తెలుగు లిపి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 1:
[[దస్త్రం:3rd century-ikshwaku inscription.jpg|thumb|250px|right|3వ శతాబ్దము ఇక్ష్వాకులనాటి శాసనం]]
'''తెలుగు లిపి''' ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ [[బ్రాహ్మీ లిపి]]నుండి ఉద్భవించింది<ref>తెలుగు లిపి; http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf</ref>. [[అశోకుడు|అశోకుని]] కాలంలో [[మౌర్య సామ్రాజ్యము|మౌర్య సామ్రాజ్యానికి]] సామంతులుగా ఉన్న [[శాతవాహనులు]] బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపి లో వ్రాసిన అక్షరములు మొదట [[భట్టిప్రోలు]] లో దొరికాయి. అచటి బౌద్ధస్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి<ref>ఆనంద బుద్ధ విహార;http://www.buddhavihara.in/ancient.htm</ref>. ఈ లిపిని భాషాకారులు [[భట్టిప్రోలు లిపి]] అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి<ref>The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire; http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm </ref>.
 
 
== ఆవిర్భావము ==
[[దస్త్రం:1410-srinatha time - telugu inscription.jpg|thumb|250px|right|1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనం]]
తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరమున ఉన్న [[భట్టిప్రోలు]] గ్రామమందు క్రీ.పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది <ref>The History of Andhras, Durga Prasad; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf </ref>. ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడ అచటకు చేరినది<ref>[http://www.buddhavihara.in/ancient.htm Ananda Buddha Vihara<!-- Bot generated title -->]</ref>. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవులనుండి తూర్పు ఆసియా లోని బర్మా, థాయిల్యాండ్, లావోస్ మొదలగు దేశాలకు కూడ చేరి అచటి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది<ref>[http://www.sepiamutiny.com/sepia/archives/002554.html థాయ్ లిపి ఆవిర్భావ వివరాలు]</ref><ref> [http://www.omniglot.com/writing/balinese.htmబాలి భాష ఆవిర్భావ వివరాలు] </ref>. క్రీ.శ. ఐదవ శతాబ్దము నాటికి [[భట్టిప్రోలు లిపి]] పాత తెలుగు లిపిగా పరిణామము చెందింది<ref>The Blackwell Encyclopedia of Writing Systems by Florian Coulmas, p. 228</ref><ref>Vishwabharath by K. N. Murthy and G. U. Rao, http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf</ref><ref>Indiain Epigraphy: a guide to the study of inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan languages, by Richard Solomon, Oxford University Press, 1998, p.40, ISBN 0-19-509984-2</ref><ref>Indian Epigraphy by Dineschandra Sircar, Motilal Banarsidass, 1996, p.46, ISBN 81-208-1166-6</ref><ref>The Dravidian Languages by Bhadriraju Krishnamurti, 2003, Cambridge University Press, pp.78-79, ISBN 0-521-77111-0</ref><ref>K. Raghunath Bhat, http://ignca.gov.in/nl001809.htm</ref>.
 
మౌర్యులకాలపు (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీలిపి పట్టికలోని రెండవ వరుసలో ఇవ్వబడినది. అటు పిమ్మట భట్టిప్రోలు ధాతుకరండముపై కొద్దిమార్పులుగల బ్రాహ్మీలిపి మూడవ వరుసలో చూడవచ్చును.
Line 140 ⟶ 139:
* [http://www.proel.org/alfabetos/telugu.html PROEL - Telugu script compared with other Dravidian scripts]
* [http://www.vignanam.com Vignanam - Learn Something Today]
 
 
 
<!-- వర్గాలు -->
"https://te.wikipedia.org/wiki/తెలుగు_లిపి" నుండి వెలికితీశారు