కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎మరణం: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 48:
శివరావుకి అంతకుముందున్న ప్రఖ్యాతిని నాటకరంగం బాగా ఉపయోగించుకుంది. తారాపథంలో ఉన్నప్పుడు శివరావుకి ‘బ్యూక్‌’ కారు వుండేది. అప్పటి పెద్ద స్టార్లందరూ బ్యూక్‌ కారునే వాడేవారు. మద్రాసు పాండీ బజార్లో ఆ బ్యూక్‌ కనిపిస్తే చాలు - అభిమానులు కారు వెంట పరిగెత్తేవారు. అలాంటి దశ రాను రాను తగ్గడంతో అతని ప్రభ కూడా తగ్గింది. "మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడ్నీ. తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో గబ్బిలాల కంపు" అని తన మీద తనే చమత్కారబాణం వేసుకునేవాడు. ఒకనాడు పెద్ద సైజు కారులోని వెనుక సీటులో దర్జాగా కూర్చుని తిరిగిన శివరావు - అదే రోడ్ల మీద డొక్కు సైకిలు తొక్కుకుంటూ తిరిగాడు. "తప్పులేదు, ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే ! అందుకే సినిమా నటీ నటుల్ని నక్షత్రాలతో పోల్చారు. నేనూ ఆత్మాభిమానం వున్నవాడ్నే. ఐతేనేం - జీవితం మిట్ట పల్లాలతో వున్నప్పుడు ఇలాంటివి సహజం" అని వేదాంతిలా మాట్లాడేవాడు ఆయన. చివరి రోజుల్లో ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు కల్పించని పరిస్థితిలో శివరావు గారి మీద అభిమానముతో [[ఎన్.టి.రామారావు]] గారు పలు సినిమాలల్లో అవకాశాలు కల్పించారు. సినిమా షూటింగులల్లో కూడా తాగి వస్తూండటంతో మరి అవకాశాలు రాలేదు
==మరణం==
శివరావు చరమదశ మాత్రం దయనీయంగా గడిచింది. అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయిన నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు. చివరిసారిగా [[1966]]లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి తెనాలి వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషన్స్టేషను లో మరణించాడు. కొన్ని గంటల తరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు. ఒకనాడు కారు సీటులో దర్జాగా కూచున్న శివరావు - కారు డిక్కీలో పడి మద్రాసు చేరుకున్నాడు - మధ్యలో ఇబ్బందులు పడుతూ. వస్తూ వస్తూ ఎక్కడో కారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతని మరణ వార్త తెలిసింది. స్టార్‌డంలో లేడనో, గ్లామర్‌ లేదనో మొత్తానికి ఎరిగినవాళ్ళే చాలామంది ‘చివరిచూపు’ లకు రాలేదు. ఒకనాడు వేలాదిమంది అభిమానుల్ని వెంట పరుగెత్తించుకున్న శివరావు - నిర్మాతలను ఇంటి గుమ్మం ముందు గంటలు గంటలపాటు నిరీక్షీంప చేసుకున్న శివరావు - చివరి పయనంలో ఎవరి తోడూ లేకుండా దాదాపు ఒంటరిగానే వెళ్ళవలసి వచ్చింది. దానికి సాక్ష్యం "అంతటిస్థితినుంచి, ఎంతటి స్థితికి జారిపోయాడో పాపం!" అని జాలిపడుతూ, వెంట వెళ్ళిన ఆ ఏడుగురే!
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/కస్తూరి_శివరావు" నుండి వెలికితీశారు