చెట్టుకింద ప్లీడరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎చిత్ర కథ: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 22:
 
==చిత్ర కథ==
గోపాలకృష్ణ, సుజాతను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. సుజాతను ఒక అనాధాశ్రమం లో చూసి నచ్చి పెళ్ళి చేసుకుంటాడు గోపాలకృష్ణ. తిరుపతిలో ,అతని భార్య, కొడుకులతో అన్యోనంగా జీవితాన్ని గడుపుతారు. గోపాలకృష్ణకి సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆఫీసు పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. అలా ఒక కొంత కాలం గడచిన తరువాత, గోపాలకృష్ణ ఆఫీసు పనులు ముగించుకుని ఆ రాత్రి ఇంటికి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించినట్టుగా సుజాతకు పోలీస్ స్టేషన్స్టేషను నుండి ఫోన్ వస్తుంది. గోపాలకృష్ణకి అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలు జరిగేటప్పుడు గోపాలకృష్ణ వాళ్ళ నాన్న శరభయ్య, అతని కొడుకు ఆలస్యంగా అక్కడికి వస్తారు. గోపాలకృష్ణ భార్య కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తుంది. ఒక రోజు ఆఫీస్ లో ఉండగా శరభయ్య,వాళ్ళ అబ్బాయి అక్కడికి వస్తారు వచ్చి, అమ్మాయ్ నువ్వొక్కదానివి ఈ కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం ఇబ్బందిగా ఉందేమో, మా అబ్బాయి ఆఫీస్ పనులు రాజబాబు, గోపాలకృష్ణ తమ్ముడు చూసుకుంటాడు నువ్వు ఇంట్లో ఉండి బాబు మంచి, చెడ్డ చూసుకోమ్మా అని శరభయ్య సలహా ఇస్తాడు. అందుకు సుజాత ఒప్పుకోదు. తరువాత రోజు శరభయ్య, సుజాతకు లాయర్ నోటీసు పంపిస్తాడు. అసలు ఆయనకు నాకు పెళ్ళే కాలేదని, అసలు మనకి వాళ్ళకి ఏ సంభందము లేదని లాయర్ నోటిసు పంపిస్తాడు. తాను కూడా ఒక మంచి లాయర్ కోసం వెదుకుతూ ఉండగా బాలరాజు కనిపిస్తాడు.
 
బాలరాజు (రాజేంద్ర ప్రసాద్) ఒక న్యాయవాది. ఒక డొక్కు కారు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అతనికి కేసులు వాదించడంపై పెద్దగా అవగాహన ఉండదు. కాని కేసులేమైనా దొరుకుతాయేమోనని ఆశగా ఎదురుచూస్తాడు. బాలరాజు వద్దకు సుజాత వచ్చి విషయమంతా చెప్తుంది. అప్పటి నుండి ఆకతాయిగా అల్లరిగా ఉండే, బాలరాజు ఈ కేసు పై ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ కేసు గెలిచి నేనేంటో వాళ్ళకి చూపిస్తానని అంటాడు బాలరాజు. ఈ విషయం తెలిసిన శరభయ్య బాలరాజుని చంపే ప్రయత్నం చేస్తాడు. ఒకానొక సందర్భంలో శరభయ్యకి భయపడి ఈ కేసుని వదిలేద్దామనే నిర్ణయానికి వస్తాడు బాలరాజు. సుజాత గారి దగ్గరకు వెళ్ళి, ఇదే విషయం ఆవిడకు చెబుతాడు. ఆవిడ ఏడుస్తూ బాలరాజు కాళ్ళు పట్టుకుని బాలరాజు గారు, అంత మాట అనకండి. మా బాబుని, నన్ను ఆదుర్మార్గుడి చేతిలో నుండి మమ్మలి రక్షించండి.మీరు తప్పమాకు వేరే దిక్కు లేదు. బాలరాజు ఆవిడ మాటలకు ఏ సమాధానం చెప్పలేక సరేనని చెప్పి ఆవిడని పంపిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/చెట్టుకింద_ప్లీడరు" నుండి వెలికితీశారు