నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వొత్తిడి → ఒత్తిడి (2) using AWB
చి →‎అల్లం రాజయ్య రాసిన ముందుమాట: clean up, replaced: నడిచి → నడచి using AWB
పంక్తి 48:
నాకు ఊహ తెలిసినప్పటి నుండి మాదిగ, మాలలతో కలసి బతుకుతున్నా ` వాళ్ల సౌందర్యవంతమైన ఆచరణ నుండి బతకడం నేర్చుకున్నా ` అలాంటి లేమిలో ` మారుమూల పల్లెటూర్లో బతికినా ` కుల వివక్షతను బతుకు పొడుగంతా అన్ని చోట్ల ఏదో రూపంలో ఎదుర్కుంటున్నా కూడా ` అంటరానితనం జ్వర తీవ్రత నాకు తాకలేదు. అయితే అన్నీ చేసి, సంపద, జ్ఞానం ప్రపంచానికిచ్చి అవమానాలు పొందితే ఎట్ల
ఉంటుందో అనుభవంలోకి రావడం ` దాని కోసం పెనుగులాడటం ద్వారా ఇక్కడ నిలబడి ` ఈ పుస్తకాన్ని ఇందులోని జ్వరతీవ్రతను ముట్టుకోవడం ద్వారా ` ఈ నాలుగు మాటలు రాయ ప్రయత్నించాను.
ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతి స్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోడం. రెండోది వాయిలెంటు రియాక్షన్‌. ఇంతదూరం నడిచినడచి కూడా ` గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు ` తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు ` మేధావిగా గుర్తింపు పొందవచ్చు ` శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి సంబంధించిన సమస్య. లొంగిపోవడం ` పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడి సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం.... అయినా పోరాటం మనిషి తనంతట తాను ఎంచుకునేది కాదు. అది అనివార్యంగా రుద్దబడేది. అత్యంత విషాదం ప్రపంచంలో ఇదే. ఈ కాలంలో ప్రపంచంలో ఏ మనిషి యుద్ధం బయట ఉండగలడు? అనూహ్య ప్రదేశమైన అబూజమహడ్‌ ` ఇప్పటికీ కులం, మతం, స్వంత ఆస్తి తెలియని ఆదివాసుల మీద ప్రజాస్వామిక గణతంత్ర ప్రభుత్వ సైన్యం ఆధునిక ఆయుధాలతో మానవరహిత యుద్ధ విమానాలతో దిగుతోంది. మూలవాసుల ఆస్తుల్ని, దేశాల సరిహద్దుల్ని చెరిపేసి కొల్లగొట్టబడే ` ప్రపంచీకరణ అనే సామ్రాజ్యవాద గొప్ప దోపిడి సన్నివేశంలో ` ప్రతిదీ ఒక పేలే తుపాకే ` అది కొండ
చిలువలా నోరు తెరుచుకున్న రోడ్డు కావచ్చు. కుప్పతెప్పలుగా విస్తరించే నెట్‌వర్కులు, మీడియా మాయాజాలం కావచ్చు. అది స్వైన్‌ ఫ్లూ కావచ్చు ` ఎయిడ్స్‌ కావచ్చు ` కార్చిచ్చులా గుప్పుమనే మరేదైనా కావచ్చును.......
భారతదేశంలో ఆడ మగ, ముసలి ముతక, పిల్లా పీచు, అన్ని కులాలు దళారులుగా లొంగిపోవడానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ` వేలసంస్థలు ` నెట్‌వర్కులు ` టీవీలు ` ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అట్లా లొంగిపోకుండా, దళారులుగా రూపాంతరం చెందకుండా మిగిలిన వారిపై దాడి కోసం భారత దేశం మనం చెల్లించే పన్నులతో ప్రపంచంలోని ఆయుధాలన్నీ కొనుగోలు చేసి అమెరికావారి పర్యవేక్షణలో పెద్ద యుద్ధ రంగం సిద్ధం చేస్తోంది.