట్టుబడిదారి, ఎగుమతుల వైపు సాగిన ఆదాయం క్రమంగా తైవాన్ ప్రభుత్వం పెట్టుబడులు మరియు విదేశీ వ్యాపారం తగ్గించడానికి కారణమయ్యింది. ఈ శైలి ఆభివృద్ధని నిలిపి ఉంచడానికి కొన్ని బృహత్తర బ్యాంకులు మరియు పరిశ్రలను ప్రైవేటీకరణ చేసారు. గత మూడు దశాబ్ధాలుగా భూముల ధరలు 8% అధికమైయ్యాయి. పారిశ్రమికాభివృద్ధికి ఎగుమతులు సహకరించాయి. తైవాన్ వాజిజ్య ఆదాయం అధికంగా ఉంది. విదేశీద్రవ్యం నిలువలలో తైవాన్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. తైవాన్ మరియు రిపబ్లిక్ చైనా మరియు తైవానుకు ప్రత్యేక కరెంసీలున్నాయి.
 
1990 ఆరంభం నుండి తైవాన్ మరియు చైనా ప్రధాన భూభాగం మధ్య ఆర్ధిక సంభంధాలు బలపడ్డాయి. 2008 నాటికి తైవాన్ ప్రధాన చైనా భూభాగన్లో 15 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పి.ఆర్.సి లో 10% కంటే అధికమైన తైవానీ కూలీలు పనిచేస్తున్నారు. వారు తరచుగా తమ స్వంత వ్యాపారం వైపు మరలి పోతుంటారు. ఈ పరిస్థితికి తైవాన్ ఆర్ధికంగా సహకరించినప్పటికీ వారు తైవాన్ ఆర్ధికంగా చైనా ప్రధాన భూభాగం మీద ఆధారపడి ఉంటుందని భావప్రకటన చేస్తుంటారు. 2010 నాటికి తైవాన్ వాణిజ్యం 526 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుంది.
 
2001 లో వ్యవసాయ ఆదాయం దేశీయాదాయంలో 2% మాత్రమే. 1952 నుండి వ్యవసాయాదాయం 35% తగ్గింది. సంప్రదాయ శ్రామికులు క్రమంగా ద్వీపం వెలుపలికి పోగా ఆ స్థానాన్ని అధిక పెట్టుబడులు మరియు సాంకేతికత తత్సంభంధ పరిశ్రమలు భర్తీ చేసాయి. తైవాన్ అంతటా ఉన్నత సాంకేతిక పార్కులు ఆవిర్భవించాయి. పి.ఆర్.సి లో ప్రధాన విదేశీపెట్టుబడి దేశం ఆర్.ఒ.సి మాత్రమే. [[తాయ్‌లాండ్]], [[ఇండోనేషియా]], [[ఫిలిప్పైంస్]],[[మలేసియా]] మరియు [[వియత్నాం]] తరువాత స్థానంలో ఉన్నాయి. పి.ఆర్.సి లో తైవాన్ 50,000 వ్యాపారాలు, 10,00,000 వ్యాపారులు మరియు వాటిని ఆధారంగా జీవించే ప్రజలు ఉన్నారని అంచనా.
 
సంప్రదాయ ఆర్ధిక విధానాలు మరియు పాతిశ్రమిక శక్తి కారణంగా 1997 ఆసియా ఆర్ధిక గండం సమయంలో తైవాన్ పొరుగుదేశాల కంటే తక్కువగా ఇబ్బందికి గురైంది. తన పొరుగు దేశాలైన దక్షిణ కొరియా మరియు జపాన్ కంటే తైవాన్ ఆర్ధిక రంగంలో ఆధిఖ్యత సాధిస్తున్నది బృహత్తర పరిశ్రమల కంటే లషు మరియు మాధ్యమిక పరిశ్రమలే. ది గ్లోబల్ ఎకనమిక్ డౌన్ టౌన్ అయినప్పటికీ ప్రస్థుత ప్రభుత్వ బలహీనమైన నిర్వహణ మరియు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న బాడ్ డెబిట్ కారణంగా 2001 లో తైవానును కొంత తిరోగమించేలా చేసాయి. అనేక పరిశ్రమలు మరియు కార్మికులు
పి.ఆర్.సి కి తిరిగి పోయిన కారణంగా 1970 నుండి అంతకుముందు లేని నిరుద్యోగ సమస్య మొదలైంది. 2004 అధ్యక్షుని ఎన్నిక నాటికి నిరుద్యోగసమస్య కొత్త వివాదాలకు తెరతీసింది. 2002-2006 తరువాత అభివృద్ధి 4% చేరుకోగా నిరుద్యోగ సమస్య 4% తగ్గించబడింది. ఆర్.ఒ.సి అంతర్జాతీయ సంస్థల సమావేశాలలో తన స్వంత పేరుతో కలుసుకుంటింది. తైవాన్ 2002 నుండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి ప్రభుత్వ ఆర్గనైజేషన్లను తైవాన్, పెంగ్యూ, కిన్‌మెన్ మరియు మాత్సూ (చైనీస్ తైపీ) లలో " అరేట్ కస్టంస్ టెర్రిటరీ " లను కలిగి ఉంది.
== సంస్కృతి ==
తైవాన్ సంస్కృతి విభిన్న సాంస్కృతిక ఆధారిత మిశ్రమ సంస్కృతి కలిగి ఉన్నది. చారిత్రకంగాను మరియు వంశానుగతంగా చైనాతో ఉన్నసనంధాలు మరియు తైవాన్ వాసులలో అత్యధికులు చైనాపూర్వీకత కలినవారు అయిన కారణంగా తైవాన్ చైనా సంస్కృతితో ఆఅర్షించబడి వారితో విలీనమైన విభిన్న సంస్కృతి కలిగి ఉంది. జపాన్ సంస్కృతి, సంప్రదాయ కంఫ్యూషియనిజ విశ్వాసం మరియు అధికరిస్తున్న పాశ్చాత్య సంస్కృతి ప్రస్థుత తైవానీయుల మీద ప్రభావం చూపిస్తున్నది. కుయోమింతాంగ్ తైవాన్ ప్రవేశం తరువాత తన చైనా సంస్కృతి సంబంధిత వ్యాఖ్యానాల ద్వారా తైవానీయులను ప్రభావితం చేసాడు. తరువాత చైనా లిపి, చైనీయుల చిత్రలేఖనం, చైనీయుల జానపద కళలు మరియు చైనీయుల సంగీత నాటకాల అభివృద్ధి కార్యక్రమం చేపట్టాడు.
 
తైవానీ సంస్కృతి పరిస్థితి వివాదాంశం ఔతూ ఉంది. తైవానీయుల సస్కృతి చైనాకు చెందినదా లేక తైవానీయులకు ప్రత్యేక సంస్కృతి ఉన్నదా అన్నది వివాదాశంగా మారింది. తైవాన్ రాజకీయాలు నిరంతరంగా వివాదాలతో ముడిపడి ఉన్నందున తైవాన్ సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి విషయాలు తైవాన్ రాజకీయాలలో ప్రధానాంశం అయ్యాయి. తైవానీయుల సంస్కృతి, గుర్తింపు, ప్రధానంగా మొదట ఆధిఖ్యం చేసిన తైవాన్ మరియు చైనీయుల సంస్కృతులు కలిసి ప్రస్థుతం తైవాన్ సంస్కృతిని విభిన్న సంస్కృతుల మేళవింపుగా గుర్తించబడుతున్నది. చైనా ప్రధాన భూగం సస్కృతి అంతర్భాగాంగా చేసుకుని అధికసంఖ్యాకుల సస్ంస్కృతిని కలుపుకుంటూ తైవాన్ తనకంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంది. రాజకీయాలు, ప్రధాన చైనా భుభాగం నుండి 100 సంవత్సరాలకు పైగా వేరుగా ఉండడం కలిసి తైవానులోని పలుప్రాంతాలలో ఆహారం మరియు సంగీతంలో కూడా విభిన్న సంప్రదాయాలను అనుసరించడానికి దారితీసింది.
 
తైవానులోని గొప్ప ఆకర్షణ " నేషనల్ పేలస్ మ్యూజియం " . ఇందులో 6,50,000 చైనా ఇత్తడి కళాఖండాలు, పచ్చలు, చేతి వ్రాతలు, చిత్రలేఖనాలు మరియు పింగాణీపాత్రల సేకరణ కలిసి ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలను ప్రపంచంలో చైనీయుల కళలు మరియు వస్తు ప్రదర్శనశాలలో ఉన్నతమైనదిగా గుర్తింపును తీసుకువచ్చింది. కె.ఎం.టి వారు విడిచి వచ్చిన పీజింగ్ నుండి తీసుకువచ్చిన వస్తుసేకరణతో ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలను స్థాపించారు. 1993లో చైనా సివిల్ వార్ సమయంలో మరికొన్ని సేకరణలు తైవానుకు చేరాయి. చైనీయుల సంస్కృతిక నిధిలో10% ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయని భావిస్తున్నారు. విస్తారమైన ఈ సేకరణలో 1% మాత్రమే ప్రదర్శించబడుతున్నాయని భావిస్తున్నారు. చైనీయులు ఈ వస్తువులు దింగిలించబడినవి కనుక తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఆర్.ఒ.సి మాత్రం ఈ వస్తుసేకరణను ప్రత్యేకంగా సంస్కృతిక తిరుగుబాటు సమయంలో కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.
 
తైవానులో శాస్త్రీయ సంగీతం అత్యధికంగా అభివృద్ధి చేయబడింది. జపానీ సంస్కృతి నుండి వచ్చిన కళాకారులు వరుసగా వయోలిన్ కళాకారుడు చో-లింగ్ లిన్, పియాన్ కళాకారుడు చింగ్-యున్ హూ మరియు లింకన్ సెంటర్ చాంబర్ సొసైటీ ఆర్టిస్ట్ డైరెక్టర్ వూ హాన్, కరోక్ మొదలైన వారు తైవానులో ప్రజాదణ సంపాదించారు. వీరిని కె.టి.వి అంటారు. కె.టి.వి హోటెల్-లైక్ శైలిలో
వ్యాపారరీతిలో కళాప్రదర్శనలు ఇస్తుంటారు. కె.టి.వి బృందాలకు హోటెల్ చిన్న గదులు, బాల్ రూములు వంటివి బృందం లోని సంఖ్య అనుసరించి అద్దెకు ఇస్తారు. పలు కె.ఎం.టి సంస్థలు రెస్టారెంట్ మరియు బఫే విందులు భాగస్వామ్యం ఏర్పరచుకుని పనిచేస్తుంటారు. కుటుంబ సంబంధిత శుభకార్యాలు, మిత్రుల కలయిక మరియు వ్యాపార సంబంధాలను మెరుగు పరచడానికి ఈ విందులు ఏర్పాటు చేయబడతాయి. తైవానులో నడుపబడుతున్న పర్యాటక బసులలో టి.వి లు ఉంటాయి. ఈ టి.వి లలో చలనచిత్రాలు ప్రదర్శించడానికి ఉపయోగించక సంగీత కచేరీలు ప్రదర్శించడానికి ఉపయోగిస్తుంటారు. తైవానులో కె.టి.వి తరువాత ప్రజాదరణ పొందింది ఎం.టి.వి. వీటిని అధికంగా నగరం వెలుపల కనిపిస్తుంటాయి. ఎం.టి.వి ఎంచుకున్న డి.వి.డి లను ప్రత్యేకమైన దియేటర్లలో ప్రదర్శించబడతాయి. యువతకు తమ సమయాన్ని ఏకాంతంగా మిత్రులతో గడపడానికి ఏం.టి.వి అవకాశాన్ని కల్పిస్తుండడం వలనలో యువతలో కె.టి.వి కంటే ఎంటివి అధిక ఆదరణ కలిగి ఉన్నది.
 
తైవానులో 24 గంటలు సేవలందిస్తున్న షాపులు అధికంగా ఉన్నాయి. ఇవి సాధారణ సేవలు కాక అదనంగా ఫైనాంస్ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థల తరఫున పార్కింగ్ ఫీజ్ సేకరించడం, బిల్లులు చెల్లింపు, ట్రాఫిక్ వయోలేషన్ ఫైన్ సేకరించడం మరియు క్రెడిట్ కార్డ్ చెల్లింపులు వంటి సేవలందిస్తున్నాయి.
Line 214 ⟶ 209:
 
రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగం తైవాన్ ప్రజల స్వాతంత్రం మరియు మతవిశ్వాసాలను సంరక్షించడానికి ప్రయత్నిస్తుంది. 2005 గణాంకాలను అనుసరించి తైవానులో దాదాపు 1,87,18,600 మంది (81.3% ప్రజలు) వివిధ మతావలంభీకులు ఉన్నారు. 14-18% ప్రజలు నాస్థికూగా ఉన్నారు. ఆర్.ఒ.సి 26 మతాలున్నట్లు గుర్తించింది. వీటిలో పెద్దవైన 5 మతాలు వరుసగా భౌద్ధమతావలంభీకుల సంఖ్య 80,86,000 (85%), తాయోఇజం మతావలంభీకులు 76,00,000 (33%), ఐ-కుయాన్ టాయో మతావలంభీకులు 8,10,000 ( 3.5%), ప్రొటెస్టెంటిజం 6,05,000(2.6%) మరియు రోమన్ కేథొలికిజం 2,98,000 (1.3%) మంది ఉన్నారు. సి.ఐ.ఎ వరల్డ్ ఫాక్ట్ బుక్ మరియు యు.ఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సమీపకాల ఆధారాలు 93% తైవానీయులు
పలుదేవతారాధన మద్దతుదారులని తెలియజేస్తున్నది. పురాతన చైనా మతం, బుద్ధిజం, కంఫ్యూజియనిజం మరియు తాయిజం తైవానీయులు అనుసరిస్తున్న మతాలలో ప్రధానమైనవి. రోమన్ కాథలిక్, ప్రొటెస్టెంట్లు మరియు ప్రత్యేకించని క్రిస్టియన్ సమూహాలకు చెందిన క్రిస్టియానిటీ మద్దతుదారులు 4.5% , ఇస్లాం, తైవానీ ఆదిమవాసుల మతాలు 2.5%,
 
చైనా మరియు తైవాన్ మూలాల నుండి ఉద్భవించిన కంఫ్యూజియన్ మతం సర్వమతసమానత్వం బోధిస్తున్నది. తైవానీయులలో అత్యధికులు సాధారణంగా సర్వమతసమానత్వానికి మద్దతిస్తూ
Line 240 ⟶ 235:
{{ఆసియా}}
 
 
[[hi:ताइवान]]
[[ta:தாய்வான்]]
[[af:Taiwan (eiland)]]
[[ar:تايوان (جزيرة)]]
Line 268 ⟶ 260:
[[hak:Thòi-vân]]
[[he:טאיוואן (אי)]]
[[hi:ताइवान]]
[[hsb:Taiwan]]
[[hu:Tajvan (sziget)]]
Line 298 ⟶ 291:
[[sv:Taiwan (ö)]]
[[sw:Taiwan]]
[[ta:தாய்வான்]]
[[tl:Taiwan]]
[[tpi:Taiwan]]
"https://te.wikipedia.org/wiki/తైవాన్" నుండి వెలికితీశారు