షోయబ్ ఉల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

+{{వికీకరణ}}
చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
పంక్తి 18:
బానిస బంధనాల నుండి విముక్తి కోసం సాగిన ప్రపంచ ప్రజాపోరాటాల చరిత్రలో అన్నివర్గాల ప్రజానీకంతోపాటుగా కలం యోధులైన పాత్రికేయులు, సంపాదకులు పలు నిర్బంధాలకు గురయ్యారు, చిత్రహింసల పాలయ్యారు, ఆంక్షలకు-నిషేధాలకు బలయ్యారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ మహమ్మద్‌ బాకర్‌ అరుదైన త్యాగంతో 1857లో చరిత్ర సృష్టించారు. చిరస్మరణీయుడైన మహమ్మద్‌ బాకర్‌ మార్గంలో స్వేచ్ఛ-స్వాతంత్య్రాల కోసం అక్షరాలను ఆయుధంగా చేసుకుని చివరి శ్వాసవరకు పోరాడిన హైదరాబాద్‌ యోధుడు షోయాబుల్లా ఖాన్‌.
===గాంధీ విజయవాడ యాత్ర - షోయబ్ బాల్యం===
అది 1920 సంవత్సరం. జాతీయోద్యమం పరవళ్ళు తొక్కుతుంది. భారతదేశ వ్యాప్తంగా సాగుతున్న పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ విజయవాడకు వెడుతున్నారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ప్రస్తుత వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌రైల్వేస్టేషను‌ విూదుగా సాగుతోంది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు హబీబుల్లా ఖాన్‌ అను పోలీసు అధికారిని నియమించారు. ఆయన డ్యూటీలో ఉండగా గాంధీజీ ప్రయాణిస్తున్న రైలు రానే వచ్చింది. గాంధీజీని సమీపం నుండి చూసే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ డ్యూటీని ముగించుకున్న హబీబుల్లా ఖాన్‌ ఇంటికి వెళ్ళారు. ఆయన ఇల్లు చేరుకోగానే కుమారుడు పుట్టాడన్న శుభవార్త అందింది. ఆ రోజు అక్టోబరు17. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బిడ్డను చూసిన ఆయన మరింతగా సంతోషిస్తూ, అరే వీడు అచ్చం గాంధీజీ లాగే ఉన్నాడే ...అవే కళ్ళు...అదే నుదురు. అచ్చం గాంధీలానే ఉన్నాడు, అంటూ మరింత సంబరపడిపోయాడు. ఆ బిడ్డకు షోయాబుల్లా ఖాన్‌ అని నామకరణం చేసినా హబీబుల్లా ఖాన్‌ మాత్రం తన పుత్రరత్నాన్ని ఎంతో ప్రేమతో షోయాబుల్లా గాంధీ అని పిలుచుకోసాగారు.
ఆ బాలుడు చిన్నతనం నుండే, మహాత్మాగాంధీ గురించి వింటూ విద్యార్థిగా ఆయన రచనలను విస్తృతంగా చదువుతూ వచ్చాడు. ఆక్రమంలో గాంధేయ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన ఆయన గాంధీజీ బాటను తన జీవితమార్గంగా నిర్ణయించుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం షోయాబుల్లా ఖాన్‌ నుండి గ్రాడ్యుయేషన్‌ చేశారు. నైజాం సంస్థానంలో మంచి హోదాగల ఉద్యోగం లభించగల అవకాశం ఉన్నా జాతీయోద్యమానికి సేవలందించేందుకు షోయాబుల్లా ఖాన్‌ జర్నలిజంను ప్రధాన వృత్తిగా చేపట్టారు.
ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల పూర్తి నమ్మకం, గౌరవం గల షోయాబుల్లా ఖాన్‌ తొలుత నుండి నిరంకుశ పాలకులను వ్యతిరేకించారు. ఆ లక్ష్యంగా రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు. జాతీయ భావాలను ప్రోత్సహిస్తున్న తేజ్‌ ఉర్దూ వారపత్రికలో ఆయన చేరారు. ఆనాటి హైదరాబాద్‌ సంస్థానాధీశులైన నిజాం పాలకుల నిరంకుశత్యం, ఆ పాలకుల తాబేదార్లయిన రజాకారుల, భూస్వాముల అమానుషకృత్యాలను విమర్శిస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించారు. ఆయన వ్యాసాలు సహజంగానే పాలకవర్గాలకు రుచించలేదు. ఆ కారణంగా తేజ్‌ పత్రిక నిషేధానికి గురయ్యింది.
పంక్తి 38:
 
==పాత్రికేయునిగా==
సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. మొదట షోయబ్ 'తేజ్ 'అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు. పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది. తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడింది. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు. ‘పగటి ప్రభుత్వం - రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు. కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. 1948 ఆగస్టు 21వ తేదిన కాచిగూడ రైల్వే స్టేషన్స్టేషను రోడ్ లో ముష్కరులు ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నరికేశారు. [[1948]] [[ఆగస్టు 22]] న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు.నిజాం సర్కార్. షోయబ్ అంతిమయాత్రను నిషేదించింది. అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట స్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది. నిజాం ప్రభుత్వం ఈ హత్యోదంతంపై ఎలాంటి విచారణా జరపలేదు.<ref> http://www.scribd.com/doc/189173348/50-Samvatsarala-Hyd-on-Shoebullah-Khan</ref> ,<ref>http://www.10tv.in/specials/Telangana-Rebellion-Shoaibullah-Khan-Fight-against-Nizam-for-Freedom-Yodha</ref>
 
==డిమాండ్లు==
"https://te.wikipedia.org/wiki/షోయబ్_ఉల్లాఖాన్" నుండి వెలికితీశారు