అముద్రిత గ్రంథ చింతామణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
నెల్లూరులోని విక్టోరియా ముద్రాక్షరశాలలో ముద్రించబడిన ఈ పత్రిక ప్రారంభించే సమయానికి [[పూండ్ల రామకృష్ణయ్య]] వయసు పాతిక సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే వీరనాగయ్య ఒడయరు సహాయ సంపాదకత్వంలో వెంకటగిరి మహారాజా గోపాలకృష్ణ యాచేంద్ర బహద్దరు ఆర్థిక సహకారంతో ఈ పత్రికను ప్రారంభించాడు. నాలుగు సంవత్సరాలు పత్రిక నడచిన తరువాత ఎందువల్లనో వీరనాగయ్య పత్రిక నుంచి తప్పుకున్నాడు. అయినా [[పూండ్ల రామకృష్ణయ్య]] ఒక్కడే ఈ పత్రికను నిరాటంకంగా తను మరణిచేంత వరకూ అంటే [[1904]], [[జూన్]] నెల వరకు ఈ పత్రికను నడిపాడు<ref>{{cite book|last1=పొత్తూరి|first1=వెంకటేశ్వరరావు|title=ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగు పత్రికలు|date=2004-08-01|publisher=ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ|location=హైదరాబాదు|pages=136-139}}</ref>.
 
అముద్రితంగా తాళపత్ర్రాల రూపంలో పడిఉన్న అనేక తెలుగు గ్రంథాలను పత్రికలో ప్రచురించడం సంకల్పమైనప్పటికీ ప్రారంభం నుండి ఈ పత్రిక విమర్శలకు, చర్చలకు కూడా వేదిక అయ్యింది. చాటుపద్యాల ప్రచురణ మొదటిసారిగా ఈ పత్రికలోనే ప్రారంభమైంది. సమస్యాపూరణలు కూడా ఈ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికలో మొదటి నాలుగు పుటలలో మయూఖము అనే శీర్షిక వెలువడేది.
 
==ఈ పత్రిక ద్వారా అచ్చయిన తాళపత్ర గ్రంథాలు==